కొత్తగా రిలీజ్ అయిన లెనోవా స్మార్ట్‌ఫోన్‌ల ధరల వివరాలు

|

లెనోవా K 10 నోట్, లెనోవా Z 6 ప్రో, లెనోవా A 6 నోట్ అనే మూడు కొత్త స్మార్ట్‌ఫోన్‌లను నిన్న భారతదేశంలో విడుదల చేసింది. ఇది 2019 సంవత్సరంలో ఇండియాలో జరిగిన అతిపెద్ద లాంచ్. ఇప్పటివరకు మే నెలలో ఈ సంవత్సరం ప్రారంభంలో లెనోవా K 9 నోట్ అనే ఒక అప్‌గ్రేడ్ స్మార్ట్‌ఫోన్‌న్ని లాంచ్ చేయడం మాత్రమే చూశాము. ఇప్పుడు బడ్జెట్ విభాగంలో సరికొత్త లెనోవా K 10 నోట్ మరియు లెనోవా A 6 నోట్‌తో లెనోవా ఇండియాలో షియోమి మరియు రియల్‌మికి వివిధ ధరల విభాగాలలో పోటీగా ఉంది. అలాగే స్నాప్‌డ్రాగన్ 855 తో ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ అయిన Z 6 ప్రో కూడా వన్‌ప్లస్, హానర్ మరియు ఆసుస్ వంటి మిడ్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లతో పోటీ పడుతోంది.

ధరల వివరాలు
 

ధరల వివరాలు

లెనోవా K 10 నోట్ ఇండియాలో రెండు వేరియంట్లలో లభిస్తుంది. 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్+ 4 జీబీ ర్యామ్ వేరియంట్ యొక్క ధర 13,999 రూపాయలు. అలాగే ఇందులో హై-ఎండ్ మోడల్ 6 జీబీ ర్యామ్ + 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర 15,999 రూపాయలు. ఇది సెప్టెంబర్ 11 నుండి ఫ్లిప్‌కార్ట్‌లో పరిమిత సంఖ్యలో అమ్మకానికి అందుబాటులో ఉంటుంది.

లెనోవా A 6

లెనోవా యొక్క మరోక ఫోన్ లెనోవా A 6 నోట్ సంస్థ నుండి వస్తున్న మరింత సరసమైన ఆఫర్ ఇది నేరుగా షియోమి రెడ్‌మి 7 మరియు రియల్‌మి 3i లకు గట్టి పోటీ ఇవ్వనున్నది. ఇందులో ఒకే ఒక వేరియంట్ అందుబాటులో ఉంది. 3 జీబీ ర్యామ్+ 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ యొక్క వేరియంట్‌ హ్యాండ్‌సెట్ ధర 7,999 రూపాయలు. ఇది కూడా సెప్టెంబర్ 11 నుండి ఫ్లిప్‌కార్ట్‌లో బ్లాక్ అండ్ బ్లూ కలర్ ఆప్షన్స్‌లో లభిస్తుంది.

లెనోవా Z 6 ప్రో

ఈ ఫ్లాగ్‌షిప్ లో లెనోవా Z 6 ప్రో స్మార్ట్‌ఫోన్ 8 జీబీ ర్యామ్ + 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో ఒకే ఒక వేరియంట్‌లో మాత్రమే వస్తుంది. దీని యొక్క ధర 33,999 రూపాయలు. ఇది సెప్టెంబర్ 16 నుండి అమ్మకాలకు వెళ్తుంది. మూడు ఫోన్‌లు ఫ్లిప్‌కార్ట్ ద్వారా అందుబాటులో ఉంటాయి. ఆఫర్స్ విషయంలో ఇది రిలయన్స్ జియోతో బండిల్డ్ చేయబడిన రూ.2,200 క్యాష్‌బ్యాక్ ఆఫర్‌తో అందుబాటులో ఉంటాయి.

లెనోవా K10 నోట్ స్పెసిఫికేషన్స్
 

లెనోవా K10 నోట్ స్పెసిఫికేషన్స్

లెనోవా K10 నోట్‌లో 6.3-అంగుళాల ఫుల్-హెచ్‌డి + స్క్రీన్‌ను డ్యూడ్రాప్ (వాటర్‌డ్రాప్-స్టైల్) నాచ్ ను కలిగి ఉంది. ఈ ఫోన్ 4GB లేదా 6GB RAM తో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 710 SoC తో ప్యాక్ చేయబడి ఉంటుంది. ఈ రెండు కాన్ఫిగరేషన్ మోడల్స్ 4GB + 64GB మరియు 6GB + 128GB గా ఉంటాయి. కెమెరా విభాగంలో లెనోవా K10 నోట్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను దాని ధర విభాగంలో 2x ఆప్టికల్ జూమ్ యొక్క హైలైట్‌తో 16 మెగాపిక్సెల్ ప్రైమరీ లెన్స్ కెమెరా మరియు 8 మెగాపిక్సెల్ సెకండరీ టెలిఫోటో కెమెరా మరియు మూడవది 5 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సింగ్ కెమెరా ఉన్నాయి. ముందు వైపు 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా కూడా ఉంది. ఇతర స్పెసిఫికేషన్లలో USB టైప్-C తో 4,050 ఎమ్ఏహెచ్ బ్యాటరీ 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. ఇది డాల్బీ అట్మోస్ ఆడియో, ZUI 11 తో ఆండ్రాయిడ్ 9 పై, 3.5mm ఆడియో పోర్ట్ మరియు వెనుక వేలిముద్ర సెన్సార్‌ను కూడా అందిస్తుంది.

లెనోవా A6 నోట్ స్పెసిఫికేషన్స్

లెనోవా A6 నోట్ స్పెసిఫికేషన్స్

లెనోవా A6 నోట్ ప్రస్తుతం ఉన్న A-సిరీస్‌లో లెనోవా ఇండియాకు చెందిన బడ్జెట్ స్మార్ట్‌ఫోన్. స్మార్ట్‌ఫోన్‌లో 6.09-అంగుళాల HD + స్క్రీన్‌తో డిస్ప్లే ను కలిగి ఉంది. ఇది మీడియాటెక్ యొక్క హెలియో P 22 చిప్‌సెట్‌ను 3GB RAM మరియు 32GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో అందిస్తుంది. డ్యూయల్ సిమ్ గల స్మార్ట్‌ఫోన్ మైక్రో SD కార్డ్ విస్తరణ కోసం అంకితమైన సిమ్ స్లాట్‌ను కూడా అందిస్తోంది. ఇమేజింగ్ విషయంలో లెనోవా A6 నోట్ వెనుక వైపు 13-మెగాపిక్సెల్ + 2-మెగాపిక్సెల్ డ్యూయల్-రియర్ కెమెరా సెటప్‌తో ప్యాక్ చేయబడి ఉంది. అలాగే సెల్ఫీస్ కోసం ముందు వైపు 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. ఇతర విషయాలలో ఇది 10W స్టాండర్డ్ ఛార్జింగ్‌కు మద్దతు గల 4,000 ఎంఏహెచ్ బ్యాటరీతో ప్యాక్ చేయబడి ఉంటుంది.

లెనోవా Z 6 ప్రో స్పెసిఫికేషన్స్

లెనోవా Z 6 ప్రో స్పెసిఫికేషన్స్

లెనోవా ప్రారంభించిన మరొక ఫోన్ లెనోవా Z 6 ప్రో ఇది గ్లాస్ బ్యాక్‌తో ప్రీమియం డిజైన్, మరియు డిసి డిమ్మింగ్ మరియు హెచ్‌డిఆర్ 10 సపోర్ట్‌తో 6.39-అంగుళాల ఫుల్ హెచ్‌డి + డిస్‌ప్లేను కలిగి ఉంది. లోపలివైపు ఇది కోల్డ్ ఫ్రంట్ లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీతో హై-ఎండ్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 855 SoC చేత శక్తిని పొందుతుంది. ఇది 8 జిబి ర్యామ్ +128 జిబి స్టోరేజ్‌తో కేవలం ఒకే ఒక వేరియంట్‌ను మాత్రమే తీసుకువచ్చింది. లెనోవా జెడ్ 6 ప్రో వెనుక భాగంలో 48 మెగాపిక్సెల్ సెన్సార్ మెయిన్ షూటర్‌తో క్వాడ్-కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. మరియు ఇది 8 మెగాపిక్సెల్ టెలిఫోటో సెన్సార్, 16 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరాలు గల ట్రిపుల్ కెమెరా సెటప్ ను కలిగి ఉంది. వీడియో కాలింగ్ మరియు సెల్ఫీస్ కోసం ముందువైపు 32 మెగాపిక్సెల్ సెన్సార్‌తో సెల్ఫీ కెమెరా ఉంది. ఇతర ఫీచర్స్ విషయానికి వస్తే ఇది వై-ఫై, బ్లూటూత్, జిపిఎస్, 4G ఎల్‌టిఇకి మద్దతు ఇస్తుంది. ఇందులో డిస్ప్లే లోపల ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. ఇది 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 4,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. లెనోవా జెడ్ 6 ప్రో ఎరుపు, ఆకుపచ్చ రంగులలో అందించబడుతుంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
Lenovo K10 Note, Z6 Pro, A6 Note Launched: Price in India, Specifications, Features and More

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X