Home
News

Vodafone Idea కస్టమర్లకు గుడ్ న్యూస్!!! 5 డబుల్ డేటా ఆఫర్ ప్లాన్‌లు...

వోడాఫోన్ ఐడియా సంస్థ లాక్ డౌన్ సమయంలో కొన్ని ప్రాంతాలలో ప్రవేశపెట్టిన డబుల్ డేటా ప్లాన్‌లను ఇప్పుడు ఇండియా అంతటా ప్రవేశపెట్టింది. వోడాఫోన్ సంస్థ అందిస్తున్న ఈ డబుల్ డేటా ఆఫర్‌ను భారతదేశం అంతటా తిరిగి ప్రవేశపెడుతున్నట్లు తన వెబ్‌సైట్‌లో తెలిపింది.

వోడాఫోన్ డబుల్ డేటా ఆఫర్‌

వోడాఫోన్ డబుల్ డేటా ఆఫర్‌

ఏప్రిల్‌ నెలలో ఆంధ్రప్రదేశ్, కేరళ వంటి రాష్ట్రాల్లోని కేవలం 14 సర్కిల్‌లకు మాత్రమే ఈ డబుల్ డేటా ఆఫర్‌ను కంపెనీ పరిమితం చేసింది. వోడాఫోన్ ఇప్పుడు పాన్-ఇండియా ప్రాతిపదికన తన డబుల్ డేటా ఆఫర్‌ను ఆంధ్రప్రదేశ్, అస్సాం వంటి సర్కిల్‌లలోను ఐదు ప్లాన్‌లపై డబుల్ డేటాను అందిస్తున్నది. అయితే వోడాఫోన్ తన డబుల్ డేటా ఆఫర్‌ను తమిళనాడు, కేరళతో సహా పలు సర్కిల్‌లలో కేవలం మూడు ప్లాన్‌లకు పరిమితం చేసింది.

వోడాఫోన్ డబుల్ డేటా ఆఫర్ ప్లాన్‌లు

వోడాఫోన్ డబుల్ డేటా ఆఫర్ ప్లాన్‌లు

వోడాఫోన్ సంస్థ రూ.299, రూ.399, రూ.449, రూ.599, రూ.699 ధర వద్ద గల ఐదు ప్లాన్‌లపై కంపెనీ ఇప్పుడు డబుల్ డేటాను అందిస్తోంది. రూ.299 ప్యాక్ వినియోగదారులకు రోజుకు 2GB బేస్ డేటా మరియు 2GB అదనపు డేటాతో పాటు అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100SMS ప్రయోజనాలను 28 రోజుల చెల్లుబాటు కాలానికి అందిస్తుంది. ఇది వొడాఫోన్ ప్లే మరియు Zee5 లకు కూడా ఉచిత యాక్సిస్ ను అందిస్తుంది.

డబుల్ డేటా ఆఫర్

డబుల్ డేటా ఆఫర్

వోడాఫోన్ సంస్థ వినియోగదారులకు డబుల్ డేటా ఆఫర్ కింద రూ.449 ప్లాన్ రూ.699 రెండు ప్లాన్‌లు కూడా ముందు అందిస్తున్న 2GB డేటాకు అదనంగా మరొక 2GB అదనపు హైస్పీడ్ డేటాను అందించింది. అంటే ఈ ప్లాన్‌లపై వినియోగదారులు ఒక రోజుకు 4GB డేటాను అధిక వేగంతో పొందవచ్చు. వీటి యొక్క చెల్లుబాటు రోజులు వరుసగా 56రోజులు మరియు 84 రోజులు .

వోడాఫోన్ రూ.399 ప్లాన్‌

వోడాఫోన్ రూ.399 ప్లాన్‌

వోడాఫోన్ యొక్క రూ.399 ప్లాన్‌ వినియోగదారులకు అపరిమిత కాల్స్ మరియు 100 ఎస్‌ఎంఎస్‌ ప్రయోజనాలను 56 రోజుల చెల్లుబాటు కాలానికి అందించాయి. అదనంగా ఈ ప్లాన్‌ వోడాఫోన్ ప్లే మరియు Zee5 స్ట్రీమింగ్ వంటి సేవలకు ఉచిత యాక్సిస్ ను అందిస్తున్నాయి.అలాగే రూ .599 ప్లాన్ రూ.399 ప్లాన్‌కు సమానమైన ప్రయోజనాలను అందిస్తుంది. అయితే దీని యొక్క చెల్లుబాటు కాలం 84 రోజులు.

వోడాఫోన్ డబుల్ డేటా ఆఫర్‌ను మూడు ప్లాన్‌లకు పరిమితం చేసిన సర్కిల్‌లు

వోడాఫోన్ డబుల్ డేటా ఆఫర్‌ను మూడు ప్లాన్‌లకు పరిమితం చేసిన సర్కిల్‌లు

ఆంధ్రప్రదేశ్, అస్సాం, ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్, కోల్‌కతా, మధ్యప్రదేశ్, ముంబై, ఒడిశా, రాజస్థాన్, యుపి ఈస్ట్, మరియు పశ్చిమ బెంగాల్‌లోని ఐదు ప్లాన్‌లపై వోడాఫోన్ డబుల్ డేటాను అందిస్తుంది. కానీ బీహార్, చెన్నై, గుజరాత్‌తో సహా పలు సర్కిల్‌ల్లో రూ.299 ప్లాన్, రూ.449, రూ.699 వంటి మూడు ప్లాన్‌లకు మాత్రమే కంపెనీ తన డబుల్ డేటా ఆఫర్‌ను పరిమితం చేసింది. అదనంగా వోడాఫోన్ తన డబుల్ డేటా ఆఫర్‌ను హిమాచల్ ప్రదేశ్, హర్యానా, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర & గోవా, నార్త్ ఈస్ట్, పంజాబ్, తమిళనాడు మరియు యుపి వెస్ట్ సర్కిల్‌లలో మూడు ప్లాన్‌లకు పరిమితం చేసింది.

More from GizBot

Best Mobiles in India

English summary
Vodafone Idea Offers Double Data Benefits to Across India
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X