పుట్టగొడుగులే ఇక ఫోన్ బ్యాటరీలు

Written By:

ఇక పుట్టగొడుగులు సెల్ ఫోన్ బ్యాటరీలుగా మారనున్నాయా..? విద్యుత్ వాహనంలో ఇంధనమై ఫోనున్నాయా..? అవుననే అంటున్నారు శాస్ర్తవేత్తలు కాలిఫోర్నియా యూనివర్సిటీ రివర్ సైడ్ బోర్న్స్ ఇంజనీరింగ్ కళాశాల పరిశోధనల్లో వినూత్న విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోర్ట్ బెల్లా మష్రూమ్స్ ను ఉపయోగించి కాలుష్యకారకం కాని సమర్థవంతమైన తక్కువ ఖర్చుతో కూడిన పర్యావరణానికి ఎలాంటి హాని కలుగని లిధియమ్ అయాన్ బ్యాటరీ యానోడ్ ని ఉత్పత్తి చేయవచ్చని కనుగొన్నారు.

Read more: ఆండ్రాయిడ్ ఫోన్‌లు ఎందుకంత ‘బెస్ట్'

పుట్టగొడుగులే ఇక ఫోన్ బ్యాటరీలు

ప్రస్తుత పరిశ్రమల్లో రీఛార్జబుల్ లిధియమ్ అయాన్ యానోడ్లను తయారు చేసేందుకు అధిక ఖర్చును పెడుతున్నారు. దీనికి సింధటిక్ గ్రాపైడ్స్ ను ఉపయోగించి ఉత్పత్తి చేస్తున్నారు. పర్యావరణానికి హాని కలుగకుండా శుధ్ధి చేయాల్సిన పరిస్థతిలో వీటి ఉత్పత్తికి అత్యధికంగా ఖర్చవుతోంది.అంతేకాదు వీటిని తయారు చేసే పద్దతి కూడా పర్యావరణానికి ఎంతో హని కలిగిస్తోంది.ఎలక్ట్రిక్ వాహనాలు,ఎలక్ట్రానిక్ పరికరాల కోసం బ్యాటరీలను వాడాల్సిన అవసరం పెరగడంతో ఖరీదైన గ్రాపైట్ ను వాడే స్థానంలో తక్కువ ధరలో దొరికే పుట్టగొడుగులను వాడొచ్చని పరిశోధనల్లో వెల్లడైంది.

Read more: బ్లాక్‌బెర్రీ ఆండ్రాయిడ్ ఫోన్ ‘First look'

పుట్టగొడుగులే ఇక ఫోన్ బ్యాటరీలు

పుట్టగొడుగులతో బయోమాస్ రూపంలో గతంలో నిర్వహించిన పరిశోధనల్లో అవి పోరోస్ గా మారినట్లు గుర్తించారు. అదే పోరోసిటీ బ్యాటరీల తయారీకి అవసరమౌతుందని గ్రహించారు.పుట్టగొడుగుల్లో పొటాషియం,ఉప్పు గాఢతలను క్రమేపి పెంచుతూ రంధ్రాలు పడేలా చేయడం వల్ల ఎలక్టోలైట్ క్రియాశీల పదార్థ సామర్థ్యాన్ని పెంచవచ్చని తెలుసుకున్నారు. ఇలా తయారైన సంప్రదాయక యూనోడ్ లిధియం బ్యాటరీ మెటీరియల్స్ భవిష్యత్ లో అత్యంత ఉపయోగకరంగా ఉంటాయంటున్నారు పరిశోధకులు.

Read more :చైనా మార్కెట్‌పై దండయాత్రకు చేతులు కలిపారు

పుట్టగొడుగులే ఇక ఫోన్ బ్యాటరీలు

కాలక్రమంలో కార్బన్ తో తయారు చేసిన బ్యాటరీ కంటే ఇటువంటి సాంప్రదాయక ఇంధనం వాడకం వల్ల సెల్ ఫోన్లలో బ్యాటరీలు సైతం ఎక్కువ సమయం డిశ్చార్జి అవ్వకుండా ఉండే అవకాశం ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు.

English summary
Here Write Mushrooms Could Help Power Future Smartphones
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot