పాత ధరల వద్ద ప్రీపెయిడ్ ప్లాన్‌లను ఇప్పటికి అందిస్తున్న రిలయన్స్ జియో

|

గత కొన్ని నెలలుగా టెలికం పరిశ్రమలో ప్రీపెయిడ్ చందాదారులను ప్రభావితం చేసిన విషయం ఏది అని అడిగితే ప్రతి ఒక్కరు తెలిపే సమాధానం డేటా టారిఫ్ పెంపు అని తెలుపుతారు. ప్రీపెయిడ్ ప్లాన్‌లపై వచ్చిన ఈ పెరుగుదల మిలియన్ల మంది వినియోగదారులను ప్రభావితం చేసింది. అలాగే మొత్తం పరిశ్రమను కుదేలు చేసింది. ధరల పెరుగుదలతో పాటుగా కొత్త ధరలను చూసి చందాదారులు అవాక్కయ్యారు.

జియో

రిలయన్స్ జియో వంటి ఆపరేటర్లు కూడా ధరలను పెంచడానికి అంగీకరించారని అందరూ ఆశ్చర్యపోయారు. జియో సిమ్ లను వాడే చాలా మంది ప్రజలు రీఛార్జిలలో 30% వరకు ధరల పెరుగుదలను ఉహించారు కాని జియో వాటి ధరలను 40%కు పెంచింది. తత్ఫలితంగా చందాదారులు ఇప్పుడు వారు గతంలో అనుభవిస్తున్న అదే ప్రయోజనాలు వాటి సేవలను వినియోగించడానికి ఎక్కువ మొత్తంలో చెల్లిస్తున్నారు.

 

 

7లక్షల కోట్లతో నేషనల్ బ్రాడ్‌బ్యాండ్ మిషన్‌ను ప్రకటించిన ప్రభుత్వం7లక్షల కోట్లతో నేషనల్ బ్రాడ్‌బ్యాండ్ మిషన్‌ను ప్రకటించిన ప్రభుత్వం

రిలయన్స్ జియో

రిలయన్స్ జియో చందాదారుల విషయంలో కూడా ఇదే పరిస్థితి. కానీ జియో చందాదారులకు ఒక మంచి ఉపాయం ఉంది. ఈ చిట్కా కారణంగా చందాదారులు కొత్త ప్లాన్‌లతో రీఛార్జ్ చేయడానికి బదులుగా వారి పాత ప్లాన్‌లతో రీఛార్జ్ చేయడంలో సహాయపడుతుంది. అంటే జియో యొక్క ఎంపిక చేసిన చందాదారులు ఖరీదైన ప్లాన్‌లకు చెల్లించే బదులు చౌకైన పాత ప్లాన్‌లతో రీఛార్జ్ చేయగలరు. దీని గురించి పూర్తిగా తెలుసుకోవడానికి మరింత ముందుకు చదవండి.

 

ఫ్లిప్‌కార్ట్ ఇయర్ ఎండ్ సేల్ 2019... ఆఫర్స్ ఏమిటో మీరు చూడండి...ఫ్లిప్‌కార్ట్ ఇయర్ ఎండ్ సేల్ 2019... ఆఫర్స్ ఏమిటో మీరు చూడండి...

జియో పాత ప్రీపెయిడ్ ప్లాన్‌లను యాక్సెస్ చేస్తోంది

జియో పాత ప్రీపెయిడ్ ప్లాన్‌లను యాక్సెస్ చేస్తోంది

పాత ప్లాన్‌లకు యాక్సిస్ ను కలిగి ఉన్న రిలయన్స్ జియో చందాదారులు ప్రస్తుతం వారి అకౌంట్ లో ఎటువంటి క్రియాశీల ప్లాన్‌లు లేనివారు. దీని అర్థం మీరు రిలయన్స్ జియో యొక్క వెబ్‌సైట్‌ను లేదా అధికారిక స్వీయ-సంరక్షణ యాప్ కు వెళ్లవలసి ఉంటుంది. ఇక్కడ మీరు లాగిన్ అవ్వవచ్చు మరియు రీఛార్జ్ కోసం పాత ప్లాన్‌లను చూడగలరు. పాత ప్లాన్‌లతో రీఛార్జ్ చేయడానికి మరియు ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌ల కోసం తక్కువ ఖర్చు చేయడానికి రిలయన్స్ జియో తన చందాదారులకు మరో అవకాశం ఇస్తుందని దీని అర్థం. గత కొన్ని రోజులలో మీరు ఇప్పటికే కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌తో రీఛార్జ్ చేసినట్లయితే మీకు పాత ప్లాన్ లభించదు.

OTP

ప్రత్యేకంగా చెప్పాలంటే మొబైల్ నంబర్ మరియు OTP ఉపయోగించి వెబ్‌సైట్‌లోకి లాగిన్ అయిన తర్వాత చందాదారులు సెట్టింగుల విభాగాలకు నావిగేట్ చేయవలసి ఉంటుంది. ఆపై వారు సెట్టింగ్ విభాగానికి వెళ్ళవలసి ఉంటుంది. ఇక్కడ వారు పాత ప్లాన్‌లను చూడటానికి "టారిఫ్ ప్రొటెక్షన్" బటన్‌ను నొక్కాలి.

రిలయన్స్ జియో ప్రీపెయిడ్ ప్లాన్ డేటా టారిఫ్ పెంపు

రిలయన్స్ జియో ప్రీపెయిడ్ ప్లాన్ డేటా టారిఫ్ పెంపు

డేటా టారిఫ్ పెంపు తరువాత రిలయన్స్ జియో తన అన్ని ప్రీపెయిడ్ ప్లాన్‌ల ధరలను పెంచింది. జియో మాత్రమే కాకుండా మిగిలిన అన్ని టెలికామ్ సంస్థలు కూడా తమ ప్లాన్‌ల ధరలను పెంచాయి. వాస్తవానికి ముఖేష్ అంబానీ నేతృత్వంలోని టెలికాం ఆపరేటర్ ధరల పెరుగుదలతో కూడా దాని ప్రీపెయిడ్ ప్లాన్‌లు పోటీలో 25% కంటే చౌకగా ఉన్నాయని చెప్పారు. ఏదేమైనా రిలయన్స్ జియో ప్రీపెయిడ్ ప్లాన్‌లతో గమనించవలసిన విషయం ఏమిటంటే రిలయన్స్ జియో ప్రీపెయిడ్ ప్లాన్‌లపై కాల్ చేయడం ఇప్పటికీ 6పైసలు వసూలు చేస్తున్నది.

టెలికం ఆపరేటర్లు

ఇతర టెలికం ఆపరేటర్లు తమ ప్లాన్‌లను ఉపయోగించి ఇప్పుడు వారు నిజంగా అపరిమిత కాలింగ్‌ను అందిస్తున్నారు. కానీ జియో విషయంలో అలా కాదు టెలికాం ఆపరేటర్ తన చందాదారులను ఒక నిర్దిష్ట పరిమితి తర్వాత నిమిషానికి 6 పైసలు ఐయుసితో వసూలు చేస్తోంది. దీని కోసం చందాదారులు ప్రత్యేక ఐయుసి టాక్ టైమ్ పొందాలి. జియో తన నెట్‌వర్క్‌లో ఉద్భవించే అత్యధిక సంఖ్యలో అవుట్‌గోయింగ్ కాల్‌ల సౌజన్యంతో ఇతర టెలికాం ఆపరేటర్లకు ఎక్కువ ఐయుసిని చెల్లిస్తుందని గమనించాలి.

Best Mobiles in India

English summary
Reliance Jio Old Prepaid Recharge Plans Still Available to Users

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X