ఫేస్‌బుక్‌లో ‘Digital India’ దుమారం

Posted By:

మీ ఫేస్‌బుక్ స్నేహితుల్లో చాలా మంది ప్రొఫైల్ ఫోటోలు జాతీయ జెండాలోని మూడు రంగులతో కొత్త రూపును సంతరించుకోవటం మీరు గమనించే ఉంటారు. వాళ్లంతా డిజిటల్ ఇండియాకు తమ మద్దతును తెలిపే క్రమంలో వారి వారి ప్రొఫైల్ ఫోటోలను అలా మార్చుకున్నారు. భారతదేశాన్ని డిజిటల్ ఇండియాగా మార్చలన్న లక్ష్యంతో ప్రధాని మోదీ ముందుకువెళుతున్న విషయం మనందరికి తెలిసిందే.

Read More : కొత్తగా ఆండ్రాయిడ్ ఫోన్ కొన్నారా..? ఇవి మర్చిపోకండి

ఫేస్‌బుక్‌లో ‘Digital India’ దుమారం

ఇందులో భాగంగా కాలిఫోర్నియాలోని ఫేస్ బుక్ ప్రధాన కార్యాలయాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జూకర్ బర్గ్ డిజిటల్ ఇండియాకు తన పూర్తి మద్దతును ప్రకటించి తన ప్రొఫైల్ పిక్‌ను త్రివర్ణంలో ఉండేలా మార్చారు. జూకర్ బర్గ్ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ప్రధాన మోదీ కూడా తన ప్రొఫైల్ పిక్‌ను మార్చేసారు. అక్కడి నుంచి మొదలైన ఈ మార్పుతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది భారతీయులు డిజిటల్ ఇండియాకు తమ మద్దతును ప్రకటిస్తూ తమ ఫేస్‌బుక్ ప్రొఫైల్స్‌ను చకాచకా మార్చేసుకుంటున్నారు.

Read More : ఫ్లిప్‌కార్ట్ ‘Big Billion Sale' వచ్చేస్తోంది

ఫేస్‌బుక్‌లో ‘Digital India’ దుమారం

ప్రొఫైల్ పిక్‌ను మార్చుకుంటే ఫేస్‌బుక్ Internet.orgని సపోర్ట్ చేసినట్టే!

డిజిటల్ ఇండియాను సపోర్ట్ చేసే ముసుగులో Facebook తన Internet.org Programmeని ప్రచారం చేసుకుంటోందని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తన Internet.org ద్వారా దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరికి ఫేస్ బుక్ ను ఉచితంగా అందించి తద్వారా వచ్చే అడ్వర్ టైజింగ్ రెవెన్యూ అలానే మార్కెట్ పరిధిని విస్తరించుకోవటానికి ఫేస్‌బుక్ ఈ టెక్నిక్‌ను అవలంభించిదని పలువురు అంటున్నారు.

Read More : పాకిస్తాన్ పై ‘దెబ్బకు దెబ్బ'

ఫేస్‌బుక్‌లో ‘Digital India’ దుమారం

డిజిటల్ ఇండియాను సపోర్ట్ చేస్తే Internet.orgని సపోర్ట్ చేసినట్లు కాదు : ఫేస్‌బుక్

ఫేస్‌బుక్ ట్రై-కలర్ ప్రొఫైల్ పిక్షర్ టూల్ విమర్శలను ఎదుర్కొంటోన్న నేపథ్యంలో సోషల్ మీడియా దిగ్గజం స్పందించింది. తమ Internet.org ప్రోగ్రామ్‌కు, డిజిటల్ ఇండియా ప్రాజెక్టుకు ఏ మాత్రం కనెక్షన్ లేదని CSS Stylesheetలో తమ ఇంజినీర్ పొరపాటున "Internet.org profile picture" పదాలను ఉపయోగించటం వల్ల ఈ సమస్య తలెత్తిందని ఫేస్‌బుక్ వివరణ ఇచ్చుకుంది.

English summary
Supporting Digital India is not supporting Internet.org, Facebook . Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot