గూగుల్ సెర్చ్‌ పేజీలో ATM సెంటర్ల సమాచారం

పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ప్రజలకు సహాయపడేందుకు గూగుల్ సరికొత్త ఆలోచనతో ముందుకొచ్చింది.

|

పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ప్రజానీకం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కుంటున్న విషయం తెలిసిందే. బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన తమ నగదును విత్ డ్రా చేసుకునే క్రమంలో ఏటీఎమ్ సెంటర్ల వద్ద బారులు తీరుతున్నారు. రద్దీ ఎక్కువగా ఉండటంతో గంటల తరబడి క్యూలో నిలబడాల్సిన పరిస్ధితులు వస్తున్నాయి. ఒకవేళ అలా ఓపిగ్గా నిలుచుని ఉన్పప్పటికి, మన వంతు వచ్చే సరికి లోపల క్యాష్ ఉంటుదా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది.

గూగుల్ సెర్చ్‌ పేజీలో ATM సెంటర్ల సమాచారం

Read More : 30 నిమిషాల్లో 24 గంటల ఛార్జింగ్, ఫోన్ అంటే ఇదే!

ఈ నేపథ్యంలో ప్రజలకు సహాయపడేందుకు గూగుల్ సరికొత్త ఆలోచనతో ముందుకొచ్చింది. గూగుల్ తన సెర్చ్ పేజీలో Find an ATM near you పేరుతో ఓ నిఫ్టీ లింక్‌ను ఏర్పాటు చేసింది. ఈ లింక్ పై క్లిక్ చేయటం ద్వారా యూజన్ తన సమీపంలోని ఏటీఎం సెంటర్ల వివరాలను తెలుసుకోగలగుతారు. అయితే, ఆయా ఏటీఎమ్ లలో క్యాష్ ఉందా లేదా అనేది మాత్రం గూగుల్ చెప్పలేకపోతోంది. ఈ గూగుల్ లింక్ వెబ్ అలానే మొబైల్ వర్షన్ లోనూ డిస్ ప్లే అవుతుంది. గూగుల్ హోమ్ పేజీలోని గూగుల్ సెర్చ్ ఆప్షన్ క్రింద ఈ లింక్‌ను మీరు చూడొచ్చు.

మనకు ఓ సెర్చ్ ఇంజిన్ గానే పరిచయం..

మనకు ఓ సెర్చ్ ఇంజిన్ గానే పరిచయం..

గూగుల్ మనకు ఓ సెర్చ్ ఇంజిన్ గానే తెలుసు. కానీ, మనకు తెలియని ఎన్నో వెసలబాటులను గూగుల్ కల్పిస్తోంది. విసుగు వాతావరణంలో ఉన్న మిమ్మల్ని హుషారుపుట్టించే వాతరవణంలోకి తీసుకువచ్చే సరదా సరదా గూగుల్ టిప్స్ అండ్ ట్రిక్స్‌ను ఇప్పుడు చూద్దాం..

atari breakout

atari breakout

గూగుల్ సెర్చ్ బాక్స్‌లో "atari breakout" అని టైప్ చేసినట్లయితే. ఓ అద్బుతమైన చిన్ననాటి గేమ్ మీ కళ్ల ముందు ఆవిష్కృతమవుతుంది. ఎంచక్కా ఆ గేమ్ ను ఆస్వాదించవచ్చు.

గూగుల్ ప్యాక్‌మాన్ గేమ్
 

గూగుల్ ప్యాక్‌మాన్ గేమ్

 గూగుల్ ప్యాక్‌మాన్ గేమ్ ఎంత భారీ హిట్టో మనందరికి తెలుసు. గూగుల్ సెర్చ్‌లో pacman అని టైప్ చేయటంగా గేమ్ మీ కళ్ల ముందు ఆవిష్కృతమవుతుంది. ఎంచక్కా ఆ గేమ్‌ను ఆస్వాదించవచ్చు.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్ స్కై ఫీచర్

గూగుల్ స్కై ఫీచర్

గూగుల్ సెర్చ్ ఇంజిన్‌లోని గూగుల్ స్కై ఫీచర్ ద్వారా మన విశ్వానికి సంబంధించి బోలెడన్ని వివరాలను తెలుసుకోవచ్చు.

గూగుల్ మార్స్ ఫీచర్

గూగుల్ మార్స్ ఫీచర్

గూగుల్ సెర్చ్ ఇంజిన్‌లోని గూగుల్ మార్స్ ఫీచర్ ద్వారా మార్స్ మిషన్స్ సేకరించిన బోలెడంత డేటాను తెలసుకోవచ్చు. 4జీబి ర్యామ్, 20 ఎంపీ కెమెరా.. కేక పుట్టిస్తోన్న వివో ఫోన్!

గూగుల్ మూన్ ఫీచర్

గూగుల్ మూన్ ఫీచర్

గూగుల్ సెర్చ్ ఇంజిన్‌లోని గూగుల్ మూన్ ఫీచర్ ద్వారా అక్కడ వాతావరణాన్ని 3డీ అనూభూతులతో వీక్షించవచ్చు.

ఫైటర్ జెట్‌లో విహరించాలని ఉందా..?

ఫైటర్ జెట్‌లో విహరించాలని ఉందా..?

 గూగుల్ మీ కోసం సిద్ధంగా ఉంది. గూగుల్ ఎర్త్ అప్లికేషన్‌ను ఉపయోగించుకుని విశ్వాన్ని చుట్టిరావచ్చు. ఈ ఫీచర్‌ను యాక్టివేట్ చేసుకోవాలనుకుంటే ‘టూల్స్ మెనూ'లోకి ప్రవేశించి ‘ఎంటర్ ఫ్లైట్ స్టిమ్యులేటర్' ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవాలి.

గుల్ మ్యాప్స్

గుల్ మ్యాప్స్

ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ తన 'గూగుల్ మ్యాప్స్' ఫీచర్‌ను మరింత లైవ్లీగా మార్చే క్రమంలో ‘స్ట్రీట్ వ్యూ' అప్లికేషన్‌ను అందుబాటులోకి తెచ్చిన విషయం తెలసిందే. ఈ అప్లికేషన్ ద్వారా యూజర్లు తాము ఎక్కడ ఉన్నా, ఎక్కడికైనా వెళ్లాలనుకున్నా సదరు ప్రాంతానికి సంబంధించిన ల్యాండ్‌మార్క్‌లను, చిహ్నాలను, చారిత్రక ప్రదేశాలను త్రీడైమన్ష్‌ (3డి)లో చూసే వీలుండేలా గూగుల్ టెక్నాలజీని వృద్ది చేసింది. 2007లో ప్రారంభమైన గూగుల్ ‘స్ట్రీట్ వ్యూ'సర్వీస్ ఇప్పటికే అనేక దేశాలకు విస్తరించింది.

Zerg Rush

Zerg Rush

గూగుల్ సెర్చ్ ఇంజన్ బాక్స్‌లో ‘Zerg Rush' అని టైప్ చేసిన వెంటనే ‘o' ఆకారంలో ఉన్న ఎరుపు, పుసుపు జిర్జిలింగ్స్ తెర పై ప్రత్యక్షమై సెర్చ్ ఫలితాలను మాయం చేసేస్తుంటాయి. వీటిని అడ్డుకునే క్రమంలో మౌస్ సాయంతో ‘o'పదాలను షూట్ చేసిన సెర్చ్ ఫలితాలను కాపాడుకోవల్సి ఉంటుంది. అంతిమంగా వచ్చిన స్కోర్‌ను మిత్రులకు గూగుల్ ప్లస్ ద్వారా షేర్ చేసుకోవచ్చు.

 Flip A Coin

Flip A Coin

ప్లిప్ ఏ కాయిన్ ( Flip A Coin) ఈ పదం టైపు చేస్తే మీకు ఇలా దర్శనమిస్తుంది. ఫ్లిప్ ఇట్ అని దీన్ని చూపిస్తుంది కావాలంటే మీరూ ట్రై చేసి చూడండి. 30 నిమిషాల్లో 24 గంటల ఛార్జింగ్

Roll A Dice

Roll A Dice

రోల్ ఏ డైస్ ( Roll A Dice). దీన్ని మీరు టైపు చేసి చూస్తే నాలుగు నంబర్ వచ్చి మీకు ఇలా కనిపిస్తుంది.

లేటెస్ట్ ల్యాప్‌టాప్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Askew

Askew

Askew, ఈ పదాన్ని మీరు గూగుల్ లో సెర్చ్ చేస్తే చిత్ర విచిత్రమైన సైట్లు వస్తాయి.

Google Gravity

Google Gravity

Google Gravity, ఈ పదం టైపు చేస్తే మీ డెస్క్‌టాప్ మీద గూగుల్ పై నుంచి కిందకు వచ్చి అనేక రకాల ఆప్సన్స్ కనిపిస్తాయి. ప్రయత్నించి చూడండి.

Google Orbit

Google Orbit

Google Orbit, ఈ పదాన్ని గూగుల్ సెర్చ్ బాక్సులో టైపు చేస్తే మీకు ఇలా కనిపిస్తుంది. అదేంటో కూడా అర్థం కాదు.

చక్కటి కాలక్షేపం

చక్కటి కాలక్షేపం

ఇంటర్నెట్ బంద్ అయినప్పుడు ఈ గేమ్ మీకు చక్కటి కాలక్షేపం. వాట్సాప్ వీడియో కాల్స్‌కు ఎంత డేటా ఖర్చవుతుంది

 

గూగుల్ టైమర్

గూగుల్ టైమర్

మీ గూగుల్ ఇంటర్నెట్ బ్రౌజింగ్‌లో భాగంగా ఈ టైమర్ టూల్ మీ విలువైన సమయాన్ని ఆదా చేసే ప్రయత్నం చేస్తుంది. ఉదాహరణకు ప్రతి 20 నిమిషాలకు బ్రేక్ తీసుకోవాలనుకుంటే ‘టైమర్'ను 20 నిమిషాలకు సెట్ చేసుకోవాలి. సమయం పూర్తవగానే అలారం మోగుతుంది. గూగుల్ టైమర్ సర్వీసను వినయోగించుకోవాలంటే మీ డివైస్‌కు కచ్చితంగా స్పీకర్లు ఉండాల్సిందే. గూగుల్ సెర్జ్ బాక్సులో Google Timer అని టైప్ చేసినట్లయితే ఈ సర్వీస్ ప్రత్యక్షమవుతంది.

గూగుల్ వెడ్డింగ్స్

గూగుల్ వెడ్డింగ్స్

గూగుల్ వెడ్డింగ్స్, గూగుల్ అందిస్తోన్న ఈ సర్వీసును ఉపయోగించుకోవటం ద్వారా మీ పెళ్లికి సంబంధించి మిత్రుల ఇన్విటేషన్స్ మొదలుకుని పెళ్లి ఫోటోల వరకు ప్రత్యేకమైన ఆల్బమ్‌లా తయారుచేసుకోవచ్చు.

అంకెలను పదాల రూపంలో

అంకెలను పదాల రూపంలో

 అంకెలు కొన్ని సందర్భాల్లో మనల్ని గందరగోళానికి గురి చేస్తుంటాయి. ఈ సమస్య నుంచి మనల్ని గట్టెక్కించేందుకు గూగుల్ ఓ టూల్‌ను ప్రవేశపెట్టింది. ఉదాహరణకు గూగుల్ సెర్చ్ పేజీలో 1234567=english అని టైప్ చేసారనుకోండి. మీకీ జవాబు కనిపిస్తుంది. 1234567 = one million two hundred thirty-four thousand five hundred sixty-seven. 

కచ్చితమైన టైమ్ కోసం

కచ్చితమైన టైమ్ కోసం

కచ్చితమైన కాలమానాన్ని తెలుసుకోవాలంటే గూగుల్ సెర్చ్ బాక్సులో Time India అని టైప్ చేయండి.

గూగుల్ సెర్చ్‌ను క్యాలుక్యులేటర్‌లా..

గూగుల్ సెర్చ్‌ను క్యాలుక్యులేటర్‌లా..

గూగుల్ సెర్చ్‌ను క్యాలుక్యులేటర్‌లా ఉపయోగించుకోవచ్చు. మీ లెక్కను గూగుల్ సెర్చ్ బాక్సులో టైప్ చేసినట్లయితే గూగుల్ క్యాలిక్యూలేటర్ ప్రత్యేక్షమవుతుంది. డాలర్ టూ రూపాయి రూపాయి మారకపు విలువలను గూగుల్ సెర్చ్‌లో సులువుగా ఇంకా ఖచ్చితమైన సంఖ్యతో తెలుసుకోవచ్చు. సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ అందిస్తోన్న ప్రత్యేక ఫీచర్లలో గూగుల్ ట్రాన్సలేట్ ఒకటి. ఈ ప్రత్యేక ఫీచర్ ద్వారా మీకు చదవటం రాని భాషను సైతం మాతృభాషలోకి అనువందించుకోవచ్చు. అర్థంకాని ఆంగ్ల పదాలకు మీ మాతృభాషలో అర్థాలను తెలుసుకోవచ్చు. ఆన్‌లైన్ షాపింగ్‌తో జరభద్రం!

లేటెస్ట్ ట్యాబ్లెట్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Best Mobiles in India

English summary
Google Search steps in to help you find ATMs nearby. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X