పాకిస్తాన్ పై ‘దెబ్బకు దెబ్బ’

Posted By:

భారత్ పాక్‌ల మధ్య సైబర్ వార్ పతాక స్థాయికి చేరుకుంది. కేరళ ప్రభుత్వానికి సంబంధించి అధికారిక వెబ్‌సైట్‌ను హ్యాక్ చేసి కవ్విపు చర్యలకు పాల్పడిన పాక్ సైబర్ టీం పై భారత్ హ్యాకర్లు కౌంటర్ అటాక్‌ను ప్రారంభించారు.

Read More :  దీపావళి కానుకగా రాబోతున్న 20 స్మార్ట్‌ఫోన్‌లు

పాక్‌కు చెందిన దాదాపు 250 వెబ్‌సైట్‌లను తమ ఆధీనంలోకి తెచ్చుకున్న భారత హ్యాకర్లు పాక్‌కు గట్టి సవాల్‌ను విసిరారు. హ్యాక్ కాబడిన పాక్ వెబ్‌సైట్‌లలో నాలుగు ప్రభుత్వ వెబ్‌సైట్‌లు ఉన్నట్లు సమాచారం.

Read More : షాపింగ్ మాల్‌లో ‘కిలాడీ కీచకుడు'

కేరళ వెబ్‌సైట్‌ను హ్యాక్ చేసినందుకు తాము ఈ పనిచేసామని భాతర సైబర్ వ్యవస్థకు దూరంగా ఉండటం చాలా మంచిదంటూ పాక్ సైబర్ టీమ్‌కు భారత్ హ్యాకర్లు గట్టి వార్నింగ్ ఇచ్చారు. రెండు దేశాల మధ్య కారు చిచ్చులా ఏర్పడిన ఈ సైబర్ యుద్ధం ఎంత వరకు వెళుతుందో చూడాలి..

Read More : USB Type-C అంటే ఏంటి..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మీ వాట్సాప్ అకౌంట్‌ సేఫ్ జోన్‌లో ఉండాలంటే..?

హ్యాకర్ల బారి నుంచి మీ వాట్సాప్ అకౌంట్‌ను రక్షించుకునేందుకు పబ్లిక్ వై-ఫైకు దూరంగా ఉండండి. హ్యాకర్ల బారి నుంచి మీ వాట్స్‌యాప్ అకౌంట్‌ను రక్షించుకునేందుకు గుర్తుతెలియన నంబర్లను బ్లాక్ చేయండి.

మీ వాట్సాప్ అకౌంట్‌ సేఫ్ జోన్‌లో ఉండాలంటే..?

 యాప్‌ను రీఇన్‌స్టాల్ చేసిన సమయంలో కొన్నిసార్లు పాత సంభాషణలు మిస్ అవుతుంటాయి. ఈ సమస్యను అధిగమించేందుకు ఆండ్రాయిడ్ యూజర్లు తమ స్మార్ట్‌ఫోన్‌లోని వాట్స్‌యాప్ సెట్టింగ్స్‌లోకి ప్రవేశించి చాట్ సెట్టింగ్స్‌ను సెలక్ట్ చేసుకుని చాట్ సంభాషణ ఆప్షన్‌ను ఎంపిక చేసుకున్నట్లయితే పాత సంభాషణలను తిరిగి పొందవచ్చు.

మీ వాట్సాప్ అకౌంట్‌ సేఫ్ జోన్‌లో ఉండాలంటే..?

మీ స్మార్ట్‌ఫోన్‌‍లోని వాట్సాప్ సందేశాలను లాక్ చేయటం ద్వారా మీ వాట్స్‌యాప్ అకౌంట్ సెక్యూరిటీ స్థాయిని మరింత పటిష్టం చేయవచ్చు. ఇందుకుగాను గూగుల్‌ప్లే స్టోర్‌లో వాట్సాప్ లాక్ పేరుతో ఓ ఉచిత యాప్ లభ్యమవుతోంది. ఈ యాప్‌ను ఇన్స్‌స్టాల్ చేసుకున్నట్లయితే మీ స్మార్ట్‌ఫోన్‌లోని వాట్స్‌యాప్ సందేశాలను లాక్ చేసుకోవచ్చు.

మీ వాట్సాప్ అకౌంట్‌ సేఫ్ జోన్‌లో ఉండాలంటే..?

మీ లొకేషన్‌ను వేరొకరితో షేర్ చేసుకోవాలంటే చాట్‌లోని టెక్స్ట్ బాక్స్‌లో ఎడమ చేతి వైపు కనిపించే arrow icon పై క్లిక్ చేసి షేర్ లొకేషన్‌ను సెలక్ట్ చేసుకోండి. తరువాతి సూచనలను అనుసరించటం ద్వారా మీ లోకేషన్‌ను వేరొక వాట్సాప్ మిత్రునికి షేర్ చేయవచ్చు.

మీ వాట్సాప్ అకౌంట్‌ సేఫ్ జోన్‌లో ఉండాలంటే..?

 మీ వాట్సాప్ అకౌంట్‌లో ఇన్‌కమింగ్ మెసేజ్‌లకు సంబంధించి ప్రివ్యూలు పుష్ నోటిఫికేషన్స్ రూపంలో కనిపిస్తుంటాయి. ఇలాంటి సమయంలో వీటిని వేరొకరు చూసే అవకాశముంది కాబట్టి ఈ ఆప్షన్‌ను ఆఫ్ చేసుకోవటం మంచిది. సెట్టింగ్స్‌లోని నోటిఫికేన్స్‌లోకి వెళ్లి ‘షో ప్రివ్యూ' ఆఫ్షన్‌ను ఆఫ్ చేసుకుంటే సరి.

మీ వాట్సాప్ అకౌంట్‌ సేఫ్ జోన్‌లో ఉండాలంటే..?

మీ అకౌంట్ చాట్ సెట్టింగ్స్‌లోని ‘ఇన్‌కమింగ్ మీడియా' ఆప్షన్‌ను ఆఫ్ చేసి ఉంచండి. తద్వారా ఫోన్ మెమరీ బోలేడంత ఆదా అవుతుంది.

మీ వాట్సాప్ అకౌంట్‌ సేఫ్ జోన్‌లో ఉండాలంటే..?

ఫోటోరోల్‌లో కనిపిస్తున్న వాట్స్‌యాప్ ఫోటోలను బ్లాక్ చేయండి.

మీ వాట్సాప్ అకౌంట్‌ సేఫ్ జోన్‌లో ఉండాలంటే..?

మీ ప్రొఫైల్ ఫోటో, కాంటాక్ట్స్‌కు మాత్రమే షేర్ అయ్యే విధంగా సెట్టింగ్స్‌ను మార్చుకోండి. ఇలా చేయాలంటే మీ వాట్స్ యాప్ అకౌంట్ ప్రైవసీ మెనూలోకి వెళ్లి ఫ్రొఫైల్ పిక్షర్ షేరింగ్‌ను "contacts only" గా మార్చుకోండి.

 

మీ వాట్సాప్ అకౌంట్‌ సేఫ్ జోన్‌లో ఉండాలంటే..?

ఆన్‌లైన్ స్కామ్‌లకు దూరంగా ఉండండి. మోసపూరిత సందేశాలను నమ్మి ఆన్‌లైన్ స్కామ్‌లలో ఇరుక్కోకండి. గుర్తుతెలియన నంబర్లను బ్లాక్ చేయండి.

మీ వాట్సాప్ అకౌంట్‌ సేఫ్ జోన్‌లో ఉండాలంటే..?

ఒక‌వేళ మీ ఫోన్ పోయినట్లయితే వెంటనే మీ వాట్స్‌యాప్ అకౌంట్‌ను డీయాక్టివేట్ చేసేయండి.

 

మీ వాట్సాప్ అకౌంట్‌ సేఫ్ జోన్‌లో ఉండాలంటే..?

మీ వ్యక్తిగత వివరాలను వాట్స్‌యాప్ ద్వారా షేర్ చేయవద్దు.

 

మీ వాట్సాప్ అకౌంట్‌ సేఫ్ జోన్‌లో ఉండాలంటే..?

 వాట్స్‌యాప్ వెబ్ ఫీచర్‌ను వినియోగించుకున్న తరువాత లాగ్‌అవుట్ కావటం మర్చిపోవద్దు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Indian Hackers Launch Counter Attack. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot