చెత్త వేస్తే చాలు పుల్ వైఫై పొందొచ్చు

Written By:

చెత్త కుండీ నుంచి వైఫై వస్తుందా..?చెత్త కుండీ నుంచి వైఫై రావడమేంది మరి విచిత్రం కాకాపోతే అని అనుకుంటున్నారా..అయితే ఇది నిజం వినడానికి ఆశ్చర్యంగానూ,షాకింగ్ గానూ ఉన్నా చెత్త నుంచి వైఫై వస్తుందని చెబుతున్నారు ప్రతీక్ అండ్ రాజ్ కామర్స్ గ్రాడ్యుయేట్లు. వీరు సరికొత్త ఐడియాతో ముందుకొస్తున్నారు. దీని పేరే వైఫై ట్రాష్ బిన్. ఓ మ్యూజిక్ ఫెస్టివల్ లో పాల్గొన్నప్పుడు ఆ పార్టీలో నెట్ వర్క్ లేకపోవడంతో కాల్స్ పనిచేయక స్నేహితులను వెతకడానికి 6 గంటలు పట్టిందట.

Read more: ఇంట్లో వైఫై రాకెట్ లెక్కన దూసుకుపోవాల్సిందే

చెత్త వేస్తే చాలు పుల్ వైఫై పొందొచ్చు

దానికి తోడూ ఆ పార్టీ ఆన్ లిమిటెడ్ డ్రింక్స్ అండ్ పుడ్ కారణంగా చెత్త ఎక్కువుగా తయారయ్యింది. ఈ రెండు సంఘటనలతో వారికి వైఫై ట్రాష్ బిన్ కాన్సెప్ట్ పుట్టిందట వాళ్లకు. మీ దగ్గరలోని డస్ట్ బిన్ లో ట్రాష్ ను డంప్ చేస్తే డస్ట్ బిన్ మీకు ఒక యునిక్యూ కోడ్ ఇస్తుంది.

Read more: వైఫై గురించి మీకు తెలియాల్సిన 10 విషయాలు

చెత్త వేస్తే చాలు పుల్ వైఫై పొందొచ్చు

దీంతో ఫ్రీగా వైఫైని పొందగలరు. ఇప్పటివరకూ ఈ సెల్ఫ్ ఫండింగ్ ప్రాజెక్ట్ ఎమ్ టీఎస్ నెట్ వర్క్ నుండి సపోర్ట్ అందుకుంటుంది. ఢిల్లీ, కోల్ కతా,బెంగుళూరులో జరిగిన ఢిపరెంట్ వీకెండర్ ఫెస్టివల్ లో ఇది విజయం సాధించింది.

Read more: హైదరాబాద్‌లో 200 ఉచిత వైఫై సెంటర్లు!

ఈ ఐడియాను తెచ్చిన వారితో కంపెనీ మంతనాలు జరుపుతోంది. ఇంటర్నెట్ ప్రస్తుతం అందరికీ అవసరంగా మారింది కాబట్టి ఇది లైవ్ లోకి వస్తే ఫ్రీ ఇంటర్నెట్ తో పాటు పరిసరాలు కూడా శుభ్రంగా మారి ప్రభుత్వం కోరుకుంటున్న స్వచ్ఛ భారత్ కల సాకారమవుతుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot