Tata Sky ఉచిత ఛానెల్‌లు... శక్తిమాన్, మహాభారతంలను మళ్ళి చూసే అవకాశం

|

టాటా స్కై ఇప్పుడు తన ప్లాట్‌ఫామ్‌లోకి మరొక రెండు ఛానెలు డిడి రెట్రో మరియు సిబిబీస్‌లను ఉచితంగా అందిస్తోంది. రెండు రోజుల క్రితం టాటా స్కై మూడు ఛానెళ్లను ఉచితంగా అందించింది. ఇప్పుడు వీటితో కలుపుకొని మొత్తంగా ఐదు ఛానల్లను లాక్ డౌన్ సమయం మొత్తం ఉచితంగా అందించనున్నది. కంపెనీ సోమవారం యూరోస్పోర్ట్ హెచ్‌డి, జీ బిస్కోప్, 1 స్పోర్ట్స్ వంటి మూడు ఛానెళ్లను తన ప్లాట్‌ఫామ్‌లోకి జోడించింది. డిడి రెట్రోను దాని ప్లాట్‌ఫామ్‌కు జోడించిన మూడవ ప్రైవేట్ ఆపరేటర్ డైరెక్ట్-టు-హోమ్ (డిటిహెచ్) ఆపరేటర్‌గా టాటా స్కై అవతరించింది. నోస్టాల్జిక్ కార్యక్రమాలకు అంకితమైన దూరదర్శన్ ఛానెల్ డిడి రెట్రో ఏప్రిల్ రెండవ వారంలో సన్ డైరెక్ట్ మరియు ఎయిర్‌టెల్ డిజిటల్ టివిలు తమ ప్లాట్‌ఫామ్‌లలో అందరికంటే ముందుగా చేర్చారు. పిల్లల కోసం అంకితమైన సిబిబీస్‌ ఛానెల్ 2012 ప్రారంభంలో మూసివేయబడింది.

డిడి రెట్రోలో ప్రసారం చేసే ప్రోగ్రాంలు--- శక్తిమాన్,

డిడి రెట్రోలో ప్రసారం చేసే ప్రోగ్రాంలు--- శక్తిమాన్,

మహాభారతందూరదర్శన్ యొక్క డిడి రెట్రో ఛానల్ లలో రామాయణం, మరియు మహాభారతం యొక్క ప్రసారంను ఏర్పాటు చేసినట్లు తన యొక్క బ్లాగ్ పోస్ట్‌లో హైలైట్ చేసింది. ఇంకా దూరదర్శన్ వరుసగా రెండు వారాలు భారతదేశంలో అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నట్లు గుర్తించబడింది. "మీకు ఇష్టమైన మరియు చిరస్మరణీయ సీరియల్స్ యొక్క వ్యామోహంను తీర్చడానికి దూరదర్శన్ యొక్క డిడి రెట్రో ఛానల్ చూడండి" అని బ్రాడ్కాస్టర్ తన నోట్లో పేర్కొంది.డిడి రెట్రోలో నాస్టాల్జిక్ కార్యక్రమాలలో శక్తిమాన్, చాణక్య, సంకత్ మోచన్ హనుమాన్, ఉపనిషద్ గంగా మరియు మహాభారత్ వంటి ప్రోగ్రాంలు ఉన్నాయి. డిడి రెట్రో ఏదైనా వీక్షకుల రికార్డులను సృష్టించగలదా అనేది చూడవలసి ఉంది. కాకపోతే సోషల్ మీడియాలో ప్రస్తుతం వీటి యొక్క డిమాండ్ ఎక్కువగా ఉంది. డిడిహెచ్ ఆపరేటర్లను డిడి రెట్రోను జోడించమని పలువురు ప్రేక్షకులు అభ్యర్థిస్తున్నారు. టాటా స్కై ప్లాట్‌ఫామ్‌లో డిడి రెట్రో ఛానెల్ 180 లో అందుబాటులో ఉంది. ఇది చందాదారులందరికీ ప్రస్తుతం పూర్తిగా ఉచితంగా లభిస్తుంది.

డిష్ టీవీ ట్వీట్

డిష్ టీవీ ట్వీట్

డిష్ టీవీ ట్వీట్ ప్రజలు ఎక్కువగా కోరుకునే ఈ ఛానెల్‌ను తన ప్లాట్‌ఫామ్‌లోకి తీసుకురావడానికి ఆపరేటర్ బ్రాడ్‌కాస్టర్‌తో కలిసి పనిచేస్తున్నట్లు డిష్ టివి బుధవారం ఒక ట్వీట్‌లో పేర్కొంది. "మా ప్లాట్‌ఫామ్‌లో డిడి రెట్రో ఛానెల్‌ను తీసుకురావడానికి మేము ఇప్పటికే ప్రసారకర్తలతో కలిసి పని చేస్తున్నాము. కొత్త అప్ డేట్ ల కోసం మా వెబ్‌సైట్‌లో చూడండి"అని డిష్ టీవీ ఒక ట్వీట్‌లో పేర్కొంది.

టాటా స్కైలో CBeeBies ఛానల్

టాటా స్కైలో CBeeBies ఛానల్

 బిబిసి స్టేబుల్ నుండి పిల్లల కోసం అందిస్తున్న CBeeBies ఛానెల్‌ను ఛానల్ నెంబర్ 687 లో టాటా స్కై వీక్షకులు యాక్సెస్ చేయవచ్చు. టాటా స్కైలో లభించే డేటా ప్రకారం ఈ ఛానెల్ యొక్క ధర నెలకు రూ.5 లుగా నిర్ణయించారు. అయితే వీక్షకులందరికీ ఇది మొదటి 15 రోజులు ఉచితం అందించబడుతుంది.

టాటా స్కై యూరోస్పోర్ట్ HD, Zee బిస్కోప్

టాటా స్కై యూరోస్పోర్ట్ HD, Zee బిస్కోప్

టాటా స్కై యూజర్లు ఇప్పుడు ఛానల్ నెంబర్ 495 లో యూరోస్పోర్ట్ హెచ్‌డిని యాక్సెస్ చేయవచ్చు. అలాగే 1 స్పోర్ట్స్ ను ఛానల్ నెంబర్ 498 లో మరియు భోజ్‌పురి ఛానల్ Zee బిస్కోప్‌ను ఛానల్ నెంబర్ 1120 లో యాక్సెస్ చేయవచ్చు. ప్రస్తుతం కొనసాగుతున్న లాక్ డౌన్ సమయంలో మొదటి 10 రోజుల్లో ఈ మూడు ఛానెల్‌లను టాటా స్కై వినియోగదారులు ఉచితంగా పొందవచ్చు. ఈ సమయం తరువాత వీటికి ఒక నెలకు రూ.6 చొప్పున యూరోస్పోర్ట్‌ను, 1 స్పోర్ట్స్ ఛానెల్‌ను నెలకు రూ.4 చొప్పున మరియు Zee బిస్కోప్ ను రూ.0.10 నెలవారీ ధరను చెల్లించి యాక్సిస్ చేయవచ్చు.

Best Mobiles in India

Read more about:
English summary
Tata Sky Now provide DD Retro and CBeeBies Channels Free Of Cost

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X