RS.555లకే రోజువారీ పరిమితి లేని BSNL బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు

|

బ్రాడ్‌బ్యాండ్ రంగంలో ప్లేయర్లందరూ మార్కెట్లో పాలనలో ప్రజల దృష్టిని ఆకట్టుకోవడానికి అనేక ప్లాన్ లను ప్రారంభిస్తున్నారు. భారత్ సంచార్ నిగం లిమిటెడ్ (బిఎస్‌ఎన్‌ఎల్) దేశంలో అతిపెద్ద బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్ ప్రొవైడర్‌గా నిలిచిందనే వాస్తవాన్ని ఎప్పటికి విస్మరించలేము. ఈ టెలికాం ఆపరేటర్ దేశవ్యాప్తంగా అత్యంత భారీ నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. అంతేకాకుండా ఇది దేశవ్యాప్తంగా తన బ్రాడ్‌బ్యాండ్ చందాదారులకు గొప్ప సర్వీస్ ను అందిస్తోంది.

 

బ్రాడ్‌బ్యాండ్

ఏదేమైనా మార్కెట్‌లోని అన్ని ఇతర బ్రాడ్‌బ్యాండ్ సర్వీసు ప్రొవైడర్ల నుండి బిఎస్‌ఎన్‌ఎల్‌ను వేరుచేసే ఒక విషయం ఒకటి ఉంది అదే రోజువారీ డేటా పరిమితితో ప్లాన్ లను అందించడం. ఇతర కంపెనీలు నెలవారీ డేటా FUPని అందిస్తున్నప్పటికీ BSNL యొక్క ప్రత్యేకమైన బ్రాడ్‌బ్యాండ్ ప్రణాళికలు ప్రీపెయిడ్ ప్లాన్‌ల మాదిరిగానే రోజువారీ డేటా FUP పరిమితితో వస్తాయి.

బిఎస్‌ఎన్‌ఎల్

కొంతమంది చందాదారులు తమ బిఎస్‌ఎన్‌ఎల్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లపై రోజువారీ డేటా పరిమితిని ఇష్టపడరు. అటువంటి వారి కోసం బిఎస్‌ఎన్‌ఎల్‌లో రోజువారీ ఎఫ్‌యుపి పరిమితికి బదులుగా నెలవారీ ఎఫ్‌యుపితో వచ్చే కొన్ని ప్రణాళికలు కూడా అందిస్తోంది.

డైలీ డేటా క్యాప్ లేని బిఎస్ఎన్ఎల్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు
 

డైలీ డేటా క్యాప్ లేని బిఎస్ఎన్ఎల్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు

రూ.555 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్

బిఎస్‌ఎన్‌ఎల్ బ్రాడ్‌బ్యాండ్ పోర్ట్‌ఫోలియోలో చౌకైన ప్లాన్ కూడా రోజువారీ డేటా క్యాప్ లేకుండా వస్తోంది. Fibro 100GB లేదా మంత్ CS106 అని పిలువబడే బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ రూ.555 ధర వద్ద లభిస్తున్నది. రాష్ట్ర నేతృత్వంలోని టెలికాం ఆపరేటర్ రూపొందించిన ఈ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ నెలలో 100 జీబీ డేటాతో 20 Mbps వేగంతో అందిస్తుంది. 100GB డేటా తరువాత చందాదారుల కోసం డేటా వేగం 1 Mbps కి తగ్గుతుంది. దీనితో పాటు చందాదారులు బిఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్‌కు ఉచిత అపరిమిత కాలింగ్ మరియు ఇతర నెట్‌వర్క్‌లకు రాత్రి 10:30 నుండి 6:00 వరకు మరియు ఆదివారం రోజు ఉచిత అపరిమిత కాలింగ్ సదుపాయం పొందుతారు.

 

రూ .749 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్

రూ .749 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్

బిఎస్ఎన్ఎల్ అందిస్తున్న తదుపరిది రూ.749ల బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్. దీనిని సూపర్ స్టార్ 300Gb ప్లాన్ అని కూడా అంటారు. ఈ ప్లాన్ పేరు సూచించినట్లుగానెల మొత్తానికి 300GB డేటాను 50 Mbps వేగంతో అందిస్తుంది. ఈ FUP డేటా అయిపోయిన తరువాత చందాదారులు డేటాను 2 Mbps వేగంతో పొందవచ్చు. ఈ ప్లాన్ ద్వారా ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత ఉచిత కాలింగ్‌ను పొందవచ్చు. అలాగే బిఎస్‌ఎన్‌ఎల్ తన వినియోగదారులకు రూ.745 మరియు అంతకంటే ఎక్కువ విలువైన అన్ని ప్లాన్‌లపై అమెజాన్ ప్రైమ్ సభ్యత్వాన్ని సంవత్సరానికి ఉచితంగా అందిస్తుంది కాబట్టి ఈ ప్లాన్ యొక్క చందాదారులు ఈ ప్రయోజనాన్ని కూడా పొందుతారు.

 అమెజాన్ ప్రైమ్ ప్రయోజనంతో వచ్చే ప్లాన్ లు

అమెజాన్ ప్రైమ్ ప్రయోజనంతో వచ్చే ప్లాన్ లు

రూ .777 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌

ఈ జాబితాలో బిఎస్ఎన్ఎల్ యొక్క మరో రూ. 777 ప్లాన్ కూడా ఉంది. ఈ ఫైబ్రో 500 జిబి ప్లాన్ డిసెంబర్ 26 వరకు చందా కోసం అందుబాటులో ఉంది. ఇది నెల మొత్తానికి 50 ఎమ్‌బిపిఎస్ వేగంతో 500 జిబి డేటాను అందిస్తుంది. అలాగే ఎఫ్‌యుపి తరువాత 2 ఎమ్‌బిపిఎస్ వేగంతో అపరిమిత డేటాను పొందవచ్చు. దీనితో పాటు ఇది అన్ని ఇతర నెట్‌వర్క్‌లకు అపరిమిత కాలింగ్‌ ప్రయోజనంను అందిస్తుంది. ఈ ప్లాన్ యొక్క చందాదారులు అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ ను ఒక సంవత్సరం పాటు ఉచితంగా పొందవచ్చు.

 

రూ .849 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌

రూ .849 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌

బిఎస్ఎన్ఎల్ తన పోర్ట్‌ఫోలియోలో వస్తున్న మరొకటి రూ .849 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌. ఇందులో రోజువారీ ఎఫ్‌యుపి పరిమితి లేకుండా మొత్తం నెలలో 600 జిబి డేటాను 50 ఎమ్‌బిపిఎస్ వేగంతో ఆస్వాదించవచ్చు. అదనపు ప్రయోజనాల విషయానికి వస్తే ఇది అన్ని ఇతర నెట్‌వర్క్‌లకు ఉచిత అపరిమిత కాలింగ్ మరియు అమెజాన్ ప్రైమ్ బెనిఫిట్‌తో వస్తుంది.

బ్రాడ్‌బ్యాండ్

100 ఎమ్‌బిపిఎస్ వేగంతో చందాదారులకు నెలకు 750 జిబి డేటాను అందించే రూ.1,277 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ కూడా మునుపటి ప్లాన్ మాదిరిగానే అన్ని ఇతర ప్రయోజనాలను అందిస్తుంది.

హై రేంజ్ బ్రాడ్‌బ్యాండ్ ప్రణాళికలు

హై రేంజ్ బ్రాడ్‌బ్యాండ్ ప్రణాళికలు

బిఎస్ఎన్ఎల్ యొక్క హై రేంజ్ బ్రాడ్‌బ్యాండ్ ప్రణాళికలు కూడా నెలవారీ FUP తో వస్తాయి. ఇందులో 100 ఎంబిపిఎస్ వేగంతో నెలకు 2000 జిబి డేటాను అందించే రూ.2999 ప్లాన్, 100 ఎంబిపిఎస్ వేగంతో 4000 జిబి డేటాను అందించే రూ.4,999 బ్రాడ్బ్యాండ్ ప్లాన్ ఉన్నాయి.

బిఎస్‌ఎన్‌ఎల్

అంతేకాకుండా బిఎస్‌ఎన్‌ఎల్ ఇప్పుడు మరొక ప్లాన్ ను కూడా చేర్చింది.దీని ధర నెలకు రూ .9,999గా ఉంది. ఇది 100 ఎమ్‌బిపిఎస్ వేగంతో నెలకు 2250 జిబి డేటాను అందిస్తుంది. అయితే ఇది ఎఫ్‌యుపి తర్వాత 8 ఎమ్‌బిపిఎస్ వేగంతో వస్తుంది. ఇతర ప్రయోజనాల విషయానికి వస్తే ఇది ఇతర నెట్‌వర్క్‌లకు ఉచిత అపరిమిత కాలింగ్ మరియు అమెజాన్ ప్రైమ్ సభ్యత్వం వంటి ప్రయోజనాలను కూడా అందిస్తుంది.

Best Mobiles in India

English summary
BSNL Broadband Plans Offers No Daily Limit at Rs. 555

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X