అమెజాన్ దీపావళి సేల్స్..... ఆఫర్లే ఆఫర్లు

|

ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ గత వారం చివరిలో తన గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ను ముగించింది. అందులో స్మార్ట్‌ఫోన్‌లపై అద్భుతమైన డిస్కౌంట్లను మరియు గొప్ప ఆఫర్లను అందించింది. ఇండియాలో దీపావళి ఈ నెల 27న జరుతున్న సందర్బంగా దాని కంటే వారం ముందు అమెజాన్ లో మళ్ళీ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్ ను తీసుకువస్తోంది. స్మార్ట్‌ఫోన్‌లు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు మరియు గృహోపకరణాలను ఇంకా ఎవరైనా కొనుకున్న ఉంటే వారి కోసం మళ్ళి గొప్ప అవకాశం కల్పిస్తోంది.

ఆఫర్స్
 

స్మార్ట్‌ఫోన్‌లు, గాడ్జెట్లు, వాటి ఉపకరణాలు మరియు మరెన్నో వాటిపై గొప్ప ఆఫర్స్ మరియు డిస్కౌంట్లతో ఉత్సవాల్లో రింగ్ చేయడానికి అమెజాన్ తన గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ను దీపావళికి ముందే ప్రవేశపెట్టింది. అమెజాన్ యొక్క కొత్త గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ దీపావళి స్పెషల్ సేల్స్ అక్టోబర్ 21 అంటే సోమవారం నుండి ప్రారంభమవుతుంది. ఈ సేల్స్ ఐదు రోజుల పాటు అంటే అక్టోబర్ 25 శుక్రవారం వరకు కొనసాగుతుంది.

ప్రైమ్

సాంప్రదాయం ప్రకారం ప్రైమ్ సభ్యులకు అక్టోబర్ 20 మధ్యాహ్నం 12గంటల నుండి ప్రారంభ యాక్సిస్ లభిస్తుంది. ఈ-కామర్స్ దిగ్గజం వన్‌ప్లస్ 7 T, శామ్‌సంగ్ గెలాక్సీ M30 , వివో U 10 వంటి మరిన్ని స్మార్ట్‌ఫోన్‌లపై గొప్ప ఆఫర్లను మరియు డిస్కౌంట్లను అందిస్తుంది. మొబైల్ ఆక్సిస్సోరీస్ రూ.49ల నుండి మొదలవుతాయి.

 డెబిట్ మరియు క్రెడిట్ కార్డు

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ యొక్క తాజా ఎడిషన్ లో ఆన్ లైన్ కొనుగోలులో డెబిట్ మరియు క్రెడిట్ కార్డుల యొక్క అన్ని రూపే కార్డులపై 10 శాతం తక్షణ తగ్గింపును అందించడానికి అమెజాన్ యాక్సిస్ బ్యాంక్ మరియు సిటీ బ్యాంక్‌తో భాగస్వామ్యం కలిగి ఉంది. ఈ వారం ప్రారంభంలో ప్రారంభించిన రెడ్‌మి నోట్ 8 ప్రో మరియు రెడ్‌మి నోట్ 8 స్మార్ట్‌ఫోన్‌ అమ్మకాలు కూడా మొదటిసారి ఈ సమయంలో మొదలుకానున్నాయి. ఎయిర్‌టెల్ 1120GB డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్ మరియు ఎయిర్‌టెల్ థాంక్స్ ప్రయోజనాలను లాంచ్ ఆఫర్‌గా అందిస్తోంది.

ఆపిల్ నుంచి త్వరలో స్మార్ట్ రింగ్...

శామ్‌సంగ్
 

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ యొక్క తాజా ఎడిషన్ లో శామ్‌సంగ్ గెలాక్సీ ఎం 10, శామ్‌సంగ్ గెలాక్సీ ఎ 10 ఫోన్ లపై రూ.1,000 డిస్కౌంట్ అందిస్తోంది. అలాగే వివో యు 10ను కొనుగోలు చేసిన వారికి ప్రీపెయిడ్ ఎంపికపై రూ.1,000 తగ్గింపు కూడా లభిస్తుంది. ఇటీవల ప్రారంభించిన నోకియా 6.2 యొక్క రూ. 15,999 తాత్కాలిక ధరలను రూ.14,499 లకు తగ్గిస్తోంది. అలాగే వన్‌ప్లస్ 7 ను రూ. 29,999 ధర వద్ద మరియు రెడ్‌మి 7 ఎ ను రూ .6,499 కు బదులుగా రూ. 4,999 ధర వద్ద అందిస్తోంది.

స్మార్ట్‌ఫోన్‌

స్మార్ట్‌ఫోన్‌ ఒరిజినల్ ధర ఆఫర్ ధర
వన్‌ప్లస్ 7 ప్రో రూ. 44,999 రూ. 43,999
పోకో ఎఫ్ 1 రూ. 15,999 రూ. 14,999

అమెజాన్ సేల్స్

అలాగే స్మార్ట్‌ఫోన్‌ల యొక్క వాటి ఉపకరణాలు రూ.49ల నుండి మొదలవుతాయి. పవర్ బ్యాంకులు, బ్లూటూత్ హెడ్‌సెట్‌లు రూ.399 నుండి మొదలవుతాయి. అమెజాన్ సేల్స్ లో గృహోపకరణాలు మరియు టీవీలపై 60 శాతం వరకు, హోమ్ మరియు కిచెన్ ఉత్పత్తులపై 70 శాతం వరకు మినహాయింపు ఇవ్వనుంది. స్మార్ట్‌ఫోన్‌లపై అందిస్తున్న మరిన్ని ఒప్పందాలను చూడటానికి అమెజాన్ యొక్క ప్రత్యేక పేజీకి వెళ్ళండి.

డెబిట్ మరియు క్రెడిట్ కార్డు

డెబిట్ మరియు క్రెడిట్ కార్డులలో బజాజ్ ఫిన్‌సర్వ్ కార్డులు మరియు అమెజాన్ పే ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్‌లపై అపరిమిత రివార్డ్ పాయింట్లను, నో-కాస్ట్ EMI వంటి అనేక రకాల ఫైనాన్స్ ఎంపికలు కూడా ఉంటాయని కంపెనీ తెలిపింది. ఎకో డాట్‌ను ఫ్రీ స్మార్ట్ బల్బ్ ఒప్పందంతో పాటు ప్రత్యేక ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. ఇతర అమెజాన్ ఉత్పత్తులు ఎకో షో, ఫైర్‌టివి స్టిక్, కిండ్ల్ వంటి వాటిని ప్రత్యేక డిస్కౌంట్లతో జాబితా చేయబడ్డాయి.

ఎలక్ట్రానిక్స్

ఇతర ఎలక్ట్రానిక్స్ విషయానికి వస్తే హెచ్‌పి కోర్ ఐ 5 1 టిబి హెచ్‌డిడి ల్యాప్‌టాప్ రూ. 42,990, సోనీ 5100 ఎల్ కెమెరా రూ. 27,990, శామ్‌సంగ్ గెలాక్సీ యాక్టివ్ వాచ్‌ను రూ.17,990, బోట్ ఎయిర్‌డోప్‌లను రూ.2,499 ధర వద్ద లబిస్తాయి.

Most Read Articles
Best Mobiles in India

English summary
Amazon Great Indian Festival Diwali Special Sale: Discounts and Other Details Revealed

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X