దీపావళి ధమాకా ఈవెంట్‌ను ప్రారంభించిన PUBG మొబైల్

|

PUBG మొబైల్ దీపావళి ధమాకా ఈవెంట్‌ను ప్రకటించింది. ఇందులో పాల్గొనే ఆటగాళ్లకు ప్రత్యేకమైన ఆట వస్తువులు మరియు రివార్డులు అందించబడతాయి అంతేకాకుండా ప్రత్యేకమైన గూడీస్‌ను గెలుచుకునే అవకాశం కూడా ఉంది. ఈవెంట్ ఇప్పటికే ప్రారంభమైంది ఈ ఈవెంట్ నవంబర్ 4 వరకు కొనసాగుతుంది. ఈవెంట్ కొత్త అప్డేట్ వెర్షన్ 0.15.0 తో ప్రత్యక్షంగా ఉంటుంది.

PUBG
 

ఇది PUBG గేమ్ కు కొత్త వాహనాలు మరియు ఆయుధాలను కూడా తెస్తుంది. విడిగా కాల్ ఆఫ్ డ్యూటీ మొబైల్ గేమ్ కూడా తన మొదటి కాలానుగుణ ఈవెంట్‌ను ప్రారంబిస్తున్నట్లు ప్రకటించింది. ఈసారి హాలోవీన్ వేడుకలను జరుపుకునేలా ఉంది. ఇది సంపాదించడానికి కొత్త ట్రీయిట్స్ ,బాటిల్ రాయల్‌లో నైపుణ్యం సాధించడానికి కొత్త నైపుణ్యాలు, కొత్త లిమిట్-టైం మోడ్‌లు మరెన్నో ఉన్నాయి.

PUBG మొబైల్‌ గేమ్

PUBG మొబైల్‌ గేమ్ లో ప్రారంభించిన దీపావళి ధమకా ఈవెంట్ రోజువారీ మిషన్లతో వస్తుంది. వీటిని పూర్తి చేయడం ద్వారా వినియోగదారులు దీపావళి స్పార్క్లర్లను పొందటానికి వీలు కల్పిస్తారు. వీటిని గేమర్స్ క్రాకర్లను పేల్చడానికి లేదా గిఫ్ట్ టోకెన్లను కొనుగోలు చేయడానికి ఉపయోగించవచ్చు. లోబ్ స్టర్ సెట్, నైట్ మారే సెట్, క్రేట్ కూపన్లు, కుర్తా పైజామా సెట్, క్రికెట్ దుస్తులు లేదా పరిమిత ఎడిషన్ AWM / M415 గన్ స్కిన్స్ వంటి ఆటలోని వస్తువులను ఈ టోకెన్లతో కొనుగోలు చేయవచ్చు.

ఈవెంట్

ఈ ఈవెంట్ మూడు స్థాయిలను కలిగి ఉంటుంది. దీనిలో ఈ టోకెన్లు 25 క్రాకర్ల సమితిలో దాచబడి ఉంటాయి. కొంతమంది అదృష్ట విజేతలు ఒప్పో స్మార్ట్‌ఫోన్‌లు, బోట్ హెడ్‌ఫోన్‌లు, బంగారు మరియు వెండి నాణేలు, PUBG మొబైల్ సరుకులు వంటివి మరెన్నో గెలుచుకునే అవకాశాన్ని కూడా పొందవచ్చు.

 PUBG మొబైల్
 

పైన చెప్పినట్లుగా సంస్థ యొక్క తాజా PUBG మొబైల్ 0.15.0 అప్డేట్ తో కొత్త ఈవెంట్ ప్రారంభమైంది. ఆట యొక్క ‘సర్వైవ్ టిల్ డాన్' కొత్త మానవ వర్గాలు మరియు వస్తువులతో పాటు హాలోవీన్ అప్డేట్ ను పొందుతుంది.

కాల్ ఆఫ్ డ్యూటీ: మొబైల్ గేమ్

కాల్ ఆఫ్ డ్యూటీ: మొబైల్ గేమ్

కాల్ ఆఫ్ డ్యూటీ: మొబైల్ గేమ్ కూడా దాని సరికొత్త ఈవెంట్‌ను పొందుతోంది. ఇది హాలోవీన్ సమయానికి ప్రారంభమవుతుంది. ఈవెంట్ వ్యవధిలో పరిమిత-సమయం కంటెంట్ విడుదలను కంపెనీ ప్రారంభించింది. పైన చెప్పినట్లుగా ఈ గేమ్ ఈవెంట్ బాటిల్ రాయల్‌లో నైపుణ్యం సాధించడానికి కొత్త నైపుణ్యాలు, లిమిట్-టైం మోడ్‌లు మరియు మరెన్నో తీసుకువస్తుంది.

కాల్ ఆఫ్ డ్యూటీ

కాల్ ఆఫ్ డ్యూటీ: మొబైల్ సీజనల్ ఈవెంట్ గేమ్ లోపల ‘బ్లాక్ ఆప్స్ 2' స్టాండ్‌ఆఫ్ మ్యాప్ యొక్క హాలోవీన్ నేపథ్య వెర్షన్‌ను అందిస్తుంది. వీటిని టీం డెత్‌మ్యాచ్, సెర్చ్ & డిస్ట్రాయ్ లేదా డామినేషన్ మోడ్‌లలో చూడవచ్చు. ఈ కార్యక్రమానికి సంబంధించిన మరిన్ని వివరాలను అక్టోబర్ 22 న ప్రకటించాలని భావిస్తున్నారు. యాక్టివిజన్ ఈ ప్రకటనను ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది.

Most Read Articles
Best Mobiles in India

English summary
PUBG Mobile Game Starts Diwali Dhamaka Event

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X