గూగుల్ ప్లే స్టోర్‌లో ఫేక్ యాప్స్ గుర్తుపెట్టడం ఎలా..?

Written By:

మన చేతిలో ఆండ్రాయిగ్ ఫోన్ ఉంటే చాలు గూగుల్ ప్లో స్టోర్‌లో కెళ్లి రకరకాల యాప్స్ డౌన్‌లోడ్ చేస్తుంటాం. వాటిల్లో ఒరిజినల్ యాప్స్ ఏవో ఫేక్ యాప్స్ ఏవో తెలియకుండానే వాటిని డౌన్‌లోడ్ చేసేస్తుంటాం. ఫేక్ యాప్స్‌తో జాగ్రత్తగా లేకుంటే ఫోన్‌లోకి వైరస్ వచ్చే ప్రమాదం లేకపోలేదు. ఈ నేపథ్యంలో ఫేక్ యాప్స్ ఎలా గుర్తు పట్టాలన్న దానిపై కొన్ని టిప్స్ ఇస్తున్నాం చూడండి.

వివో వీ5 ప్లస్ మార్కెట్లో సత్తా చాటుతుందా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

యాప్‌ పబ్లిషర్‌ గురించి

స్మార్ట్‌ఫోన్‌ మొబైల్‌లో ప్లేస్టోర్‌ నుంచి యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసే ముందు ఆ యాప్‌ పబ్లిషర్‌ గురించి తెలుసుకోండి. మీరు ఇప్పటి వరకు ఆ పబ్లిషర్‌ పేరు విన్నారా లేదా గుర్తించండి. జెన్యూన్‌ కంపెనీకి సంబంధించిన యాప్‌ అయినట్లు గుర్తించాకే దాన్ని డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.

డెవలపర్ ప్రొఫైల్ కూడా

దీంతోపాటు డెవలపర్ ప్రొఫైల్ కూడా చెక్ చేసుకుంటే మంచిది. వాటిల్లో ఎడిటర్స్ చాయిస్ కాని లేకుంటే టాప్ డెవలపర్ ఉన్న వాటిని డౌన్ లోడ్ చేసుకోవడం మేలు.

గూగుల్‌లో సెర్చ్‌

ఏదైనా కొత్త యాప్‌ గురించి తెలుసుకోవాలంటే.. అది కొత్తదా లేక పాతదా మొదటగా గుర్తించాల్సి ఉంటుంది. గూగుల్‌లో సెర్చ్‌ చేసిన యాప్‌కు సంబంధించిన సమాచారంతో, ప్లేస్టోర్‌లో ఇచ్చిన సమాచారాన్ని సరిచూసుకోవాలి. అప్పుడు నకిలీ ఏదో, అసలు ఏదో ఇట్టే కనిపెట్టేయ్యవచ్చు.

రేటింగ్‌ ద్వారా

ఒక యాప్‌ను డౌన్‌లోడ్‌ చేయాలంటే ప్లేస్టోర్‌కి వెళ్లి డౌన్‌లోడ్‌ చేస్తాం. అయితే ఆ యాప్‌కు కొందరు వ్యక్తులు ఇచ్చిన రేటింగ్‌ ద్వారా అది అసలో లేదా నకిలీయో ఇట్టే గుర్తు పట్టవచ్చు. రివ్యూస్‌లో ఇచ్చిన సమాచారంతో యాప్‌ నకిలీయో లేదా ఒరిజినల్‌లో గుర్తు పట్టేయ్యవచ్చు.

వీడియో

ఒరిజినల్‌ యాప్‌లకు సంబంధించి ఖచ్చితంగా ఓ వీడియోను అప్‌లోడ్‌ చేస్తారు.ఆ వీడియోలను చూసి కూడా నకిలీయా..? అసలా..? అన్నది ఇట్టే కనిపెట్టవచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
How to Identify Fake Apps in the Google Play Store Read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot