BSNL ప్రీపెయిడ్ ప్లాన్‌ల వివరాలు రూ.100 లోపు

|

టెలికామ్ రంగంలో ఉన్న ప్రతి ఆపరేటర్ ఇప్పుడు టారిఫ్ ప్లాన్ యొక్క ధరలను డిసెంబర్ 1 నుండి పెంచాలని చూస్తూవుంటే బిఎస్‌ఎన్‌ఎల్ మాత్రం తన వినియోగదారులకు రూ.100ల లోపు ధరలో ఆకర్షణీయమైన ప్రీపెయిడ్ ప్లాన్‌లను అందిస్తున్నది.అన్ని ప్రైవేట్ టెల్కోలు ప్రస్తుతం రూ.100 ల లోపు గల ప్రీపెయిడ్ ప్లాన్‌లను తమ పోర్టుపోలియో నుండి తొలగించాయి.

ప్రీపెయిడ్ ప్లాన్

నాన్-జియో వాయిస్ కాలింగ్‌ ప్రయోజనంతో నెలవారీ ప్రీపెయిడ్ ప్లాన్ కోసం చూస్తున్న రిలయన్స్ జియో ప్రీపెయిడ్ యూజర్ ప్రతి నెలా కనీసం 108 రూపాయలు (రూ. 98 + రూ.10) లు ఖర్చు చేయవలసి ఉంటుంది. మరొకవైపు వొడాఫోన్ ఐడియా మరియు భారతి ఎయిర్‌టెల్ కూడా రూ.35 నుండి కనీస రీఛార్జ్ ప్లాన్‌లను అందిస్తున్నాయి.

బిఎస్‌ఎన్‌ఎల్‌

ప్రభుత్వ ఆధీనంలో ఉన్న బిఎస్‌ఎన్‌ఎల్‌ మాత్రం ప్రస్తుతం రూ .100 కింద మొత్తం ఐదు ప్రీపెయిడ్ ప్లాన్‌లను అందిస్తున్నది. ఇవి వాయిస్ కాలింగ్, డేటా మరియు ఎస్‌ఎంఎస్ ప్రయోజనాలతో ఒక నిర్దిష్ట కాలానికి అందించబడతాయి. బిఎస్ఎన్ఎల్ రెండు ఫ్రీడమ్ చోటా ప్లాన్స్, రెండు ప్రీపెయిడ్ STV ప్లాన్లు మరియు ఒక వాయిస్ కాలింగ్ ప్లాన్ ను రూ.100 లోపు అందిస్తోంది. ఇందులో అన్ని ప్రీపెయిడ్ ప్లాన్లలో 250 నిమిషాల వాయిస్ కాలింగ్ క్యాప్ ఉంది.

ఫ్రీడమ్ చోటా ప్రీపెయిడ్ ప్లాన్
 

ఫ్రీడమ్ చోటా ప్రీపెయిడ్ ప్లాన్

బిఎస్‌ఎన్‌ఎల్‌ అందిస్తున్న ఫ్రీడమ్ చోటా ప్రీపెయిడ్ ప్లాన్ యొక్క ధర రూ.9 నుండి మొదలవుతుంది. ఇది 250 నిమిషాల వాయిస్ కాల్స్, 100 mb డేటా మరియు 100 SMS ప్రయోజనాలను ఒక రోజుకు అందిస్తుంది. ఇందులో రెండవ ఫ్రీడమ్ చోటా ప్లాన్ రూ.29 ధర వద్ద ఏడు రోజుల చెల్లుబాటుతో వస్తుంది. ఇది అపరిమిత వాయిస్ కాల్స్, 300 SMSలు మరియు 1GB 3G/ 2G డేటా ప్రయోజనాలను అందిస్తుంది. ఈ ప్లాన్ ను ఎంచుకున్న వారు ముంబై మరియు డిల్లీ సర్కిల్‌లలో రోమింగ్‌లో ఉన్నప్పుడు వాయిస్ కాలింగ్ ప్రయోజనం వర్తించదని గమనించండి.

ప్రీపెయిడ్ STV ప్లాన్

ప్రీపెయిడ్ STV ప్లాన్

బిఎస్ఎన్ఎల్ అందిస్తున్న STV ప్లాన్లలో రూ.61ల ప్రీపెయిడ్ STV ప్లాన్ 15 రోజుల చెల్లుబాటుతో అపరిమిత వాయిస్ కాలింగ్ (రోజుకు 250 నిమిషాలకు క్యాప్ చేయబడి ఉంటుంది), 2 జిబి డేటా మరియు 500 SMS ప్రయోజనాలను అందిస్తుంది. మరొకటి STV 89 ప్లాన్ కూడా STV 61 మాదిరిగానే అన్ని ప్రయోజనాలను అందిస్తుంది. కాకపోతే డేటా ప్రయోజనం 10GB వరకు ఉంటుంది.

కాంబో ప్రీపెయిడ్ ప్లాన్

కాంబో ప్రీపెయిడ్ ప్లాన్

చివరగా BSNL అందిస్తున్న కాంబో ప్రీపెయిడ్ ప్లాన్ రూ.99ల ధర వద్ద లభిస్తుంది. ఇది 22 రోజుల చెల్లుబాటు కాలంతో వస్తుంది. ఈ ప్లాన్ ద్వారా SMS మరియు డేటా ప్రయోజనాలను పొందలేము. కాకపోతే దానికి బదులుగా రోజుకు 250 నిమిషాల చొప్పున అపరిమిత వాయిస్ కాలింగ్ ప్రయోజనం లభిస్తుంది. బిఎస్ఎన్ఎల్ చందాదారులు ఈ రీఛార్జితో ఉచిత పర్సనలైజ్డ్ రింగ్ బ్యాక్ టోన్ (PRBT) ను మొత్తం చెల్లుబాటు కాలానికి పొందవచ్చు. ముంబై, డిల్లీ సర్కిల్‌లలో ఉన్నప్పుడు ఎస్‌టివి 61, ఎస్‌టివి 89 మాదిరిగానే కాంబో 99 ప్లాన్‌ కూడా వాయిస్ కాలింగ్ ప్రయోజనాన్ని అందించదు అని గమనించాలి.

250 నిమిషాల వాయిస్ కాల్స్ క్యాపింగ్

250 నిమిషాల వాయిస్ కాల్స్ క్యాపింగ్

ఈ ఏడాది ఆగస్టులో బిఎస్ఎన్ఎల్ రోజువారీ వాయిస్ కాలింగ్ క్యాప్‌ను ప్రవేశపెట్టడం ద్వారా పరిశ్రమలో ఒక పెద్ద ఎత్తుగడ వేసింది. రిలయన్స్ జియో 2016 లో భారత మార్కెట్లోకి ప్రవేశించినప్పుడు మిగిలిన టెల్కోస్- ఎయిర్‌టెల్ మరియు వొడాఫోన్ ఐడియా వాయిస్ కాల్‌లను రోజుకు 250 నిమిషాలు మరియు వారానికి 1000 నిమిషాలు క్యాప్ చేసేవి. VoLTE లేదా వాయిస్ ఓవర్ LTE సర్వీస్ యొక్క వేగవంతమైన విస్తరణతో ఎయిర్టెల్ మరియు వోడాఫోన్ ఐడియా రోజువారీ & వారపు వాయిస్ కాలింగ్ పరిమితిని తొలగించాయి.

 4G VoLTE

BSNL కి ప్రస్తుతానికి అన్ని చోట్ల 4G VoLTE సేవలు లేనందున ఇది రోజుకు 250 నిమిషాలకు వాయిస్ కాల్స్ క్యాపింగ్ చేయడం ప్రారంభించింది. ఈ చర్య వలన ఇది కనీసం కొంత ఖర్చులను టెల్కోకు ఆదా చేస్తుంది. వచ్చే వారం బిఎస్ఎన్ఎల్ కూడా టారిఫ్ ధరలను పెంచుతుందని భావిస్తున్నారు కాకపోతే దాని మీద ఎటువంటి సమాచారం లేదు.

Best Mobiles in India

English summary
BSNL Prepaid Plans Rs. 100 Details in Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X