Vodafone Idea యొక్క కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లు... డేటా ఆఫర్స్ బ్రహ్మాండం...

|

ఇండియాలోని టెలికామ్ సంస్థలలో వోడాఫోన్ ఐడియా ఒకటి. ఈ సంస్థ కొన్ని కఠినమైన సమయాలను చూసినప్పటికీ లాక్డౌన్ కాలం దీనికి ఎంతో ప్రయోజనం చేకూర్చింది. వోడాఫోన్ మరియు ఐడియా విలీనం టెల్కోస్ వారి వనరులను మిళితం చేయడానికి మరియు మెరుగైన సాంకేతిక పరిజ్ఞానాన్ని సృష్టించడానికి మరియు వారి కార్యకలాపాలతో మరింత వినూత్నంగా ఉండటానికి అనుమతించింది.

 

వోడాఫోన్ ఐడియా

వోడాఫోన్ ఐడియా 2020 సంవత్సరంలో ఇప్పుడు కొత్తగా మరి కొన్ని ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. టెల్కో ప్రస్తుతానికి మార్కెట్లో ఉత్తమమైన 1.5GB డేటా ప్లాన్‌లను అందిస్తోంది. వోడాఫోన్ సంస్థ ఈ సంవత్సరంలో ఐదు కొత్త ప్రణాళికలను తీసుకువచ్చింది. ఈ ప్రణాళికలు సంస్థ యొక్క భవిష్యత్తు కోసం చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. చాలా మంది వోడాఫోన్ ఐడియా కస్టమర్లు 1.5GB రోజువారీ డేటా ప్లాన్‌లను ఎంచుకుంటారు. ఎందుకంటే వారు ప్రస్తుతం డబుల్ డేటా ప్రయోజనంను అందిస్తున్నారు. రోజుకు 1.5GB డేటాను అందించే వోడాఫోన్ ఐడియా యొక్క ఐదు ప్లాన్‌ల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

వోడాఫోన్ రూ .249 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్
 

వోడాఫోన్ రూ .249 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్

వొడాఫోన్ పరిమిత ప్లాన్‌లపై డబుల్ డేటా ఆఫర్‌ను అమలు చేసింది. వోడాఫోన్ యొక్క రూ.249 ధర వద్ద గల ప్లాన్ వినియోగదారులకు 1.5GB రోజువారీ డేటా మరియు 1.5GB అదనపు రోజువారీ డేటాను అందిస్తుంది. బేస్ ప్లాన్ 28 రోజుల వాలిడిటీతో అన్ని నెట్వర్క్ లకు అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100SMS ప్రయోజనాలను అందిస్తుంది. డబుల్ డేటా ఆఫర్ ప్లాన్ లు కాకుండా వోడాఫోన్ రోజువారీ 3GB డేటా స్వతంత్ర డేటా ప్లాన్‌ను కూడా అందిస్తున్నది. ఈ ప్లాన్ రోజువారీ 3GB డేటా ప్రయోజనాలతో పాటు పైన పేర్కొన్న అన్ని రకాల ప్లాన్‌లకు సమానమైన అన్ని రకాల ప్రయోజనాలను అందిస్తాయి. వీటి యొక్క ధరలు మరియు వాలిడిటీ వరుసగా 28 రోజుల వాలిడిటీ గల ప్లాన్ యొక్క ధర రూ.398 మరియు 56 రోజుల చెల్లుబాటు గల ప్లాన్ యొక్క ధర 558 రూపాయలు.

వోడాఫోన్ రూ.399 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్

వోడాఫోన్ రూ.399 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్

వోడాఫోన్ ఐడియా యొక్క రెండవ ప్లాన్ రూ.399 ధరను కలిగి ఉండి 56 రోజుల చెల్లుబాటు కాలానికి అందిస్తుంది. ఇది కూడా 1.5GB రోజువారీ డేటా ప్రయోజనాన్ని అందిస్తుంది. అలాగే రోజుకు 100 SMSలతో పాటుగా అపరిమిత ఉచిత వాయిస్ కాలింగ్ ప్రయోజనం కూడా ఉంటుంది. ఇతర ప్రయోజనాల విషయానికి వస్తే ఐడియా టివి లేదా రూ.499 విలువైన వొడాఫోన్ ప్లే చందా మరియు రూ.999 విలువైన ZEE5 చందాను ఉచితంగా అందిస్తుంది. ZEE5 కంటెంట్ వోడాఫోన్ ప్లే యాప్ లోనే లభిస్తుందని గమనించండి. రూ .249 ప్లాన్ మాదిరిగానే రూ. 399 ప్లాన్ కూడా వోడాఫోన్ ఐడియా యొక్క డబుల్ డేటా ఆఫర్‌ను అందిస్తున్నది. కాబట్టి వినియోగదారులు రోజుకు 3 జిబి డేటాను 56 రోజుల పాటు పొందుతారు.

రూ.499 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్

రూ.499 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్

వోడాఫోన్ ఐడియా యొక్క రూ.499 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ రోజువారీ 1.5GB హై-స్పీడ్ ఇంటర్నెట్‌ డేటా, రోజుకు 100 SMS ప్రయోజనాలతో పాటు అపరిమిత కాలింగ్ సౌకర్యం ఉంటుంది. వోడాఫోన్ ఐడియా అదనపు ఖర్చు లేకుండా 499 రూపాయల విలువైన ఐడియా టివి లేదా వోడాఫోన్ ప్లే చందా వంటి అదనపు ప్రయోజనాలను కూడా అందిస్తుంది. అలాగే సంబంధిత OTT యాప్ లలో ZEE5 ప్రీమియం కంటెంట్ అందుబాటులో ఉంటుంది. ఈ ప్లాన్ 70 రోజులు చెల్లుతుంది మరియు ఇది ప్రస్తుతం ఎంచుకున్న టెలికాం సర్కిల్‌లలో మాత్రమే అందుబాటులో ఉంది.

రూ .555 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్

రూ .555 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్

1.5GB హై-స్పీడ్ ఇంటర్నెట్ డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్ సౌకర్యం మరియు రోజుకు 100 ఎస్ఎంఎస్ ప్రయోజనాలతో పాటుగా పైన తెలిపిన 499 రూపాయల విలువైన ఉచిత ఐడియా టివి లేదా వోడాఫోన్ ప్లే చందా మరియు రూ.999 విలువైన ZEE5 చందాను 77 రోజుల చెల్లుబాటు కాలానికి రూ.555 ధర వద్ద పొందవచ్చు. ప్రస్తుతానికి ఈ ప్లాన్ కేవలం ఎంచుకున్న సర్కిల్‌లలో మాత్రమే లభిస్తుంది.

రూ .599 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్

రూ .599 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్

ఈ ప్లాన్‌లో కూడా ఇతర ప్లాన్‌ల మాదిరిగానే అన్ని రకాల సౌకర్యాలు కూడా ఉంటాయి. అవి వరుసగా 1.5GB రోజువారీ ఇంటర్నెట్ డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100 SMS వంటి అన్ని ప్రయిజనాలు 84 రోజుల చెల్లుబాటు కాలానికి లభిస్తుంది. ఇది 84 రోజుల మొత్తం చెల్లుబాటు కాలానికి రోజుకు 3GB డేటాను పొందటానికి వినియోగదారులను అనుమతించే డబుల్ డేటా ఆఫర్ పరిధిలోకి వస్తుంది.

Best Mobiles in India

English summary
Vodafone Idea New Prepaid Plans Full Details are Here

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X