ఎయిర్‌టెల్ సర్‌ప్రైజ్ ప్లాన్‌

Posted By:

భారత్‌లో బ్రాడ్‌బ్యాండ్ సేవలు మరింతగా విస్తరించాలంటే వినియోగం మరింతగా పెరగాల్సి ఉంది. ఫైబర్ ఆప్టిక్ కేబులింగ్ అందుబాటులోకి రావటంతో వేగవంతమైన బ్రాడ్‌బ్యాండ్‌ను మనం ఆస్వాదించగలుగుతున్నాం.

ఎయిర్‌టెల్ సర్‌ప్రైజ్ ప్లాన్‌

భారత్‌లో బ్రాడ్‌బ్యాండ్ తీరుతెన్నులను పరిశీలించినట్లయితే గతంలో బ్రాడ్‌బ్యాండ్  వేగం 2ఎంబీపీఎస్ నుంచి 4 ఎంబీపీఎస్ వరకు మాత్రమే అందుబాటులో ఉండేది. 2015 నాటికి ఈ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. వాడుతున్న నెట్‌వర్క్ అలానే ఏరియాను బట్టి 16ఎంబీపీఎస్ వేగంతో బ్రాడ్‌‌బ్యాండ్‌ను ఆస్వాదించగలుగుతున్నాం. ఈ నేపథ్యంలో దేశీయంగా బ్రాడ్‌బాండ్ సేవలను అందిస్తోన్న ప్రముఖ టెలికామ్ ఆపరేటర్లు వినియోగదారులను ఆకట్టుకునే క్రమంలో రకరకాల ఆఫర్లను అందిస్తున్నాయి.

See Also : రూ.4,999కే లెనోవో ‘టాబ్ 2 ఏ7-20'

ఈ క్రమంలో సరికొత్త ఫెయిర్ యూసేజ్ ప్లాన్‌తో ఎయిర్‌టెల్ తమ వినియోగదారులను ఆకట్టుకుంటోంది. తమ FUP ప్లాన్‌లో భాగంగా 80జీబి సామర్థ్యంతో కూడిన 16ఎంబీపీఎస్ కనెక్షన్‌ను (నెల రోజుల వ్యాలిడిటీతో) రూ.1899కే అందిస్తోంది. అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ బెనిఫిట్స్ కూడా ఈ కనెక్షన్‌కు వర్తిస్తాయి.

See Also : ఏపీలో 4 మొబైల్ తయారీ ప్లాంట్‌లకు మోదీ శంకుస్థాపన

జూన్ 30, 2015 తరువాత ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను ఎంపిక చేసుకున్న డీఎస్ఎల్ బ్రాడ్‌బ్యాండ్ కస్టమర్‌లకు ఎయిర్‌టెల్ స్పెషల్ ఆఫర్లను అందిస్తోంది. వీరికి  ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్ సర్‌ప్రైజ్ ఆఫర్‌ కింద కరెంట్ డేటా క్యాపబులిటీ పై ఉచిత డేటాను ప్రొవైడ్ చేయటంతో పాటు స్పీడ్ హైక్స్ ఇంకా డిస్కౌంట్‌లను ఎయిర్‌టెల్ అందిస్తోంది. ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్ యూజర్లు పొందే సర్‌ప్రైజ్ ఆఫర్లు.. 

See Also : సామ్‌సంగ్ ఫోన్‌ల పై 20 బెస్ట్ ఆఫర్లు

- డౌన్‌లోడింగ్ లిమిట్‌ను అప్‌గ్రేడ్ చేసుకోవటం ద్వారా ఉచిత డేటా ప్యాక్స్ పొందే అవాకశం,
- ఉచిత స్పీడ్ అప్‌గ్రేడ్
- కొత్త కనెక్షన్ బిల్స్ పై 30% శాతం వరకు డిస్కౌంట్

See Also : 3జీబి ర్యామ్, 4జీ ఎల్టీఈతో ‘Intex Cloud Swift'

ఎయిర్‌టెల్ అందిస్తోన్న ఈ ఆఫర్లను సద్వినియోగం చేసుకోవాలనుకుంటే Airtel Broadband Surprise pageలోకి వెళ్లి మీ డీఎస్ఎల్ ఐడీ లేదా ల్యాండ్‌లైన్ నెంబర్‌ను STD codeతో సహా సబ్మిట్ చేయండి.

ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్ సర్‌ప్రైజ్ ప్లాన్‌కు సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకునేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి.

English summary
How broadband has come a long way in India. Read More in Telugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot