అమెరికాలో అత్యధిక జీతం మన ఇండియన్‌దే

Written By:

అమెరికాలో మరోసారి ఇండియన్ సత్తా చాటారు. అమెరికాలోనే అత్యధిక వేతనం పొందుతున్న వారిలో ఇండియన్లు అగ్రస్థానాన్ని ఆక్రమించారు. వివరాల్లోకెళితే ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా బాధ్యతలు చేపట్టిన సుందర్ పిచాయ్ అమెరికాలోనే అత్యధిక వేతనం పొందుతున్న సీఈవోగా ఘనత సొంతం చేసుకున్నారు. వేతనం కింద గూగుల్ సంస్థలో 199 మిలియన్ డాలర్ల (రూ. 1353,39 కోట్లు) విలువైన వాటాలు పొందడం ద్వారా ఈ ఘనత ఆయన సొంతమైంది.

Read more : ట్విట్టర్ ట్రై చేసింది..గూగుల్ పట్టేసింది

అమెరికాలో అత్యధిక జీతం మన ఇండియన్‌దే

ఈ నెల 3 న భారత సంతతికి చెందిన పిచాయ్ పేరిట గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ 2,73,328 క్లాస్ సీ వాటాలు ఆయనకు గ్రాంట్ రూపంలో అందజేసింది. ఆ రోజున స్టాక్ మార్కెట్ ముగిసేనాటికి ఈ వాటాల విలువ 19.9 కోట్ల డాలర్లు. ఇందులో 375 క్లాస్ ఏ ఉమ్మడి వాటాలను 786,28 డాలర్ల చొప్పున, 3.625 క్లాస్ సీ మూలధన వాటాలను 768,84 డాలర్ల చొప్పున పిచాయ్ అమ్మేశారని ఆల్ఫాబెట్ సంస్థ తెలిపింది.

అమెరికాలో అత్యధిక జీతం మన ఇండియన్‌దే

మొత్తంగా గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్లో సుందర్ పిచాయ్కి 650 మిలియన్ డాలర్ల (రూ. 4420,61 కోట్ల) విలువైన వాటాలు ఉన్నాయి. అయితే, గూగుల్ స్థాపకులు ల్యారీ పేజ్, సెర్జీ బ్రిన్కు కంపెనీలో ఉన్న నికర సంపదతో పోల్చుకుంటే ఇది చాలా తక్కువ. ఫోర్బ్స్ తెలియజేసిన వివరాల ప్రకారం పేజ్కు 34.6 బిలియన్ డాలర్లు, బ్రిన్కు 33.9 బిలియన్ డాలర్ల సంపద ఉంది.

Read more: సత్యం...శివం...సుందరం

అమెరికాలో అత్యధిక జీతం మన ఇండియన్‌దే

గూగుల్ మాజీ సీఈవో ఎరిక్ షిండ్ట్కు కూడా మూడు బిలియన్ డాలర్ల సంపద ఉంది. సుందర్ పిచాయ్కే కాదు గతంలో ఆల్ఫాబెట్ సీఎఫ్ వోగా ఉన్న రూత్ పొరట్ కూడా భారీగా వేతనం పొందింది. గత ఏడాది మోర్గాన్ స్టాన్లీ చేరడానికి ముందువరకు ఆమెకు 38 మిలియన్ డాలర్ల వాటాలు వేతనంగా, 30 మిలియన్ వాటాలు బోనస్గా లభించాయి.ఈ సంధర్బంగా సుందర్ పిచాయ్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.

Read more: అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తే ఇంటర్నెట్‌ రహస్యాలు!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సుందర్ పిచాయ్ చెన్నైలో 1972లో

సుందర్ పిచాయ్ చెన్నైలో 1972లో జన్మించారు. అతని వయస్సు 43 సంవత్సరాలు.

 

 

అసలు పేరు పిచాయ్ సుందర్రాజన్

సుందర్ పిచాయ్ అసలు పేరు పిచాయ్ సుందర్రాజన్

 

 

గూగుల్ లో ప్రొడక్ట్ ఇంకా ఇన్నోవేషన్ అధికారిగా

సుందర్ పిచాయ్ గూగుల్ లో ప్రొడక్ట్ ఇంకా ఇన్నోవేషన్ అధికారిగా 2004లో నియమితులయ్యారు.

 

 

పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలో సైబెల్ స్కాలర్ గా

సుందర్ పిచాయ్ పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలో సైబెల్ స్కాలర్ గా గుర్తింపు పొందారు

 

 

తన బ్యాచిలర్ డిగ్రీని ఐఐటీ ఖరగ్‌పూర్‌ నుంచి

సుందర్ పిచాయ్ తన బ్యాచిలర్ డిగ్రీని ఐఐటీ ఖరగ్‌పూర్‌ నుంచి పొందారు.

 

 

స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుంచి మాస్టర్స్ డిగ్రీని

సుందర్ పిచాయ్ స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుంచి మాస్టర్స్ డిగ్రీని పొందారు.

 

 

గూగుల్ ఆండ్రాయిడ్, గూగుల్ డ్రైవ్,

గూగుల్ ఆండ్రాయిడ్, గూగుల్ డ్రైవ్, గూగుల్ జీమెయిల్ యాప్, గూగుల్ వీడియో కోడెక్ విభాగాలకు కీలక పాత్ర పోషిస్తున్నారు.

 

 

క్రోమ్ ఓఎస్ అలానే ఆండ్రాయిడ్ యాప్స్

క్రోమ్ ఓఎస్ అలానే ఆండ్రాయిడ్ యాప్స్ అభివృద్థిలో సుందర్ పిచాయ్ కీలక పాత్ర పోషించినందుకుగాను గూగుల్ లో ఆయనకు ప్రత్యేక గుర్తింపు లభించింది.

 

 

సుందర్ పిచాయ్‌కు 2011లో ట్విట్టర్ నుంచి ఆఫర్

సుందర్ పిచాయ్‌కు 2011లో ట్విట్టర్ నుంచి ఆఫర్ వచ్చింది. అయితే, 50 మిలియన్ డాలర్లను చెల్లించి గూగుల్ సుందర్ పిచాయ్ ను తమ వద్దే ఉంచేసుకుంది. సుందర్ పిచాయ్ కు 2011లో ట్విట్టర్ నుంచి ఆఫర్ వచ్చింది. అయితే, 50 మిలియన్ డాలర్లను చెల్లించి గూగుల్ సుందర్ పిచాయ్ ను తమ వద్దే ఉంచేసుకుంది. Show Thumbnail

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Google's Sundar Pichai becomes highest-paid CEO in US
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot