హైదరబాదీలకు షాపింగ్ మరింత సులభం!

Posted By:

భాగ్యనగర వాసులకు షాపింగ్‌ను మరింత సులభతరం చేస్తూ ‘మైషాప్‌మేట్‌ టీఎమ్' (MyShopMateTM) అప్లికేషన్ అందుబాటులోకి వచ్చింది. ఈ ఉచిత మొబైల్ అప్లికేషన్‌ను హైదరాబాద్ ముఖ్య కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ‘స్మార్ట్ ఎడ్జ్' సంస్థ వృద్ధి చేసింది. జియో లోకేషన్ వ్యవస్థ ఆధారంగా స్పందించే ఈ అప్లికేషన్ ఆండ్రాయిడ్, ఐఫోన్, బ్లాక్‌బెర్రీ ఆపరేటింగ్ సిస్టంలను సపోర్ట్ చేస్తుంది.

‘లవర్స్ డే స్పెషల్'..బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ డీల్స్

హైదరాబాద్ పరిధిలోని స్మార్ట్‌ఫోన్ యూజర్లు ఈ అప్లికేషన్‌ను యాక్సిస్ చేసుకోవటం ద్వారా నగరంలోని షాపింగ్ మాల్స్‌లో లభ్యమయ్యే వివిధ ఉత్పత్తులకు సంబంధించిన బ్రాండ్ వివరాలు, స్టోర్ లోకేషన్స్, ఫుడ్ జాయింట్స్ తదితర అంశాలకు సంబంధించిన పూర్తి వివరాలను స్పష్టంగా తెలుసుకోవచ్చు.

హైదరబాదీలకు షాపింగ్ మరింత సులభం!

బెస్ట్ ఎంపీ3 ప్లేయర్లు (లవర్స్‌డే స్పెషల్)

అప్లికేషన్ ఆవిష్కరణలో భాగంగా ‘స్మార్ట్ ఎడ్జ్' సంస్థల సీఈవో రాజ్ కుమార్ స్పందిస్తూ షాపింగ్ మాళ్లకు సంబంధించిన సమచారాన్ని యూజర్‌కు వాస్తవ సమయంలో అందించే లక్ష్యంతో ‘మైషాప్‌మేట్ టీఎమ్'ను వృద్ధిచేసినట్లు తెలిపారు. త్వరలో ఈ అప్లికేషన్ సేవలను ముంబయ్, ఢిల్లీ, బెంగుళూరు ప్రాంతాలకు విస్తరించనున్నట్లు రాజ్ కుమార్ తెలిపారు.

సురక్షిత ప్రయాణం కోసం టాప్-10 ఆండ్రాయిడ్ అప్లికేషన్స్!

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting