ఆధార్ లేని పాన్ కార్డులు చెల్లవా..?
పాన్ కార్డును ఆధార్‌తో జూన్ 30 లోపు లింక్ చేసుకోవాలని, లేకపోతే పాన్ కార్డు పనికి రాకుండా పోతుందంటూ అందరికీ ఇప్పుడు భయం పట్టుకుంది .
పాన్ కార్డును ఆధార్‌తో జూన్ 30 లోపు లింక్ చేసుకోవాలని, లేకపోతే పాన్ కార్డు పనికి రాకుండా పోతుందంటూ అందరికీ ఇప్పుడు భయం పట్టుకుంది . అయితే ఈ ఊహాగానాలన్నింటిని ఆదాయపు పన్ను శాఖ కొట్టిపారేసింది. ఆధార్‌తో లింక్ చేసుకోని పాన్ కార్డులను రద్దు చేయమని ఆదాయపు పన్ను శాఖ స్పష్టంచేసింది.
రూ.499కే మోటో సీ ప్లస్ ఫోన్, ఎలాగో తెలుసా..?

బుధవారం జారీచేసిన నోటిఫికేషన్‌లో ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది. ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురికావాల్సిసవసరం లేదని, జూన్ 30 తర్వాత పాన్ పని చేస్తుందని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు చైర్మన్ సుశిల్ చంద్రా చెప్పారు. ఆధార్‌తో లింకులేని పాన్‌లు ఎప్పుడు పనికిరాకుండా పోతాయో ఆ తేదీలను బోర్డు తర్వాత నోటిఫై చేస్తుందని తెలిపారు.

2017 జూలై వరకు ఎవరైతే పాన్ కార్డును కలిగి ఉంటారో, వారందందరూ సెక్షన్ 139ఏఏ సబ్-సెక్షన్ 2 ప్రొవిజన్స్ కింద ఆధార్ నెంబర్‌ను పాన్‌కార్డులకు లింక్ చేసుకోవాలని ఈ వారంలో మొదట్లోనే ప్రభుత్వం ఓ నోటిఫికేషన్‌లో పేర్కొంది. పాన్‌తో ఆధార్‌ను లింక్ చేసుకునే ప్రక్రియకు చివరి తేదీగా జూన్ 30ను నిర్ణయించింది.
ఐఫోన్ 7కు షాకిచ్చిన వన్‌ప్లస్ 5

దీంతో ఒక్కసారిగా పాన్‌తో ఆధార్‌ను లింక్ చేసుకునే ప్రక్రియలో ప్రజలందరూ నిమగ్నమై పోయారు. ఒకవేళ ఈ ప్రక్రియ జూన్ 30కి ముగియకపోతే, పాన్ కార్డులు పనికి రాకుండా పోతాయని ప్రజల్లో భయాందోళన చెలరేగింది. కానీ ఆధార్‌తో లింక్ లేకపోయినప్పటికీ పాన్ కార్డులు పనికి వస్తాయని తాజాగా సీబీడీటీ స్పష్టంచేసింది.


Click it and Unblock the Notifications








