Moto G8 Power Lite Sale: బడ్జెట్ ధరలో స్మార్ట్‌ఫోన్ కు ఇదే సరైన ఛాయస్!!!
ఇండియాలో లాక్‌డౌన్ ఇప్పటికి కొనసాగుతున్నప్పటికి కొన్ని స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలు గత నెల నుండి తమ కొత్త ఫోన్లను లాంచ్ చేసారు. ఇప్పుడు వారి యొక్క స్మార్ట్‌ఫోన్లను గ్రీన్ మరియు ఆరెంజ్ జోన్ లలో అమ్మకానికి ఉంచాయి. ఈ నెల రెండవ వారంలో ఇండియాలో మోటరోలా సంస్థ బడ్జెట్ ధరలో విడుదల చేసిన మోటో G8 పవర్ లైట్ యొక్క అమ్మకాలు నేటి నుంచి మొదలయినాయి.

మోటో G8 పవర్ లైట్ సేల్స్
మోటరోలా సంస్థ విడుదల చేసిన మోటో G8 పవర్ లైట్ యొక్క సేల్స్ నేటి నుంచి ఫ్లిప్‌కార్ట్ ద్వారా మొదలయినాయి. తాజా బడ్జెట్ మోటరోలా ఫోన్ మధ్యాహ్నం 12 గంటల నుండి ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో పాటుగా వాటర్‌డ్రాప్ తరహా డిస్ప్లే నాచ్‌ను కలిగి ఉంటుంది. ప్రాసెసింగ్ అవసరాల కోసం ఇది మీడియాటెక్ హెలియో P35 SoC ద్వారా రన్ అవుతుంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి. Airtel Prepaid Plans:84రోజుల వాలిడిటీతో లాక్డౌన్ సమయంలో సరైన ప్లాన్‌లు ఇవే....

మోటో G 8 పవర్ లైట్ ధరల వివరాలు
ఇండియాలో మోటో G 8 పవర్ లైట్ స్మార్ట్‌ఫోన్ ను కేవలం ఒకే ఒక వేరియంట్‌లో మాత్రమే విడుదల చేసారు. 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్ యొక్క సింగిల్ వేరియంట్ యొక్క ధర 8,999 రూపాయలు. ఈ ఫోన్ ఆర్కిటిక్ బ్లూ మరియు రాయల్ బ్లూ వంటి రెండు కలర్ ఆప్షన్లలో ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. Vivo Days Sale: గొప్ప డిస్కౌంట్ ఆఫర్లతో వివో ఫోన్‌ల కొనుగోలుకు సరైన సమయం ఇదే!!!!

మోటో G 8 పవర్ లైట్ సేల్స్ ఆఫర్స్
ఫ్లిప్‌కార్ట్ ద్వారా జరిగే మోటో జి 8 పవర్ లైట్ సేల్స్ యొక్క ఆఫర్లలో భాగంగా ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు ఐదు శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఇంకా నో-కాస్ట్ ఇఎంఐ ఎంపికలతో పాటుగా నెలవారీ రూ.750 EMI ఎంపిక కూడా ఉంది. Realme Smart TV vs Xiaomi Mi TV 4A Pro: ఈ రెండింటిలో ఉత్తమమైనది ఇదే!!!!

మోటో G8 పవర్ లైట్ స్పెసిఫికేషన్స్ ,సాఫ్ట్ వెర్
మోటరోలా యొక్క మోటో G8 పవర్ లైట్ స్మార్ట్‌ఫోన్ యొక్క డిస్ప్లే 20: 9 కారక నిష్పత్తితో 6.5-అంగుళాల IPS LCD మాక్స్ విజన్ ప్యానల్‌ను కలిగి ఉంది. ఇది వాటర్‌డ్రాప్-స్టైల్ నాచ్డ్ డిస్‌ప్లేను HD + రిజల్యూషన్‌తో కలిగి ఉంటుంది. అలాగే ఇది 10W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో 5,000mah బ్యాటరీతో ప్యాక్ చేయబడి ఉంది. ఇది మీడియాటెక్ హెలియో P 35 చిప్‌సెట్ ను కలిగి ఉండి ఆండ్రాయిడ్ 9 పై ఓఎస్‌తో రన్ అవుతుంది.

కెమెరా సెటప్
మోటో G8 పవర్ లైట్ స్మార్ట్‌ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో గల ఫోటోగ్రఫీ విషయానికొస్తే ఇది ఎఫ్ / 2.0 ఎపర్చర్‌తో 16 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. అలాగే ఈ సెటప్‌లో ఎఫ్ / 2.4 ఎపర్చర్‌తో 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ మరియు ఎఫ్ / 2.4 ఎపర్చర్‌తో 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కెమెరాలు కూడా ఉన్నాయి. ఇది డ్యూయల్ కెమెరా బోకె, ఫేస్ బ్యూటీ, హెచ్‌డిఆర్, గూగుల్ లెన్స్ వంటి మరిన్ని ఫీచర్లకు కూడా మద్దతు ఇస్తుంది. సెల్ఫీలు మరియు వీడియోల కోసం ఫోన్ యొక్క ముందుభాగంలో 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. ముందు మరియు వెనుక కెమెరా సెన్సార్లు రెండూ 30fps 1080p వీడియో రికార్డింగ్ కోసం మద్దతునిస్తాయి.

కనెక్టివిటీ
మోటరోలా మోటో జి 8 పవర్ లైట్ స్ప్లాష్-రెసిస్టెంట్ ను కలిగి ఉండి దాదాపు 200 గ్రాముల బరువును కలిగి ఉంటుంది. 64GBu ఇంటర్నల్ స్టోరేజ్ ఎంపికతో లభించే ఈ కొత్త ఫోన్‌లో గల ప్రత్యేకమైన మైక్రో SD కార్డ్ స్లాట్ ద్వారా మెమొరీని 500GB వరకు విస్తరించడానికి అవకాశం ఉంది. కనెక్టివిటీ ఎంపికలలో డ్యూయల్ 4G VoLTE, Wi-Fi 802.11 b/g/n, బ్లూటూత్ 4.2, జిపిఎస్, మైక్రో యుఎస్‌బి పోర్ట్ మరియు 3.5mm ఆడియో జాక్ ఉన్నాయి. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సైజు గల స్మార్ట్‌ఫోన్ ఒకే ఛార్జ్‌లో రెండు రోజుల కన్నా ఎక్కువగా పనిచేస్తుంది.


Click it and Unblock the Notifications








