శాంసంగ్ ఫోన్ మళ్లీ పేలింది, ఈ సారి గెలాక్సీ జె5

Written By:

వరసగా తగులుతున్న షాకులతో శాంసంగ్ కుదేలయిపోతోంది. శాంసంగ్ గెలాక్సీ నోట్ 7 మంటలు ఆరకముందే గెలాక్సీ జే 5 స్మార్ట్‌ఫోన్ పేలినట్లు సోషల్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఫ్రాన్స్ దేశంలోని పావ్ నగరంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలిసింది. లమ్యా బౌయిర్డెన్ అనే మహిళ తన కుటుంబసభ్యులతో కలిసి పార్టీ చేసుకుంటున్న సమయంలో తన ఫోన్ (శాంసంగ్ గెలాక్సీ జే 5) బాగా వేడిగా అయినట్లు చెప్పింది.

ఫ్లిప్‌కార్డ్‌తో జతకట్టి ఆపిల్ కుమ్మేసింది

శాంసంగ్ ఫోన్ మళ్లీ పేలింది, ఈ సారి గెలాక్సీ జె5

ఆ వెంటనే ఫోన్ నుంచి పొగలు రావడంతో దూరంగా విసిరేసినట్లు వెల్లడించింది. తర్వాత ఫోన్లో నుంచి మంటలు వచ్చి పేలిపోయినట్లు తెలిపింది. తన కుటుంబసభ్యుల్లో ఒకరు మంటలను ఆర్పేసినట్లు పేర్కొంది. ఈ మేరకు మీడియాలో కథనాలు వస్తున్నాయి.

లెనోవా నుంచి మరో సంచలనం,ఈ రోజే లాంచ్

శాంసంగ్ ఫోన్ మళ్లీ పేలింది, ఈ సారి గెలాక్సీ జె5

కాగా గత ఏడాది జూన్ లో ఓ ఈ కామర్స్ వెబ్ సైట్ నుంచి ఫోన్‌ను కొనుగోలు చేసినట్లు చెప్పింది. కాగా గెలాక్సీ నోట్ 7 ఫోన్లు పేలిపోతుండటంతో వాటన్నింటిని శాంసంగ్ వెనక్కు పిలిచిన విషయం తెలిసిందే. అయితే ఈ సంఘటనపై శాంసంగ్ ఇంకా స్పందించలేదు.

జీఎం నుంచి సరికొత్త మొబైల్

ఈ నేపధ్యంలో మీ ఫోన్ సేఫ్ గా ఉండేందుకు కొన్ని సూచనలు ఇస్తున్నాం వీలయితే ఫాలో అవ్వండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సింపుల్ టిప్స్‌

ఫోన్‌లో ఎక్కువ సేపు వీడియో కాల్స్ చేయటం, గ్రాఫికల్ గేమ్స్ ఆడటం, యూట్యూబ్ వీడియోలను చూడటం, ఇంటర్నెట్‌ను బ్రౌజ్ చేయటం వల్ల ఓవర్‌హీట్ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. ఫోన్ హీటింగ్ సమస్యలను ఎదుర్కొంటున్న వారు కొన్ని కొన్ని సింపుల్ టిప్స్‌ను అప్లై చేయటం ద్వారా ఓవర్‌హీట్ ఫోన్‌ను కూల్ చేయవచ్చు.

 

 

అవసరం‌లేని కనెక్టువిటీ సర్వీసులను

ఫోన్‌లో అవసరం‌లేని కనెక్టువిటీ సర్వీసులను డిసేబుల్ చేయటం ద్వారా హీటింగ్ ను తగ్గించుకోవచ్చు.

 

 

గంటల కొద్ది విశ్రాంతి లేకుండా

3జీ, 4జీ వంటి ఇంటర్నెట్ మొబైల్ డేటా సేవలను గంటల కొద్ది విశ్రాంతి లేకుండా వినియోగించుకోవటం వల్ల ఫోన్ ఓవర్ హీట్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఇంటర్నెట్‌ను బ్రౌజ్ చేస్తున్న ప్రతి 20 నిమిషాలకు బ్రేక్ తప్పనిసరి.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అవసరం‌లేని బ్యాక్ గ్రౌండ్ యాప్స్‌ను

ఫోన్‌లో అవసరం‌లేని బ్యాక్ గ్రౌండ్ యాప్స్‌ను కిల్ చేయటం ద్వారా ఫోన్ పై ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.

 

 

ఎప్పటికప్పుడు అప్‌డేట్

ఆపరేటింగ్ సిస్టం ఇంకా యాప్స్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవటం ద్వారా ఓవర్ హీటింగ్ సమస్యల నుంచి బయటపడవచ్చు.

 

 

నాసిరకం బ్యాటరీల కారణంగా

నాసిరకం బ్యాటరీల కారణంగా ఫోన్ ఓవర్ హీటింగ్ కు గురయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి, జెన్యున్ బ్యాటరీలనే వాడండి.

 

 

కనెక్టువిటీ ఫీచర్లను

వై-ఫై, 3జీ, 4జీ, బ్లూటుత్ వంటి కనెక్టువిటీ ఫీచర్లను మితంగా వాడటం వల్ల ఫోన్ ప్రాసెసర్ ఎప్పటికప్పుడు కూల్‌గా ఉంటుంది.

 

 

తగ్గించుకునే ప్రయత్నం

మీ ఫోన్‌లో పరిమితికి మించి యాప్స్ ఉన్నాయా..? ఉన్నట్లయితే వాటిని తగ్గించుకునే ప్రయత్నం చేయండి. ఫోన్‌లో అవసరం లేని యాప్స్‌ను తొలగించటం ద్వారా ఫోన్ ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.

 

 

ఎక్కువ సేపు గేమ్స్ ఆడటం

ఫోన్‌లో ఎక్కువ సేపు గేమ్స్ ఆడటం తగ్గించండి. ఒకవేళ ఆడవల్సి వస్తే ప్రతి 20-25 నిమిషాలకు ఒక బ్రేక్ ఇవ్వండి.

 

 

రూటింగ్ అలానే కస్టమర్ ROMను

పై చిట్కాలు పాటించినప్పటికి మీ ఫోన్ ఓవర్ హీటింగ్‌ను ఎదుర్కొంటున్నట్లయితే రూటింగ్ అలానే కస్టమర్ ROMను ఇన్స్‌స్టాల్ చేయటం వల్ల పురోగతి కనిపించవచ్చు.

 

 

చార్జ్ అవుతోన్న సమయంలో

ఫోన్ చార్జ్ అవుతోన్న సమయంలో కాల్స్ చేయటం, గేమ్స్ ఆడటం, ఇంటర్నెట్ బ్రౌజ్ చేయటం వల్ల ఫోన్ ఓవర్ హీట్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి, అటువంటి అలవాట్లను మానుకునే ప్రయత్నం చేయండి.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Samsung Galaxy J5 smartphone explodes in France: Report read more at gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot