Reliance Jio యూజర్లకు మరొక శుభవార్త.....

|

భారతదేశంలో అతిపెద్ద టెలికాం ఆపరేటర్లలో ఒకటైన రిలయన్స్ జియో ఇటీవలే ఏప్రిల్ 1, 2020 వరకు చెల్లుబాటు అయ్యే "జియో డేటా ప్యాక్" కింద 2GB అదనపు డేటాను ఉచితంగా ఇచ్చింది. లాక్ డౌన్ ఇంకా ఈ నెల మొత్తం ఉండవచ్చు అని తెలుస్తోంది.

రిలయన్స్ జియో

వినియోగదారులు ఉచిత హైస్పీడ్ డేటా ప్లాన్‌తో ఇప్పుడు పూర్తిగా వారి యొక్క పనులను సులభంగా చేస్తున్నారు. ఇటువంటి సమయంలో మళ్ళి వినియోగదారులు ఇలాంటి డేటా ప్లాన్‌ల కోసం వెతకవచ్చు. కొత్త డేటా ప్లాన్‌లను చూస్తున్న వినియోగదారుల కోసం రిలయన్స్ జియో రోజుకు 2GB డేటా ప్లాన్‌లను రూ.249 నుండి ఆఫర్ చేస్తున్నది. అంతేకాకుండా రోజుకు 2GB డేటా ప్లాన్‌లను నాలుగు 4G డేటా యాడ్‌తో కలిపి కూడా చేయవచ్చు. ఈ యాడ్-ఆన్ ప్యాక్‌లు వినియోగదారులకు మరింత అదనపు డేటాను అందిస్తాయి. వీటి గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

రిలయన్స్ జియో రోజువారి 2GB డేటా ప్యాక్స్

రిలయన్స్ జియో రోజువారి 2GB డేటా ప్యాక్స్

రిలయన్స్ జియో ప్రస్తుతం మూడు రోజువారి 2GB డేటా ప్యాక్ లను అందిస్తున్నది. రోజుకు 2GB డేటాను అందించే ప్యాక్‌లలో మొదటిది రూ.249 ధర గల ప్లాన్ మొత్తం చెల్లుబాటు కాలానికి 56GB డేటాను 28 రోజుల వాలిడిటీకి అందిస్తుంది. ఇది జియోయేతర నంబర్లకు 1000 నిమిషాల కాలింగ్‌ను మరియు జియో నంబర్‌లకు అపరిమిత కాలింగ్‌ను అందిస్తుంది. SMS క్యాప్ రోజుకు 100 కి పరిమితం చేయబడింది మరియు ఈ ప్లాన్ Jio యాప్ లకు కాంప్లిమెంటరీ చందాను అందిస్తుంది.

జియో
 

రూ.244 ప్యాక్‌కు సమానమైన అన్ని రకాల ప్రయోజనాలను అందించే రూ.444 మరియు రూ.599 ప్యాక్‌లను కూడా జియో సంస్థ అందిస్తున్నది. అయితే వీటి యొక్క చెల్లుబాటు సమయం వరుసగా 56 రోజులు మరియు 84 రోజులు. రిలయన్స్ జియో యొక్క రూ.444 ప్యాక్ వినియోగదారులకు మొత్తం చెల్లుబాటు కాలానికి 112GB డేటాను, 2000 నిమిషాల నాన్-జియో కాలింగ్‌ను అందిస్తుంది. ఈ సెగ్మెంట్ లో టాప్ టైడ్ ప్లాన్ రూ.599 ప్యాక్ తన మొత్తం చెల్లుబాటు కాలానికి 168GB డేటాను మరియు 3000 నిమిషాల నాన్-జియో కాలింగ్‌ ప్రయోజనాలను అందిస్తుంది.

రిలయన్స్ జియో 4G డేటా యాడ్-ఆన్ ప్యాక్‌లు

రిలయన్స్ జియో 4G డేటా యాడ్-ఆన్ ప్యాక్‌లు

కరోనావైరస్కు వ్యతిరేకంగా చేసిన పోరాటంలో భాగంగా రిలయన్స్ జియో తన 4G డేటా వోచర్లలో డబుల్ డేటాను అందిస్తోంది. రిలయన్స్ జియో రూ.251 డేటా ప్యాక్‌తో పాటు నాలుగు డేటా యాడ్-ఆన్ ప్యాక్‌లను అందిస్తుంది. జియో రూ.251 డేటా ప్యాక్‌ 51 రోజులపాటు యాక్సిస్ ను అందిస్తుంది. ఇది రోజుకు 2GB డేటా చొప్పున మొత్తం చెల్లుబాటు కాలానికి 102GB డేటాను అందిస్తుంది.

 

 

 

Airtel అందిస్తున్న అదనపు డేటా యాడ్-ఆన్ ప్లాన్‌లు....Airtel అందిస్తున్న అదనపు డేటా యాడ్-ఆన్ ప్లాన్‌లు....

యాడ్-ఆన్ ప్యాక్

యాడ్-ఆన్ ప్యాక్

జియో యొక్క బేస్ రూ.11 డేటా యాడ్-ఆన్ ప్యాక్ వినియోగదారులకు 800MB డేటా మరియు 75 నిమిషాల నాన్-జియో కాలింగ్‌ ప్రయోజనాలను అందిస్తుంది. రూ.21 యాడ్-ఆన్ ప్యాక్ 2GB డేటా, 200 నిమిషాల నాన్ జియో కాలింగ్ ప్రయోజనాలను మరియు చివరిగా రూ.51 ప్లాన్ 6GB డేటా, 500 నిమిషాల నాన్ జియో కాల్స్ ప్రయోజనాలను అందిస్తున్నాయి. జియో యొక్క రూ.101 ప్లాన్ 12GB డేటా మరియు 1000 నిమిషాల నాన్ జియో కాలింగ్‌ను అందిస్తుంది. స్వతంత్ర డేటా ప్యాక్ కాకుండా నాన్ జియో నిమిషాలను అందించే వోచర్లు యూజర్ యొక్క ప్రస్తుత ప్లాన్ ముగిసే వరకు చెల్లుబాటు అవుతాయని గమనించాలి.

Best Mobiles in India

English summary
Reliance Jio Provide Extra Data On These Prepaid Plans

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X