OnePlus 8 5G Sale: డిస్కౌంట్ ఆఫర్లతో ప్రత్యేకమైన సేల్స్!!!

|

ప్రపంచం మొత్తం మీద చాలా రకాల స్మార్ట్‌ఫోన్ తయారీసంస్థలు ఉన్నపటికీ కొన్ని బ్రాండెడ్ ఫోన్లను వాడాలి అని అందరు తహతహ లాడుతూ ఉంటారు. అటువంటి 5G ఫోన్లలో ఒకటి వన్‌ప్లస్ సంస్థ ఇటీవల విడుదల చేసిన వన్‌ప్లస్ 8 5G. ప్రపంచం మొత్తం 5G రంగంలోకి అడుగుపెడుతున్నపుడు అద్భుతమైన 5G స్పెసిఫికేషన్లతో విడుదల అయిన ఈ ఫోన్ యొక్క అమ్మకాలు ఈ రోజు అమెజాన్ ఇండియా ద్వారా జరగనున్నాయి.

వన్‌ప్లస్ 8 5G సేల్

వన్‌ప్లస్ 8 5G సేల్

వన్‌ప్లస్ 8 5G స్మార్ట్‌ఫోన్‌ను కొనడానికి ఆసక్తి ఉన్నవారు దాన్ని అమెజాన్ ఇండియా ద్వారా కొనుగోలు చేయవచ్చు. రూ.41,999 ధర గల ఈ ఫోన్ యొక్క అమ్మకాలు ఈ రోజు మధ్యాహ్నం 12:00 గంటల నుంచి మొదలయ్యాయి. 6GB RAM + 128GB స్టోరేజ్ యొక్క బేస్ వేరియంట్ ఇండియాలో ఇప్పుడు కేవలం అమెజాన్ఇండియా ద్వారా మాత్రమే లభిస్తుంది. OnePlus TV: సరసమైన ధరలకే స్మార్ట్ టీవీ!!! త్వరలోనే ప్రారంభం...

వన్‌ప్లస్ 8 5G ధరల వివరాలు

వన్‌ప్లస్ 8 5G ధరల వివరాలు

ఇండియాలో మూడు వేర్వేరు స్టోరేజ్ ఎంపికలలో విడుదల అయిన వన్‌ప్లస్ 8 5G స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు గొప్ప ఆఫర్లతో అమ్మకానికి అందుబాటులో ఉంది. ఇందులో బేస్ మోడల్ 6GB ర్యామ్ +128GB స్టోరేజ్ ధర రూ.41,999, 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ యొక్క ధర రూ.44,999 కాగా 12GB ర్యామ్+ 256GB స్టోరేజ్ గల హై వేరియంట్ యొక్క ధర 49,999 రూపాయలు.  WhatsApp Paymentsలను స్మార్ట్‌ఫోన్‌లో సెటప్ చేయడం ఎలా?

వన్‌ప్లస్ 8 5G స్మార్ట్‌ఫోన్ సేల్స్ ఆఫర్స్

వన్‌ప్లస్ 8 5G స్మార్ట్‌ఫోన్ సేల్స్ ఆఫర్స్

వన్‌ప్లస్ 8 5G స్మార్ట్‌ఫోన్ ఇండియాలో ఒనిక్స్ బ్లాక్, హిమనదీయ గ్రీన్ మరియు ఇంటర్స్టెల్లార్ గ్లో వంటి మూడు వేర్వేరు కలర్ ఎంపికలలో లభిస్తుంది. ఈ అమ్మకంలో భాగంగా SBI కార్డ్ హోల్డర్లు రూ.2,000 వరకు తగ్గింపును పొందవచ్చు. అలాగే దీనిని 12 నెలల వరకు ఎటువంటి అదనపు ఖర్చు లేని నో-కాస్ట్ EMI ఎంపిక ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చు. BSNL తక్కువ ధర ప్లాన్‌లలో గొప్ప ప్రయోజనాలతో సరికొత్త సవరణలు...

వన్‌ప్లస్ 8 5G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్

వన్‌ప్లస్ 8 5G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్

వన్‌ప్లస్ 8 స్మార్ట్‌ఫోన్ యొక్క 6.55-అంగుళాల డిస్‌ప్లే ఫుల్ HD + ఫ్లూయిడ్ అమోలెడ్ ప్యానెల్ ను కలిగి ఉండి 90HZ రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఇది మూడు వేర్వేరు స్టోరేజ్ ఎంపికలతో లభిస్తూ అడ్రినో 650 GPU మరియు స్నాప్‌డ్రాగన్ 865 SoC ఆధారంగా రన్ అవుతుంది. ఆండ్రాయిడ్ 10 ఆధారిత ఆక్సిజన్ OS 0 ద్వారా రన్ అవుతున్న ఫోన్ UFS 3.0 స్టోరేజ్ కు మద్దతు ఇస్తుంది.

వన్‌ప్లస్ 8 5G స్మార్ట్‌ఫోన్ సాఫ్ట్ వెర్

వన్‌ప్లస్ 8 5G స్మార్ట్‌ఫోన్ సాఫ్ట్ వెర్

వన్‌ప్లస్ యొక్క సరికొత్త వన్‌ప్లస్ 8 5G ఫోన్‌ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 865 SoC తో రన్ అవుతూ అడ్రినో 650 GPU తో జత చేయబడి ఉంటుంది. వన్‌ప్లస్ 8 స్మార్ట్‌ఫోన్ 30W ఫాస్ట్ ఛార్జింగ్ మద్దతుతో 4,300mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఇది డ్యూయల్ స్టీరియో స్పీకర్లను కలిగి ఉండి సౌండ్ కాన్సల్ తో పాటు డాల్బీ అట్మోస్‌కు మద్దతును ఇస్తుంది. ఈ ఫోన్‌ ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది.

వన్‌ప్లస్ 8 5G కెమెరా సెట్ అప్

వన్‌ప్లస్ 8 5G కెమెరా సెట్ అప్

వన్‌ప్లస్ 8 5G స్మార్ట్‌ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ను కలిగి ఉంటుంది. ఇందులో ప్రైమరీ కెమెరా 48 మెగాపిక్సెల్ సోనీ IMX586 సెన్సార్‌ను f / 1.75 ఎపర్చరు పరిమాణంతో వస్తుంది. ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ మరియు ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ రెండింటికి మద్దతును ఇస్తుంది. 16 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్‌తో ఎఫ్ / 2.2 ఎపర్చరు మరియు 116-డిగ్రీ ఫీల్డ్ వ్యూతో వస్తుంది. ఈ సెటప్‌లో చివరిది 1.75 మైక్రాన్ పిక్సెల్ సైజు మరియు ఎఫ్ / 2.4 ఎపర్చర్‌తో 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా జతచేయబడి ఉంది. అలాగే దీని వెనుకభాగంలో డ్యూయల్-ఎల్ఈడి ఫ్లాష్ జతచేయబడి ఉంది. ఫోన్ ముందు భాగంలో 16 మెగాపిక్సెల్ కెమెరా సోనీ IMX471 సెన్సార్ f / 2.45 ఎపర్చరుతో ఉంది.

Best Mobiles in India

English summary
OnePlus 8 5G Sale Live On Amazon with No Cost EMI: Price, Offers and More

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X