Home
News

Samsung Independence Day Offer 2020: గెలాక్సీ స్మార్ట్‌ఫోన్లను ఉచితంగా పొందే గొప్ప అవకాశం!!!

ఇండియాలో ఆగష్టు నెలకు ఒక ప్రతేకమైన విషయం ఉంది. ఆగష్టు 15 స్వాతంతర్య దినోత్సవం సందర్భంను పురస్కరించుకొని అనేక సంస్థలు తమ వినియోగదారుల కోసం అద్భుతమైన ఆఫర్లను అందిస్తున్నాయి. ఈ కోవలో శామ్సంగ్ సంస్థ అందరి కంటే ముందు ఉన్నది. టెలివిజన్లు, రిఫ్రిజిరేటర్లు, స్మార్ట్ ఓవెన్లు, వాషింగ్ మెషీన్లు మరియు ఎయిర్ కండీషనర్లను కొనుగోలు చేయడానికి చాలా మంది శామ్సంగ్ బ్రాండ్ ను ఎంచుకుంటారు. ఇండియాలో ఈ సంస్థ ప్రత్యేకంగా 'శామ్సంగ్ స్వాతంత్ర్య దినోత్సవ ఆఫర్లను' శామ్సంగ్ ప్రకటించింది. కొత్త ఆఫర్లు 2020 ఆగస్టు 31 వరకు అందుబాటులో ఉంటాయి. మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

శామ్సంగ్ స్వాతంత్ర్య దినోత్సవ ఆఫర్లు

శామ్సంగ్ స్వాతంత్ర్య దినోత్సవ ఆఫర్లు

శామ్సంగ్ స్వాతంత్ర్య దినోత్సవ ఆఫర్ యొక్క వ్యవధిలో శామ్సంగ్ సంస్థ తన అన్ని రకాల ఉత్పతుల మీద 15% వరకు క్యాష్‌బ్యాక్‌ను అందిస్తున్నది. అలాగే నెలకు రూ.990 కంటే తక్కువ EMI లను అందించడానికి కొన్ని బ్యాంకులతో ఒప్పందాలను కుదుర్చుకున్నది.

శామ్సంగ్ స్వాతంతర్య దినోత్సవ ఉచిత ఆఫర్లు

శామ్సంగ్ స్వాతంతర్య దినోత్సవ ఉచిత ఆఫర్లు

శామ్సంగ్ స్వాతంతర్య దినోత్సవ ఆఫర్లలో భాగంగా సంస్థ రూ.77,999 విలువైన శామ్సంగ్ QLED 8K టీవీను కొనుగోలు చేసిన వారికి ఉచితంగా గెలాక్సీ S20 + ను అందిస్తోంది. వినియోగదారులు ఎంచుకున్న శామ్సంగ్ QLED టివి యొక్క ప్యానెల్‌పై 10 సంవత్సరాల నో స్క్రీన్ బర్న్-ఇన్ వారంటీ మరియు 3 సంవత్సరాల వారంటీని కూడా అందిస్తోంది.

శామ్‌సంగ్ స్మార్ట్ టీవీలపై క్యాష్‌బ్యాక్ ఆఫర్లు

శామ్‌సంగ్ స్మార్ట్ టీవీలపై క్యాష్‌బ్యాక్ ఆఫర్లు

శామ్‌సంగ్ సంస్థ ఈ ప్రత్యేక సేల్ లో స్మార్ట్ టీవీల మీద కస్టమర్లకు రూ.9,000 వరకు క్యాష్‌బ్యాక్ ను అందిస్తుంది. అలాగే నెలకు రూ.990 నుండి మొదలయ్యే EMI ఎంపికలతో 43 అంగుళాలు మరియు అంతకంటే పెద్ద స్క్రీన్ గల మోడళ్లను కొనుగోలు చేయవచ్చు. శామ్సంగ్ సంస్థ ఎంచుకున్న టీవీల కొనుగోలు మీద ఒక నెల Zee5 చందాను మరియు Zee5 ప్రీమియం ప్యాక్లలో 30% తగ్గింపును కూడా ఉచితంగా అందిస్తుంది.

శామ్‌సంగ్ రిఫ్రిజిరేటర్ ఉచిత ఆఫర్లు

శామ్‌సంగ్ రిఫ్రిజిరేటర్ ఉచిత ఆఫర్లు

శామ్‌సంగ్ సంస్థ యొక్క కొత్త రిఫ్రిజిరేటర్లను కొనుగోలు కోసం చూస్తున్న వారికి ఈ సేల్ మంచి తగ్గింపులను అందిస్తోంది. సామ్‌సంగ్ సంస్థ రూ.37,999 విలువైన స్పేస్‌మాక్స్ ఫ్యామిలీ హబ్ ఫ్రిజ్‌ను కొనుగోలు చేసిన వారికి గెలాక్సీ నోట్ 10 లైట్‌ను ఉచితంగా అందిస్తోంది. అదనంగా శామ్సంగ్ రిఫ్రిజిరేటర్లు మరియు వాషింగ్ మెషీన్ల కొనుగోలుపై వినియోగదారులు 15% వరకు క్యాష్‌బ్యాక్ ను పొందుతారు. అలాగే రూ.990 కంటే తక్కువ ధర గల EMI ఎంపికలను పొందవచ్చు. 300L సామర్థ్యం కంటే ఎక్కువ రిఫ్రిజిరేటర్ల మీద EMI తగ్గింపు అధికంగా కూడా ఉంటుంది.

శామ్‌సంగ్ ఎయిర్ కండీషనర్ ఉచిత ఆఫర్లు

శామ్‌సంగ్ ఎయిర్ కండీషనర్ ఉచిత ఆఫర్లు

శామ్సంగ్ బ్రాండ్ ఎయిర్ కండీషనర్లను కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులు నెలకు రూ.990 కంటే తక్కువ ధర గల EMI లను పొందవచ్చు. గది అంతటా గాలిని సమానంగా వ్యాప్తి చేయడానికి 23,000 సూక్ష్మ రంధ్రాలతో వచ్చే శామ్‌సంగ్ విండ్-ఫ్రీ ఎయిర్ కండీషనర్‌ను కొనుగోలు చేయదలచిన వినియోగదారులు 15% వరకు క్యాష్‌బ్యాక్ పొందుతారు. అదనంగా 5- ఇయర్ కండెన్సర్ మరియు పిసిబి కంట్రోలర్ వారంటీ లభిస్తుంది. అలాగే ఎంపిక చేసిన ఎయిర్ కండీషనర్ మోడళ్లపై డిజిటల్ ఇన్వర్టర్ కంప్రెషర్‌పై 10 సంవత్సరాల వారంటీతో పాటు ఉచిత ఇన్‌స్టాలేషన్ మరియు ఉచిత గ్యాస్ రీఛార్జ్ కూడా ఇవ్వబడుతుంది అని శామ్‌సంగ్ సంస్థ ప్రకటనలో తెలిపింది.

Best Mobiles in India

English summary
Samsung Independence Day Offer 2020: Best Offers and Discounts on Samsung Products
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X