రెడ్‌మి నోట్ 4కి సవాల్ విసురుతున్న హానర్ 6ఎక్స్

Written By:

హువాయి తన సరికొత్త స్మార్ట్‌ఫోన్ హానర్ 6ఎక్స్‌ను ఇండియా మార్కెట్లో రిలీజ్ చేసింది. గతేడాది ప్రవేశపెట్టిన హానర్ 5 ఎక్స్ విజయవంతం కావడంతో దాన్ని అప్ గ్రేడ్ వర్సన్ లో హానర్ కంపెనీ ఈ సరికొత్త ఫోన్ ని లాంచ్ చేసింది. 3జిబి, 4జిబి రెండు వేరియంట్‌లో ఈ ఫోన్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది. 3జిబి వేరియంట్ ధరను రూ. 12 999గా నిర్ణయించింది.

బిఎస్ఎన్ఎల్ మూడు నెలలు ఉచిత కాల్స్

రెడ్‌మి నోట్ 4కి సవాల్ విసురుతున్న హానర్ 6ఎక్స్

అమెరికాలో ఇదే ఫోన్ ధర రూ. 16,996గా ఉంది. ఫీచర్ల విషయానికొస్తే 5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ ఐపీఎస్ డిస్‌ప్లే తో ఫోన్ వచ్చింది. 1080 x 1920 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ తో చిత్రాలను వీక్షించవవచ్చు. ఆక్టాకోర్ ప్రాసెసర్, మాలి టి830 ఎంపీ2 గ్రాఫిక్స్ కార్డుతో గేమ్స్ ఆడుకునే వారు ఓ కొత్త అనుభూతిని పొందవచ్చు.

అదిరే ఫీచర్లు, చౌకైన ధర

రెడ్‌మి నోట్ 4కి సవాల్ విసురుతున్న హానర్ 6ఎక్స్

ర్యామ్ విషయానికొస్తే 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్. హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మలో ఆపరేటింగ్ సిస్టం. 12ఎంపీ రేర్ కెమెరాతో పాటు, 2 మెగాపిక్సల్ డ్యుయల్ రియర్ కెమెరాలు ఉన్నాయి.

గూగుల్ ప్లే స్టోర్‌లో ఫేక్ యాప్స్ గుర్తుపెట్టడం ఎలా..?

రెడ్‌మి నోట్ 4కి సవాల్ విసురుతున్న హానర్ 6ఎక్స్

8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరాతో సెల్పీ షూట్లు చేయవచ్చు. ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.1, 3340 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ లాంటివి అదనపు పీచర్లు.

English summary
Honor 6X with dual-camera setup launched for Rs. 12,999 read more at gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot