లాక్‌డౌన్‌లో ఆహార లభ్యతను తెలుసుకోవడానికి గూగుల్ తో జతకట్టిన Vodafone Idea

|

కరోనా వైరస్ COVID-19 వ్యాప్తిని ఆపడానికి భారత ప్రభుత్వం 21 రోజుల లాక్డౌన్ ను విధించినందున వలస కార్మికులు కొన్ని మిలియన్ల మంది ప్రజలు మరియు రోజువారీ కూలీలు ఆశ్రయం మరియు ఆహారాన్ని కనుగొనడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

 

2G ప్రీపెయిడ్ యూజర్లు

అటువంటి వ్యక్తులు ఎటువంటి ఇబ్బందులను ఎదుర్కోకుండా చూసుకోవడానికి దేశవ్యాప్తంగా 2G ప్రీపెయిడ్ చందాదారులకు తమకు దగ్గరలో గల ఆహారం లభ్యత మరియు రాత్రి ఆశ్రయం గురించి సమాచారాన్ని అందించడానికి వోడాఫోన్ ఐడియా గూగుల్ తో జతకట్టింది. గూగుల్ సంస్థ ఈ కొత్త ప్రయత్నాన్ని ట్విట్టర్ పోస్ట్ ద్వారా ఆవిష్కరించింది. 2G యూజర్లు కూడా ఇప్పుడు తమ సమీప ప్రదేశంలో ఆహారం మరియు రాత్రి ఆశ్రయం గురించి సమాచారాన్ని ఎలా పొందాలి అన్న విషయాన్ని తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

పూర్తి సమాచారాన్ని పొందే విధానం

పూర్తి సమాచారాన్ని పొందే విధానం

వోడాఫోన్ ఐడియా తన 2G ఫోన్ కస్టమర్ల కోసం గూగుల్ అసిస్టెంట్‌తో పాటు ఫోన్ లైన్‌ను ప్రవేశపెట్టింది. వోడాఫోన్ మరియు ఐడియా వినియోగదారులు 000-800-9191-000 నంబర్‌కు కాల్ చేసి పూర్తి సమాచారాన్ని కనుగొనవచ్చు. ఈ ఫోన్ కాల్ కనెక్ట్ అయిన తర్వాత వినియోగదారులు తమ అవసరాలకు అనుగుణంగా ఆహార ఆశ్రయాలను / రాత్రి ఆశ్రయాలను అడగాలి. ఆ తరువాత వారు ప్రస్తుతం ఉన్న నగరాలను ప్రస్తావించినట్లయితే వారికి సమీపంలో పనిచేసే అన్ని ఆహారం మరియు రాత్రి ఆశ్రయాలను అందిస్తారు.

గూగుల్
 

ప్రస్తుతం వినియోగదారులు కేవలం ఇంగ్లీష్ మరియు హిందీ భాషలలో కమ్యూనికేట్ చేయగలరని గూగుల్ పేర్కొంది. అయితే ఈ ఫీచర్ త్వరలో బహుళ భాషలలో కూడా లభిస్తుంది. ఆహారం మరియు రాత్రి ఆశ్రయం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించే వినియోగదారుల యొక్క ప్రస్తుత స్థానాన్ని గూగుల్ స్వయంచాలకంగా కనుగొంటుందని గమనించాలి. అయినప్పటికీ వినియోగదారుడు స్థానాన్ని మార్చాలనుకుంటే వారు కీప్యాడ్‌లోని 3 బటన్‌ను నొక్కవచ్చు.

వొడాఫోన్ ఐడియా చందాదారుల ప్రీపెయిడ్ ప్లాన్ చెల్లుబాటు పొడగింపు

వొడాఫోన్ ఐడియా చందాదారుల ప్రీపెయిడ్ ప్లాన్ చెల్లుబాటు పొడగింపు

చందాదారులు ప్రస్తుత విపత్తు సమయాల్లో ఒకరికి ఒకరు కనెక్ట్ అవ్వడానికి వోడాఫోన్ ఐడియా 2020 ఏప్రిల్ 17 వరకు దాదాపు 100 మిలియన్ ప్రీపెయిడ్ చందాదారుల యొక్క ప్రీపెయిడ్ ప్లాన్‌ల యాక్సిస్ ను పెంచింది. ఇది మాత్రమే కాదు మెరుగైన కనెక్టివిటీ కోసం వోడాఫోన్ ఐడియా రూ.10 టాక్ టైమ్ క్రెడిట్‌ను కూడా జమ చేసింది.

వొడాఫోన్ ఐడియా

ముందస్తు లాక్డౌన్ వ్యవధిలో వలస కార్మికులు మరియు రోజువారీ వేతన సంపాదించే వారు వారి యొక్క ప్రియమైనవారితో కనెక్ట్ అవ్వడానికి ఈ చర్యను ప్రారంభించారు. వొడాఫోన్ ఐడియా చందాదారులు తమ కుటుంబంతో కష్ట సమయాల్లో కనెక్ట్ అవ్వడానికి ఇబ్బంది పడకుండా చూసుకోవడానికి సంస్థ తన వంతు కృషి చేస్తున్నారు. అలాగే వొడాఫోన్ ఐడియా ఇతర టెలికాం ఆపరేటర్లతో కలిసి లాక్డౌన్ వ్యవధిలో చందాదారులకు అధిక ఆఫర్లు మరియు ప్రయోజనాలను అందించడానికి ఉపయోగపడే రుణాన్ని అందించాలని ప్రభుత్వాన్ని కోరింది.

వోడాఫోన్ ఐడియా # RechargeforGood ఫీచర్

వోడాఫోన్ ఐడియా # RechargeforGood ఫీచర్

వొడాఫోన్ ఐడియా #RechargeforGood ను ఒత్తిడితో కూడిన సమయంలో చందాదారులను ఒకరితో ఒకరు కనెక్ట్ చేయాలనే ఏకైక ఉద్దేశ్యంతో ప్రారంభించింది. వినియోగదారులు వోడాఫోన్ ఐడియా అందించిన క్యాష్‌బ్యాక్‌ను పొందాలనుకుంటే ఇప్పటికే ఉన్న ప్రీపెయిడ్ చందాదారులు మై వొడాఫోన్ యాప్ లేదా మై ఐడియా యాప్‌లోకి లాగిన్ అవ్వాలి. దాని తరువాత మరొక వోడాఫోన్ ఐడియా ప్రీపెయిడ్ కస్టమర్ కోసం రీఛార్జ్ చేయాలి. రీఛార్జ్ పూర్తయిన తర్వాత ప్రీపెయిడ్ చందాదారులు 6% వరకు క్యాష్‌బ్యాక్ పొందుతారు. చందాదారులు సంపాదించిన క్యాష్‌బ్యాక్ కూపన్ వారు చేసిన ఇతర రీఛార్జ్‌లపై ఉపయోగించవచ్చు.

Best Mobiles in India

English summary
Vodafone and Google Gives Information About Food for 2G Users

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X