జియోలు ఎన్ని వచ్చినా నంబర్ వన్ మాదే: Airtel సంచలన వ్యాఖ్యలు

Written By:

రిలయన్స్ జియో vs ఎయిర్‌టెల్‌ల మధ్య ఇప్పుడు అసలైన పోరుకు తెరలేచింది. జియో తమకు ప్రధాన ప్రత్యర్థి అయినప్పటికీ మార్కెట్లో మాదే ఆధిపత్యమని ఎయిర్‌టెల్‌ అధినేత సునీల్ మిట్టల్ కుండబద్దలు కొట్టారు. రెండింటి మధ్య ఇప్పటికే ఇంటర్ కనెక్షన్ వార్ మొదలైన నేపథ్యంలో మిట్టల్ ఇప్పుడు చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. సునీల్ మిట్టల్ ఇంటర్యూలో చెప్పిన హైలెట్స్ పాయింట్స్ ఏంటో చూద్దాం.

అక్టోబర్ 4న ఆపిల్‌కు గూగుల్ ఎలాంటి షాకివ్వబోతోంది..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సునీల్ మిట్టల్ సంచలన వ్యాఖ్యలు

టెలికాం రంగంలో సునామి లాంటి విప్లవాన్ని సృష్టిస్తూ వచ్చిన రిలయన్స్ జియో, తమకు ప్రధాన ప్రత్యర్థేనని ఎయిర్‌టెల్ కంపెనీ చైర్మన్ సునీల్ మిట్టల్ వెల్లడించారు.

మార్కెట్లో టాప్ లీడర్‌గా కొనసాగడానికి

జియో ప్రధాన ప్రత్యర్థైనప్పటికీ, దాన్ని ఎదుర్కొని మార్కెట్లో టాప్ లీడర్‌గా కొనసాగడానికి తాము సిద్ధంగానే ఉన్నామని ప్రకటించారు. జియో లాంచింగ్ అనంతరం సునీల్ మిట్టల్ ఇచ్చిన మొదటి ఇంటర్వ్యూలో ఈ విషయాలు వెల్లడించారు.

జియో చేస్తున్న ఆరోపణలను

మరోవైపు జియో చేస్తున్న ఆరోపణలను ఇంటర్ కనెక్షన్, కస్టమర్ల మొబైల్ నంబర్ పోర్టబిలిటీ సమస్యలను ఎయిర్‌టెల్ త్వరలోనే పరిష్కరిస్తుందని చెప్పారు. అనవసరంగా మాపై ఆరోపణలు చేయడం తగదని తెలిపారు. 

రోజువారీ టెలికాం వార్

తాము ఎల్లప్పుడూ పోటీ వాతావరణాన్ని ఆహ్వానిస్తామని, ఇతర టెలికాం కంపెనీలు ఏటీ అంట్ టీ, హచిన్సన్, టెలినార్, ఐడియా, వొడాఫోన్ కంపెనీలతో రోజువారీ టెలికాం వార్ నడుస్తూనే ఉంటుందని వెల్లడించారు. వాటితో పాటు జియోతో కూడా వార్ మొదలైందని తెలిపారు.

ఎయిర్‌టెల్ కంపెనీనే నెంబర్ 1

దీంతో పాటు పోటీవాతావరణంతో వినియోగదారులకు మెరుగైన సేవలను అందించవచ్చని, ఇంత తీవ్రమైన పోటీవాతావరణంలో కూడా ఎయిర్‌టెల్ కంపెనీనే నెంబర్ 1 కంపెనీగా నిలుస్తుందని ఆయన హర్షం వ్యక్తంచేశారు.

జియో ఆరోపణలు చేయడం మానేసి

జియో ఆరోపణలు చేయడం మానేసి పార్టీల సంప్రదింపులతో తన సమస్యను పరిష్కరించుకోవాలని హితవు పలికారు. ఈ సమస్యలను పరిష్కరించడానికి ఎయిర్‌టెల్ చురుగ్గా ఉందన్నారు.

జియో ఆరోపణలు

తమ మొబైల్ నెట్వర్క్ నుంచి కాల్స్‌ను వారి నెట్వర్క్లతో కనెక్ట్ చేయడానికి సరిపడా పోర్ట్స్ ఆఫ్ ఇంటర్కనెక్ట్ (పీఓఐ) పరికరాలను ప్రస్తుత టెల్కోలు అందుబాటులో ఉంచడం లేదని జియో ఆరోపిస్తున్న విషయం విదితమే. 

ఎప్పుడూ మేము ఫేస్ చేయలేదు.

అయితే ఇప్పటివరకు ఏ టెల్కో నుంచి ఇలాంటి ఆరోపణలు ఎయిర్‌టెల్ ఫేస్ చేయలేదని జియో మాత్రమే మాపై ఆరోపణలు గుప్పిస్తోందని మిట్టల్ అన్నారు. 

 

 

జియోకు అవసరమైన పీఓఐలను

జియోకు అవసరమైన పీఓఐలను విడుదల చేస్తామని సునీల్ మిట్టల్ తెలిపారు. మొదటిసారి పుష్కలమైన స్పెక్ట్రమ్, త్వరలో నిర్వహించబోయే ఆక్షన్‌ ముందు ఉంచామన్నారు.

భారతి ఎయిర్ టెల్ అగ్రస్థానం

అయితే రానున్న స్పెక్ట్రమ్ వేలంపాటల్లో పాల్గోనే కంపెనీల ఆస్తులను ఓ సారి చూస్తే భారతి ఎయిర్ టెల్ అగ్రస్థానంలో ఉంది. ట్రాయ్ చెప్పిన లెక్కల ప్రకారం మొత్తం రూ. 66,643.20 కోట్ల నెట్ వర్త్‌తో ఎయిర్‌టెల్ వేలానికి సిద్ధమైంది.

తరువాత స్థానాల్లో

తరువాత స్థానాల్లో జియో కి రూ. 45,042.69 కోట్లు, ఐడియా సెల్యూలర్ రూ. 24,935.84 కోట్లు, వొడాఫోన్ కి రూ .23,040 కోట్లు, అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ రూ. 12.639 కోట్ల విలువైన ఆస్తులు కలిగింది.

 

 

2 కోట్ల కాల్స్ ఫెయిల్

2 కోట్ల కాల్స్ ఫెయిల్..ఎయిర్‌టెల్‌పై నిప్పులు చెరిగిన జియో..మరింత సమాచారం కోసం క్లిక్ చేయండి 

షాక్: జియో సిమ్‌లు వెనక్కి ఇచ్చేస్తారట..ఎందుకో తెలుసా..?

షాక్: జియో సిమ్‌లు వెనక్కి ఇచ్చేస్తారట..ఎందుకో తెలుసా..? మరింత సమాచారం కోసం క్లిక్ చేయండి 

లైసెన్స్ రద్దు చేయాల్సిందే !

జియోకి మండింది: Airtel, Idea, vodafone లైసెన్స్ రద్దు చేయాల్సిందే ! మరింత సమాచారం కోసం క్లిక్ చేయండి 

రూ.65 వేల కోట్ల డీల్

జియోని సవాల్ చేయడానికి రూ.65 వేల కోట్ల డీల్ కుదిరింది. మరింత సమాచారం కోసం క్లిక్ చేయండి 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

 

English summary
Jio tough rival but Airtel well prepared to take it on Sunil Mittal read more telugu gizbot
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting