Realme Smart TV vs Xiaomi Mi TV 4A Pro: ఈ రెండింటిలో ఉత్తమమైనది ఇదే!!!!

|

ప్రముఖ చైనా సంస్థలు షియోమి మరియు రియల్‌మి లు రెండు ఎప్పటి నుంచో అన్ని రంగాలలోను పోటీ పడుతున్నాయి. మొదట స్మార్ట్ ఫోన్లలో మొదలైన వీరి పోటీ తరువాత అన్ని విభాగాలలోను విస్తరించింది.

 

స్మార్ట్ టీవీ

స్మార్ట్ టీవీ

మొత్తానికి చాలా రోజుల నిరీక్షణ తరువాత రియల్‌మి తన మొదటి స్మార్ట్ టీవీను ఇండియాలో విడుదల చేసింది. బడ్జెక్ట్ ధరలో గల వినియోగదారులను లక్ష్యంగా చేసుకున్న సంస్థ తనకు పోటీగా ఉన్న Mi టీవీ కంటే మెరుగైన ఫీచర్లను అందిస్తుందో లేదో తెలుసుకోవడానికి ముందుకు చదవండి. Redmi 10X series: షియోమి నుంచి 5G సపోర్ట్ కొత్త స్మార్ట్‌ఫోన్‌లు!!! ఫీచర్స్ అదుర్స్...

రియల్‌మి స్మార్ట్ టీవీ

రియల్‌మి స్మార్ట్ టీవీ

అందరు ఉహించిన విధంగా రియల్‌మి సంస్థ తన మొదటి స్మార్ట్ టీవీ సిరీస్ ను బడ్జెట్ ధరలో ఎంట్రీ లెవల్ ఎంపికలలో రెండు పరిమాణాలలో విడుదల చేసింది. 32-అంగుళాల టీవీ 1366x768- పిక్సెల్ రిజల్యూషన్‌తో మరియు 1920x1080-పిక్సెల్ రిజల్యూషన్‌తో 43-అంగుళాల టీవీలు వివిధ రకాల ధరల వద్ద విడుదల చేసాయి. రూ.12,999 బడ్జెట్‌ ధరలో లభించే రియల్‌మి స్మార్ట్ టీవీ సాధారణ డిటిహెచ్ లేదా కేబుల్ కంటెంట్‌తో పాటు OTT స్ట్రీమింగ్ సేవలను కూడా పొందాలనుకొనే వారికి ఇది ఆకర్షణీయమైన ఎంపిక.  WhatsApp QR Code ఫీచర్ గురించి మీకు తెలియని విషయాలు...

Mi టివి 4A ప్రో సిరీస్‌
 

Mi టివి 4A ప్రో సిరీస్‌

ఏదేమైనా ఈ ధర విభాగంలో ఇండియా మార్కెట్లో షియోమి సంస్థ ఇప్పటికే ఒక స్థిరపడిన ప్లేయర్ గా మంచి గుర్తింపును పొందింది. రియల్‌మి యొక్క కొత్త స్మార్ట్ టీవీ సిరీస్ షియోమి యొక్క Mi టివి 4A ప్రో సిరీస్‌తో గట్టి పోటీని ఎదుర్కొంటున్నాయి. ఈ రెండు టెలివిజన్ల యొక్క ధర, స్పెసిఫికేషన్స్ మరియు ఫీచర్స్ ఆధారంగా వాటిని పోల్చాము. వీటి మధ్య గల పోలికలు కింద వివరించబడ్డాయి. వాటి యొక్క పోలికలు చదివి మీకు నచ్చిన దానిని మీరు కొనుగోలు చేయవచ్చు. YouTube Premium ను 6 నెలల పాటు ఉచితంగా పొందడం ఎలాగో తెలుసా?

ధరల పోలికలు

ధరల పోలికలు

రియల్‌మి స్మార్ట్ టీవీ యొక్క 32 అంగుళాల వేరియంట్‌ ధర రూ.12,999 కాగా 43 అంగుళాల వేరియంట్‌ యొక్క ధర 21,999 రూపాయలు. అలాగే షియోమి యొక్క Mi టివి 4A ప్రో సిరీస్ యొక్క 32 అంగుళాల వేరియంట్‌ ధర రూ.12,499 కాగా 43-అంగుళాల వేరియంట్‌ యొక్క ధర 21,999 రూపాయలు. ధరల విభాగంలో ఈ రెండు మోడళ్లు ఒకదానితో ఒకటి సమానమైన ధరలను కలిగి ఉన్నాయి.

లభ్యత వివరాలు

లభ్యత వివరాలు

రియల్‌మి సంస్థ యొక్క కొత్త స్మార్ట్ టీవీలను మొదట ఫ్లిప్‌కార్ట్, రియల్‌.కామ్ ద్వారా విక్రయించబోతున్నారు. అయితే రాబోయే వారాల్లో ఈ టీవీలను ఆఫ్‌లైన్‌ ద్వారా కూడా అందుబాటులో ఉంచాలని భావిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. షియోమి యొక్క టెలివిజన్లు ప్రస్తుతం ఆఫ్‌లైన్ మరియు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి. ప్రధాన ఇ-కామర్స్ రిటైలర్లు మరియు mi.com/in మి టివి 4A ప్రో శ్రేణిని విక్రయిస్తున్నాయి.

స్క్రీన్

స్క్రీన్

రియల్‌మి స్మార్ట్ టీవీ 32-అంగుళాల మరియు 43-అంగుళాల రెండు వేరియంట్‌లలో లభిస్తుంది. ఇది ఫుల్ హెచ్‌డి-రెడీ (1366x768- పిక్సెల్) స్క్రీన్‌తో మరియు రెండోది ఫుల్-హెచ్‌డి (1920x1080-పిక్సెల్) డిస్ప్లేని కలిగి ఉంది. ఇవి స్టాండర్డ్ రిఫ్రెష్ రేటు 60HZ రేటును కలిగి ఉండి 400 నిట్స్ గరిష్ట ప్రకాశంను మరియు ఆసక్తికరంగా హెచ్‌డిఆర్ కంటెంట్‌ను హెచ్‌డిఆర్ 10 ఫార్మాట్ వరకు మద్దతు ఇస్తుంది. ఇది అల్ట్రా-హెచ్‌డి కంటే తక్కువగా ఉండే స్క్రీన్ రిజల్యూషన్‌లో హెచ్‌డిఆర్ మద్దతుతో వస్తుంది.

షియోమి టీవీ

షియోమి Mi టివి 4A ప్రో 32-అంగుళాల మరియు 43-అంగుళాల పరిమాణాల వేరియంట్‌లను కలిగి ఉండి పైన తెలిపిన అన్ని ఫీచర్లను కలిగి ఉన్నాయి. Mi టీవీ ఎంపికలు రిఫ్రెష్ రేట్‌లో రియల్‌మి టీవీకి సరిసమానంగా ఉన్నపటికీ ఇవి హెచ్‌డిఆర్ కంటెంట్‌కు మద్దతును ఇవ్వవు.

రియల్‌మి స్మార్ట్ టీవీ సాఫ్ట్‌వేర్

రియల్‌మి స్మార్ట్ టీవీ సాఫ్ట్‌వేర్

స్మార్ట్ టీవీని సరిగ్గా ఉపయోగించగల సామర్థ్యం విషయానికి వస్తే ఇందులో ముఖ్యమైన అంశం సాఫ్ట్‌వేర్. రియల్‌మి స్మార్ట్ టీవీ సిరీస్ ప్రస్తుతం అందుబాటులో ఉన్న మరియు అత్యంత ప్రాచుర్యం పొందిన ఆండ్రాయిడ్ వెర్షన్ ను వాడుతున్నాయి. ఈ టెలివిజన్ స్టాక్ ఆండ్రాయిడ్ 9 పై ఆధారంగా రన్ అవుతుంది. అలాగే ఈ ఆండ్రాయిడ్ టివి గూగుల్ ప్లే స్టోర్‌ ద్వారా సుమారు 5,000 యాప్ లను డౌన్ లోడ్ చేసుకోవడానికి మరియు స్ట్రీమింగ్ సేవలను యాక్సెస్ చేయడానికి కూడా అవకాశం కల్పిస్తుంది.

రియల్‌మి స్మార్ట్ టీవీ ప్రాసెసర్‌

రియల్‌మి స్మార్ట్ టీవీ ప్రాసెసర్‌

రియల్‌మి స్మార్ట్ టీవీ సిరీస్ మీడియాటెక్ MSD6683 ప్రాసెసర్‌తో పాటు 1GB RAM మరియు 8GB ఇంటర్నల్ స్టోరేజ్ తో జతచేయబడి ఉంటుంది. ఇది డాల్బీ ఆడియోకు కూడా మద్దతును ఇస్తుంది. ఇది 24W సౌండ్ యొక్క అవుట్‌పుట్‌తో నాలుగు-స్పీకర్ సెటప్ (రెండు పూర్తి-శ్రేణి స్పీకర్లు మరియు రెండు ట్వీటర్లు) ద్వారా ఉంటుంది. రియల్‌మి స్మార్ట్ టీవీలో మూడు హెచ్‌డిఎంఐ పోర్ట్‌లు మరియు రెండు యుఎస్‌బి పోర్ట్‌లు ఉన్నాయి.

షియోమి Mi స్మార్ట్ టీవీ సాఫ్ట్‌వేర్

షియోమి Mi స్మార్ట్ టీవీ సాఫ్ట్‌వేర్

షియోమి మి టివి 4 ఎ ప్రో ఆండ్రాయిడ్ టివితో సమానమైన సాఫ్ట్‌వేర్‌తో రన్ అవుతుంది. అయితే ఇది ప్యాచ్‌వాల్ లాంచర్‌ను కూడా కలిగి ఉంది. ఇది యాప్ ల కంటే కంటెంట్‌పై ఎక్కువగా దృష్టిని పెడుతుంది. రియల్‌మి స్మార్ట్ టీవీ మాదిరిగానే ఆండ్రాయిడ్ టీవీ సామర్థ్యం కలిగి ఉంది. అలాగే ఇది అత్యంత ప్రజాదరణ పొందిన యాప్ లకు మరియు ఆండ్రాయిడ్ టీవీ కోసం గూగుల్ ప్లే స్టోర్‌కు కూడా యాక్సిస్ ఉంది.

షియోమి Mi స్మార్ట్ టీవీ ప్రాసెసర్‌

షియోమి Mi స్మార్ట్ టీవీ ప్రాసెసర్‌

Mi టివి 4 ఎ ప్రో సిరీస్ యొక్క ఇతర ఫీచర్స్ రియల్‌మి స్మార్ట్ టివికి సమానంగా ఉన్నాయి. వీటిలో 1GB ర్యామ్ + 8GB ఇంటర్నల్ స్టోరేజ్ ఎంపికలు ఉన్నాయి. Mi టివి 4 ఎ ప్రో సిరీస్ అమ్లాజిక్ ప్రాసెసర్‌లను ఉపయోగిస్తుంది మరియు 20W యొక్క అవుట్‌పుట్‌తో రెండు-స్పీకర్ సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో మూడు హెచ్‌డిఎమ్‌ఐ పోర్ట్‌లు మరియు రెండు యుఎస్‌బి పోర్ట్‌లు అదనంగా ఉన్నాయి.

Best Mobiles in India

English summary
Realme Smart TV vs Xiaomi Mi TV 4A Pro: Which One Have Best Features

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X