Google Debit Card తో మెరుగైన పేమెంట్స్ అందివ్వనున్న గూగుల్ ...

|

ప్రస్తుతానికి మార్కెట్లో అత్యంత ఆకర్షణీయమైన క్రెడిట్ కార్డులలో ఆపిల్ కార్డ్ ఒకటి. ఇది గొప్ప కార్యాచరణలు మరియు లక్షణాలను కలిగి ఉంది. ఆపిల్ కార్డ్‌తో మీరు మీ ఐఫోన్‌లోని యాప్ తో మీ యొక్క ఖర్చులను చాలా ఖచ్చితంగా ట్రాక్ చేయవచ్చు.

గూగుల్ కార్డ్

మీరు ఆపిల్ కార్డ్ ఉపయోగించి కొనుగోళ్లు మరియు పెమెంట్స్ చేయవచ్చు. ప్రస్తుతం గూగుల్ తన మొట్టమొదటి డెబిట్ కార్డును తీసుకురావడానికి సిద్ధంగా ఉంది. లీకైన కొన్ని నివేదికల ప్రకారం వినియోగదారులు తమ యొక్క ఖర్చుల కోసం ఈ కార్డును ఉపయోగించవచ్చు. ఈ కార్డ్ మీ ఫోన్‌లోని గూగుల్ పే యొక్క యాప్ తో అనుసంధానించబడుతుంది. అలాగే ఇది మీ ఖర్చులను క్రమం తప్పకుండా ట్రాక్ చేస్తుంది. మీరు మీ కార్డ్ యొక్క బ్యాలెన్స్‌ను గూగుల్ పే యాప్ తో కూడా తనిఖీ చేయవచ్చు.

గూగుల్ యొక్క ఫీజికల్ డెబిట్ కార్డ్

గూగుల్ యొక్క ఫీజికల్ డెబిట్ కార్డ్

గూగుల్ యొక్క ఫీజికల్ డెబిట్ కార్డు చిప్ తో తయారుచేయబడి ఉండి అనేక ఆర్థిక సంస్థలను సబ్-బ్రాండ్ గా కలిగి ఉంది. ప్రస్తుతం సిటీ గ్రూప్ మరియు స్టాన్ ఫోర్డ్ ఫెడరల్ క్రెడిట్ యూనియన్ రెండు ఆర్థిక సంస్థలు గూగుల్ యొక్క ఫీజికల్ కార్డు ప్రాజెక్టులో చేర్చబడినట్లు ధృవీకరించబడ్డాయి.

గూగుల్ యొక్క డెబిట్ కార్డు

గూగుల్ యొక్క డెబిట్ కార్డు యొక్క ముఖ్య లక్ష్యం ఆన్‌లైన్ మొబైల్ పేమెంట్ సర్వీస్ అయిన గూగుల్ పే యాప్ కు ఆధారం లేదా పునాదిగా మార్చడం. అదే సమయంలో ఆపిల్ యొక్క క్రెడిట్ కార్డ్ ప్రాజెక్టుకు గోల్డ్మన్ సాచ్స్ మరియు మాస్టర్ కార్డ్ వంటి సంస్థలు మద్దతు ఇస్తున్నాయి. ఆపిల్ కార్డ్‌లో ఒక లోపం ఉంది. ఏదైనా ఖర్చు లేదా కొనుగోలు కోసం రివార్డులు మరియు క్యాష్ బ్యాక్ వంటి ప్రయోజనాలు లేవు.

టెక్ జెయింట్స్ ఫైనాన్షియల్ మార్కెట్

టెక్ జెయింట్స్ ఫైనాన్షియల్ మార్కెట్

టెక్ దిగ్గజాలు ఆర్థిక సేవలను సృష్టించే దిశగా పయనిస్తున్నాయి. ఆపిల్ గత ఏడాది ఆగస్టులో ఆపిల్ కార్డ్‌ను విడుదల చేసింది. ఇప్పుడు గూగుల్ తన కొత్త డెబిట్ కార్డుతో బయటకు వస్తోంది. అదే సమయంలో సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ కూడా లిబ్రా పేరుతో తన ఆర్థిక ఉత్పత్తిని రూపొందించడానికి కృషి చేస్తోంది.

ఫేస్బుక్

ప్రస్తుతం ఫేస్బుక్ సంస్థ పేపాల్ వంటి సారూప్య ఉత్పత్తి పోలికను సృష్టించడానికి ప్రయత్నిస్తోంది. కానీ ఇది క్రిప్టోకరెన్సీకి రూపంలో మాత్రమే ఉంటుంది. గూగుల్ యొక్క ఫీజికల్ డెబిట్ కార్డ్ ఆపిల్ కార్డ్‌కు ప్రత్యర్థిగా మార్కెట్ లోకి అడుగు పెడుతున్నది. ప్రస్తుతానికి గూగుల్ సంస్థ నుంచి క్రెడిట్ కార్డు వచ్చే ఎటువంటి సూచనలు లేవు. రాబోయే కొద్ది నెలల్లో దీని గురించి మరింత సమాచారం వెల్లడిస్తామని గూగుల్ తెలిపింది.

Best Mobiles in India

English summary
Google Debit Cards Coming Soon

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X