కోటి మంది పెట్టుకున్న పాస్‌వర్డ్ ఇదే !

2016లో కోటి మంది పెట్టుకున్న పాస్‌వర్డ్ 123456

By Hazarath
|

ప్రపంచంలో అకౌంట్ సెక్యూరిటీ అనేది ఎంత బలహీనంగా ఉందో ఈ వార్తే చూస్తే ఇట్టే అర్థమవుతుంది.మన వ్యక్తిగత సమాచారానికి, అలాగే వ్యక్తిగత అకౌంట్లకు ఇచ్చే పాస్‌వర్డ్ లు ఎంతో రక్షణగా ఉండాలని అందరూ కోరుకుంటారు. అయితే ఈ పాస్‌వర్డ్‌లకు సంబంధించి కీపర్‌ సెక్యూరిటీ కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

ఊహించని ధరలో రెడ్‌మి నోట్ 4

password

2016లో దాదాపు కోటి మంది వినియోగదారులపై నిర్వహించిన సర్వేలో '123456' అంకెల వరుసను ఎక్కువ మంది పాస్‌వర్డ్‌గా పెట్టుకున్నట్లు ఈ సర్వేలో వెల్లడైంది. గతేడాది 10మిలియన్ల ఖాతాలను హ్యాక్‌ చేసి ఇంటర్నెట్‌లో బహిర్గతం చేసిన సంగతి తెలిసిందే.

జియో దెబ్బ, డేటా ప్యాక్‌లపై వొడాఫోన్ బంఫరాఫర్

password

ఆ ఖాతాలపై ఈ సంస్థ సర్వే నిర్వహించింది. చాలా మంది ఆన్‌లైన్‌ వినియోగదారులు ఒకే పాస్‌వర్డ్‌ను పెట్టుకోవడమనేది ఆశ్చర్యమే కాదు, ఆందోళన కలిగించే విషయం. దీనితో పాటు '123456789' సంఖ్యను పాస్‌వర్డ్‌గా ఎంపిక చేసుకున్న వాళ్లు రెండోస్థానంలో ఉండగా.. కీ బోర్డులోని ఆంగ్ల అక్షరాల వరుస 'క్యూడబ్యూఈఆర్‌టీవై' పాపులర్‌ పాస్‌వర్డ్‌గా మూడో స్థానంలో నిలిచింది.

కొత్త టెక్నాలజీతో Bsnl మరో సంచలనం

password

వీటితో పాటు ఆంగ్లపదాలు 'పాస్‌వర్డ్‌', 'పాస్‌వర్డ్‌1234'లుగా పెట్టుకోవడం భద్రత కాదని నిపుణులు తెలుపుతున్నారు. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే మొదటికే మోసం వచ్చే అవకాశం లేకపోలేదు.

Best Mobiles in India

English summary
It’s true, ‘123456’ was the most common password of 2016 read more at gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X