హానర్ 5ఎక్స్.. మరో బడ్జెట్ ఫ్రెండ్లీ సంచలనం

By Sivanjaneyulu
|

Huawei నుంచి విడుదలవుతోన్న హానర్ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లకు భారతీయులు బ్రహ్మరథం పడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హానర్ సిరీస్ నుంచి మరో శక్తివంతమైన బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌‍ఫోన్‌‍ను మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు హువావీ సన్నాహాలు చేస్తుంది.

హానర్ 5ఎక్స్.. మరో బడ్జెట్ ఫ్రెండ్లీ సంచలనం

హానర్ సిరీస్ నుంచి జనవరి 28న రాబోతున్న ఈ మిడ్ రేంజర్ స్మార్ట్‌ఫోన్ పేరు 'హానర్ 5ఎక్స్'. గతేడాది విడుదలైన హానర్ 4ఎక్స్‌కు అప్‌డేటెడ్ వర్షన్‌గా 5ఎక్స్ రాబోతోంది. ఫింగర్ ప్రింట్ స్కానర్ ఫీచర్ ఈ ఫోన్‌కు ప్రధాణ ఆకర్షణగా నిలుస్తుంది. ఈ ఫీచర్ పోన్ సెక్యూరిటీ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుంది.

0.9 సెకన్ల వ్యవధిలో 10,000 కే4 నోట్ ఫోన్‌లు అమ్మిన అమోజాన్ ఇండియా

ఖచ్చితమైన వేగంతో స్పందించే సెకండ్ జనరేషన్ ఫ్రేమ్ - ఫ్రీ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను 5ఎక్స్ ఫోన్‌లో హువావీ పొందుపరిచింది. ఫోన్‌ను లాక్ లేదా అన్‌లాక్ చేసేందుకు ఈ సెన్సార్ కేవలం 0.5 సెకన్ల సమయాన్ని మాత్రమే తీసుకుంటుంది. 5 ఫింగర్ ప్రింట్‌ల వరకు ఈ సెన్సార్ రికార్డ్ చేయగలదు. 360 డిగ్రీ ఇంప్రెషన్‌లను సైతం యాక్సప్ట్ చేస్తుంది. అంతేకాదు, తడి చేతులతోనూ ఈ సెన్సార్‌ను వాడుకోవచ్చు.

మోటరోలా నుంచి 'కింద పడినా పగలని ఫోన్'

ఫోన్ డిజైనింగ్ విషయంలోనూ ప్రీమియమ్ ఎలిమెంట్స్‌ను కలిగి ఉంది. ప్రీమియమ్ డైమండ్ పాలిషుడ్ అల్యుమినియమ్ అలాయ్ కేసింగ్‌తో వస్తోన్న ఈ మెటల్ బాడీ ఫోన్‌కు హైడెఫినిషన్ డిస్‌ప్లే, ఆక్టా‌కోర్ చిప్‌సెట్, 13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా వంటి ఫీచర్లు మరింత కలిసి వస్తాయి.

Asus నుంచి శక్తివంతమైన ఫోన్, 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో

హానర్ 5ఎక్స్ స్మార్ట్‌ఫోన్ ప్రధాన స్పెక్స్

హానర్ 5ఎక్స్ స్మార్ట్‌ఫోన్ ప్రధాన స్పెక్స్

ఈ మెటల్ బాడీ ఫోన్ ప్రీమియమ్ డైమండ్ పాలిషుడ్ అల్యుమినియమ్ అలాయ్ కేసింగ్‌తో వస్తోంది.

హానర్ 5ఎక్స్ స్మార్ట్‌ఫోన్ ప్రధాన స్పెక్స్

హానర్ 5ఎక్స్ స్మార్ట్‌ఫోన్ ప్రధాన స్పెక్స్

5.5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్1920x1080పిక్సల్స్)

హానర్ 5ఎక్స్ స్మార్ట్‌ఫోన్ ప్రధాన స్పెక్స్

హానర్ 5ఎక్స్ స్మార్ట్‌ఫోన్ ప్రధాన స్పెక్స్

స్నాప్‌డ్రాగన్ 615 ఆక్టా‌కోర్ ప్రాసెసర్ విత్ 2జీబి ర్యామ్

హానర్ 5ఎక్స్ స్మార్ట్‌ఫోన్ ప్రధాన స్పెక్స్

హానర్ 5ఎక్స్ స్మార్ట్‌ఫోన్ ప్రధాన స్పెక్స్

ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆధారంగా అభివృద్ధి చేసిన Huawei's EMUI 3.1 సాఫ్ట్‌వేర్

హానర్ 5ఎక్స్ స్మార్ట్‌ఫోన్ ప్రధాన స్పెక్స్

హానర్ 5ఎక్స్ స్మార్ట్‌ఫోన్ ప్రధాన స్పెక్స్

13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా

హానర్ 5ఎక్స్ స్మార్ట్‌ఫోన్ ప్రధాన స్పెక్స్

హానర్ 5ఎక్స్ స్మార్ట్‌ఫోన్ ప్రధాన స్పెక్స్

16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం.

హానర్ 5ఎక్స్ స్మార్ట్‌ఫోన్ ప్రధాన స్పెక్స్

హానర్ 5ఎక్స్ స్మార్ట్‌ఫోన్ ప్రధాన స్పెక్స్

ఫింగర్ ప్రింట్ స్కానర్ ఫీచర్ ఫోన్ కు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. శక్తివంతమైన 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని ఫోన్‌లో పొందుపరిచారు. ఫోన్ ధర రూ.10,200

Best Mobiles in India

English summary
Honor 5X incoming: A mid range smartphone with metal chassis and a sensible fingerprint scanner. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X