కొత్త టెక్నాలజీతో Bsnl మరో సంచలనం

Written By:

ప్రభుత్వ రంగ దిగ్గజం బిఎస్ఎన్ఎల్ మరో సంచలనానికి సిద్ధమైంది. సరికొత్త టెక్నాలజీతో ముందుకు దూసుకొస్తోంది. ఈ టెక్నాలజీ ద్వారా డౌన్ లోడ్ వేగం 100 ఎంబీపీఎస్ వరకు ఉంటుందని కంపెనీ తెలిపింది. దేశంలో కొత్త కష్టమర్ల పరంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో బిఎస్ఎన్ఎల్ టాప్ ప్లేస్ లోకి దూసుకెళ్లింది. దీంతో కంపెనీ మరిన్ని ఆఫర్లను ప్రవేశపెట్టి కష్టమర్లను ఆకట్టుకోవాలని చూస్తోంది.

ట్రంప్ ఐఫోన్, ఖరీదెంతో తెలుసా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఆరు నెలల్లో 4జీ సేవలను

బీఎస్ఎన్ఎల్ ఆరు నెలల్లో 4జీ సేవలను ప్రారంభిస్తోంది. ఇందులో భాగంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో తొలి విడతగా 1,150 టవర్లు ఏర్పాటు చేస్తోంది. మొబైల్ డేటా ఆఫ్లోడ్ (ఎండీవో) సేవలను మార్చికల్లా అందుబాటులోకి తెస్తామని బీఎస్ఎన్ఎల్ తెలంగాణ టెలికం సర్కిల్ సీజీఎం ఎల్.అనంతరామ్ తెలిపారు.

వేగవంతమైన ఇంటర్నెట్

బీఎస్ఎన్ఎల్ మొబైల్ డేటాను వాడుతున్న కస్టమర్ వైఫై హాట్స్పాట్ ఉన్న ప్రాంతానికి వెళ్లగానే అంతరాయం లేకుండా వేగవంతమైన ఇంటర్నెట్ను వాడేందుకు ఎండీవో టెక్నాలజీ తోడ్పడుతుందన్నారు.

వెక్టర్ వీడీఎస్ఎల్ టెక్నాలజీ

బ్రాడ్ బ్యాండ్లో 24 ఎంబీపీఎస్ డౌన్లోడ్ వేగం అందిస్తున్నామని, కొద్ది రోజుల్లో వెక్టర్ వీడీఎస్ఎల్ టెక్నాలజీతో 100 ఎంబీపీఎస్ వరకు వేగాన్ని ఆఫర్ చేస్తామన్నారు.

ప్రతి నెల కొత్తగా 2 లక్షల మంది మొబైల్ కస్టమర్లు

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో బీఎస్ఎన్ఎల్కు ప్రతి నెల కొత్తగా 2 లక్షల మంది మొబైల్ కస్టమర్లు వచ్చి చేరుతున్నారు. కొత్త కస్టమర్ల సంఖ్యాపరంగా చూస్తే దేశంలో తెలుగు రాష్ట్రాలు తొలి స్థానంలో ఉన్నాయి.

మార్చికల్లా ఈ సంఖ్య ఒక కోటి

మొత్తం మొబైల్ చందాదారుల సంఖ్య ప్రస్తుతం 97 లక్షలుంది. మార్చికల్లా ఈ సంఖ్య ఒక కోటి దాటనుంది. ఇదే జరిగితే మూడో స్థానంలో ఉన్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లు టాప్-1కు చేరతాయి.

మరో 3,000 హాట్స్‌స్పాట్స్

4.5 జీ టెక్నాలజీతో కూడిన వైఫై హాట్స్పాట్స్ 518 నెలకొల్పారు. డిసెంబర్కల్లా మరో 3,000 హాట్స్‌స్పాట్స్ జతకూడతాయని అనంతరామ్ వెల్లడించారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
BSNL to start 4G services after April, says CMD Anupam Shrivastava: Report read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot