OnePlus Nord Launch: 5G ఫీచర్లతో తక్కువ ధరలోనే కొత్త ఫోన్...

|

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వన్‌ప్లస్ గత కొన్ని రోజులుగా తన కొత్త మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్ నార్డ్‌కు సంబంధించి చాలా లీకులను విడుదల చేసిన తరువాత చివరకు ఈ రోజు ఇండియాలో విడుదల చేసింది. వన్‌ప్లస్ నార్డ్‌కు సంబంధించి విడుదల చేసిన టీజర్‌లలో భాగంగా సంస్థ వన్‌ప్లస్ నార్డ్ ఫోన్ మరియు దాని మొదటి TWS ప్రోడక్ట్ వన్‌ప్లస్ బడ్స్‌ను కూడా విడుదల చేసింది.

వన్‌ప్లస్ నార్డ్ లాంచ్

వన్‌ప్లస్ నార్డ్ లాంచ్

వన్‌ప్లస్ సంస్థ యొక్క సరికొత్త స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్ నార్డ్ యొక్క ధర ప్రజలు ఉహించిన దానికంటే తక్కువ ధరకే లభిస్తుంది. వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్‌ అద్భుతమైన నాణ్యతను కలిగి ఉండి ఫ్లాగ్‌షిప్ కిల్లర్ గా ఉంది. ఈ ఫోన్ బ్లూ మార్బుల్ మరియు గ్రే ఒనిక్స్ కలర్ ఎంపికలలో లభిస్తూ స్టైలిష్ బాడీని కలిగి ఉంటుంది. వన్‌ప్లస్ నార్డ్ యొక్క ముఖ్యమైన ఫీచర్స్ మరియు స్పెసిఫికేషన్స్ మరియు ధరల వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ధరల వివరాలు

వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ధరల వివరాలు

ఇండియాలో వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ను మూడు వేరియంట్‌లలో విడుదల చేసారు. ఇందులో 6GB ర్యామ్ + 64GB స్టోరేజ్ వేరియంట్‌ యొక్క ధర రూ.24,999. అలాగే 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.27,999 మరియు టాప్-ఆఫ్ మోడల్ 12GB ర్యామ్ + 256GB స్టోరేజ్ మోడల్ యొక్క ధర రూ. 29,999. ఈ ఫోన్ బ్లూ మార్బుల్ మరియు గ్రే ఒనిక్స్ వంటి కలర్ ఎంపికలలో లభిస్తుంది. అయితే 6GB బేస్ వేరియంట్ కేవలం గ్రే ఒనిక్స్ కలర్ లో మాత్రమే లభిస్తుంది.

వన్‌ప్లస్ నార్డ్ సేల్స్ వివరాలు

వన్‌ప్లస్ నార్డ్ సేల్స్ వివరాలు

వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ యొక్క సేల్స్ విషయానికి వస్తే ఇండియాలో వీటి యొక్క మొదటి అమ్మకం ఆగస్టు 4 నుండి అమెజాన్ మరియు వన్‌ప్లస్ యొక్క వెబ్ సైట్ ద్వారా మొదలు కానున్నాయి. అయితే ప్రారంభంలో 8GB మరియు 12GB RAM వేరియంట్లు మాత్రమే అమ్మకానికి అందించబడతాయి. 6GB ర్యామ్ + 64GB స్టోరేజ్ వెర్షన్ యొక్క అమ్మకాలు సెప్టెంబర్‌ నుండి ప్రారంభం అవుతాయి. షియోమి మరియు ఇతర సంస్థల మాదిరిగా కాకుండా వన్‌ప్లస్ మొదటి రోజు నుండి నార్డ్‌ స్మార్ట్‌ఫోన్ను ఓపెన్ సేల్‌ పద్దతిలో అందించనుంది.

వన్‌ప్లస్ నార్డ్ ప్రీ-బుకింగ్

వన్‌ప్లస్ నార్డ్ ప్రీ-బుకింగ్

వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ను కొనుగోలు చేయాలనుకునే వారికోసం సంస్థ ప్రీ-బుకింగ్ ఆర్డర్లను మొదలుపెట్టింది. జూలై 22 నుంచి వన్‌ప్లస్ ఎక్స్‌పీరియన్స్ స్టోర్స్ ద్వారా మరియు జూలై 28 నుండి అమెజాన్ ఇండియా ద్వారా ప్రీ-బుకింగ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంది. వన్‌ప్లస్ రెడ్ కేబుల్ క్లబ్ సభ్యుల కోసం ఆగస్టు 3 న వన్‌ప్లస్.ఇన్ మరియు సంస్థ యొక్క ఆఫ్‌లైన్ స్టోర్ల ద్వారా ప్రారంభ యాక్సిస్ సేల్ కూడా ఉంటుంది.

వన్‌ప్లస్ నార్డ్ ప్రీ-బుకింగ్ ఆఫర్స్

వన్‌ప్లస్ నార్డ్ ప్రీ-బుకింగ్ ఆఫర్స్

వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ను ప్రీ-బుకింగ్లలో కొనుగోలు చేసిన వారికి అందిస్తున్న ఆఫర్ల విషయానికొస్తే కొనుగోలుదారులు అమెరికన్ ఎక్స్‌ప్రెస్ కార్డులను ఉపయోగించి చేసిన కొనుగోళ్ల మీద రూ.2,000 తగ్గింపు లభిస్తుంది. అదనంగా కొనుగోలుదారులకు రూ.6,000 విలువైన రిలయన్స్ జియో ప్రయోజనాలు కూడా లభిస్తాయి. వన్‌ప్లస్ రెడ్ కేబుల్ క్లబ్ సభ్యులకు ప్రత్యేకంగా పొడిగించిన వారంటీ మరియు భరోసా బైబ్యాక్, 50GB విలువైన వన్‌ప్లస్ క్లౌడ్ స్టోరేజ్ మరియు ఇతర థర్డ్ పార్టీ ప్రయోజనాలు ఉచితంగా లభిస్తాయి.

వన్‌ప్లస్ నార్డ్ స్పెసిఫికేషన్స్

వన్‌ప్లస్ నార్డ్ స్పెసిఫికేషన్స్

వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ డ్యూయల్ నానో సిమ్ స్లాట్ లను కలిగి ఉండి ఆండ్రాయిడ్ 10-ఆధారిత ఆక్సిజన్OS 10.5 ఆధారంగా రన్ అవుతుంది. ఈ ఫోన్ 6.44-అంగుళాల ఫుల్-హెచ్‌డి + అమోలెడ్ డిస్‌ప్లేను 90HZ రిఫ్రెష్ రేట్ వద్ద 1,080x2,400 పిక్సెల్‌ల పరిమాణం మరియు 20: 9 కారక నిష్పత్తితో వస్తుంది. ఈ డిస్‌ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ మరియు నైట్ మోడ్, రీడింగ్ మోడ్ మరియు వీడియో ఎన్ హన్సర్ ఫీచర్ల మద్దతుతో వస్తుంది. ఈ ఫోన్ ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 765 GSoCట్ తో రన్ అవుతూ అడ్రినో 620 GPU మరియు 12GB LPDDR4x RAM వరకు జత చేయబడి వస్తుంది.

వన్‌ప్లస్ నార్డ్ కెమెరా సెటప్

వన్‌ప్లస్ నార్డ్ కెమెరా సెటప్

వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ యొక్క ఫొటోగ్రఫీ విషయానికి వస్తే ఫోటోలు మరియు వీడియోల కోసం వన్‌ప్లస్ నార్డ్ క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో f / 1.75 లెన్స్‌తో మెయిన్ కెమెరా 48 మెగాపిక్సెల్ సోనీ IMX586 సెన్సార్‌తో వస్తుంది. ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) తో పాటు వస్తుంది. ఇంకా కెమెరా సెటప్‌లో ఎఫ్ / 2.25 అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్‌తో మరియు 119 డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూ (FoV) 8 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్ ఉంది. అలాగే ఎఫ్ / 2.4 ఎపర్చరుతో 2-మెగాపిక్సెల్ మాక్రో షూటర్ మరియు 5 మెగాపిక్సెల్ డెప్త్ షూటర్ కెమెరాలు కూడా లభిస్తాయి. సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో డ్యూయల్ సెల్ఫీ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఈ సెటప్‌లో ఎఫ్ / 2.45 లెన్స్‌తో కూడిన 32 మెగాపిక్సెల్ సోనీ IMX616 ప్రైమరీ సెన్సార్ మరియు ఎఫ్ / 2.45 అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్‌తో 105 డిగ్రీల ఎఫ్‌ఒవిని కలిగిన 8 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్‌ను కలిగి ఉంటుంది.

వన్‌ప్లస్ నార్డ్ ఫీచర్స్

వన్‌ప్లస్ నార్డ్ ఫీచర్స్

వన్‌ప్లస్ నార్డ్‌ స్మార్ట్‌ఫోన్ 256GB వరకు వరకు గల ఇంటర్నల్ స్టోరేజ్ ను కలిగి ఉంది. ఇందులో గల మైక్రో SD కార్డ్ స్లాట్ ద్వారా మెమొరీని మరింత విస్తరించవచ్చు. కనెక్టివిటీ ఎంపికలలో ఇది 5G, 4G LTE, వై-ఫై 802.11ac, బ్లూటూత్ V5.1, GPS/ A-GPS/ NavIC, NFC మరియు USB టైప్-సి పోర్ట్ ఉన్నాయి. బోర్డులోని సెన్సార్లలో యాక్సిలెరోమీటర్, యాంబియంట్ లైట్, గైరోస్కోప్, మాగ్నెటోమీటర్ మరియు సామీప్య సెన్సార్ ఉన్నాయి. ఫోన్ ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది.

Best Mobiles in India

English summary
OnePlus Nord Launched in India With 5G Connectivity and 12GB RAM Features: Price, Specs, Sale Date and More

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X