Reliance Jio vs Airtel vs Vodafone: Postpaid ప్లాన్‌లలో పైచేయి ఎవరిదీ?

|

ఇండియాలోని టెలికామ్ ఆపరేటర్లలో చందాదారుల సంఖ్య పరంగా మరియు మార్కెట్ యొక్క రాబడి వాటా పరంగా రిలయన్స్ జియో అందరి కంటే ఒక అడుగు ముందున్నది. సమయాను సందర్బంగా ఈ టెల్కో మిగిలిన టెల్కోస్ అందించే ప్లాన్ ల కంటే కొన్ని ఉత్తమమైన ప్రీపెయిడ్ ప్లాన్ లను అందిస్తోంది.

పోస్ట్‌పెయిడ్ ప్లాన్

అదే సమయంలో రిలయన్స్ జియో యొక్క పోస్ట్‌పెయిడ్ ప్లాన్ ల యొక్క ప్రయోజనాలు మాత్రం తగినంత ఆశాజనకంగా మాత్రం లేవు. ప్రస్తుతం రిలయన్స్ జియో కేవలం ఒక పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ను రూ.199 ధర వద్ద అందిస్తోంది. పోస్ట్‌పెయిడ్ సెక్షన్ కింద టెల్కో నుండి వచ్చిన ఏకైక ఆఫర్ ఇదేనని గమనించాలి. ఈ ఆఫర్ జియో వినియోగదారులను అంతగా ఆకర్షించలేదు. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

రిలయన్స్ జియో యొక్క పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లు

రిలయన్స్ జియో యొక్క పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లు

రిలయన్స్ జియో సంస్థ తన పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లను ప్రారంభించి దాదాపు రెండు సంవత్సరాలు అయినప్పటికీ ఈ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌కు ఎటువంటి అప్ డేట్ లను చేయలేదు. జియో పోస్ట్‌పెయిడ్ ప్లాన్ ఇప్పటికీ రూ.199 బిల్లింగ్ సైకిల్ ధరకే లభిస్తుంది. మీరు ఆఫర్ కోసం సైన్-అప్ చేసినప్పుడు మీకు 25GB హై-స్పీడ్ డేటాతో పాటు అపరిమిత కాలింగ్, రోజుకు 100 SMSల ప్రయోజనాలతో పాటుగా జియో యొక్క అన్ని యాప్ లకు కాంప్లిమెంటరీ యాక్సిస్ కూడా లభిస్తాయి. మీరు ప్లాన్‌తో లభించిన 25GB డేటాను ఉపయోగించిన తర్వాత మీరు వినియోగించే 1GB డేటాకు రూ.20 వసూలు చేస్తారు. పరిమిత ప్రయోజనాలతో జియో నుండి వచ్చిన ఏకైక ప్లాన్ ఇదే కావడం విశేషం.

రిలయన్స్ జియో పోస్ట్‌పెయిడ్ ప్లాన్ Vs ఇతర టెల్కోస్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లు

రిలయన్స్ జియో పోస్ట్‌పెయిడ్ ప్లాన్ Vs ఇతర టెల్కోస్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లు

రిలయన్స్ జియో యొక్క ఒకే ఒక పోస్ట్‌పెయిడ్ ప్లాన్ కేవలం రూ.199 ధరకే లభిస్తోంది. కాకపోతే ఇతర టెల్కోలు తమ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ల కోసం ఎక్కువ మొత్తంలో వసూలు చేస్తున్నాయి. అలాగే అవి వాటి ధరకు తగ్గట్టుగా అధిక ప్రయోజనాలను అందిస్తున్నాయి. వీటిలో అందరి కంటే ముందు వరుసలో ఎయిర్‌టెల్ మరియు వోడాఫోన్ రెండు ఉన్నాయి.

ఎయిర్‌టెల్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లు

ఎయిర్‌టెల్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లు

ఎయిర్‌టెల్ తన పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌తో అనేక ప్రయోజనాలను అందిస్తుంది. వీటిలో ఒక సంవత్సరం విలువైన అమెజాన్ ప్రైమ్‌ ఉచిత చందా, ZEE5, ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ మరియు హ్యాండ్‌సెట్ ప్రొటెక్షన్ మరియు 500GB వరకు డేటా ప్రయోజనం అన్ని కలిపి కేవలం రూ.499 ధర వద్ద అందిస్తోంది. ఛార్జీలు అధికంగా ఉన్నప్పటికీ ప్రజలు జియో కంటే ఈ ప్రణాళికను ఎంచుకుంటున్నారు.

ఎయిర్‌టెల్ పోస్ట్‌పెయిడ్ యాడ్-ఆన్

ఎయిర్‌టెల్ పోస్ట్‌పెయిడ్ యాడ్-ఆన్

ఎయిర్‌టెల్ తన పోస్ట్‌పెయిడ్ వినియోగదారులకు నెలకు 199 రూపాయల చొప్పున యాడ్-ఆన్ కనెక్షన్‌ను జోడించడం ద్వారా ప్యామిలీ కనెక్షన్‌ను సృష్టించడానికి అనుమతించింది. అయితే ఈ యాడ్-ఆన్ కనెక్షన్ యొక్క ధరను ఇప్పుడు రూ.249 కు పెంచారు. క్రొత్త మార్పు ఇప్పటికే అమలులోకి వచ్చింది. ఈ మార్పు గురించి వినియోగదారులకు SMSల రూపంలో తెలియజేయబడుతుంది. మీరు ఎయిర్టెల్ యాడ్-ఆన్ కనెక్షన్ ఉన్నవారు అయితే ఛార్జీలు ఆటోమ్యాటిక్ గా మార్చబడతాయి.

వొడాఫోన్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లు

వొడాఫోన్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లు

ప్రస్తుతం వొడాఫోన్ మూడు రకాల పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లను కలిగి ఉంది. అవి ఒకే యూజర్ కోసం మొత్తం కుటంబం కోసం మరియు 999 రూపాయల ప్రీమియం ప్లాన్‌లు.వొడాఫోన్ కంపెనీకి చెందిన పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లు ఐఫోన్ ఫరెవర్ సబ్‌స్క్రిప్షన్‌తో ఇప్పుడు అందించబడుతున్నాయి. ఈ ఫీచర్ ఆపిల్ ఐఫోన్‌ వినియోగదారులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే వొడాఫోన్ రెడ్ ఫ్యామిలీ ప్లాన్స్ కేవలం రూ.598 నుండి ప్రారంభమవుతాయి. అయితే ఒక యూసర్ కోసం పోస్ట్ పెయిడ్ ప్లాన్లు రూ.399 నుండి ప్రారంభమయి రూ.999 వరకు ఉంటాయి.

వోడాఫోన్ REDX పోస్ట్‌పెయిడ్ ప్లాన్

వోడాఫోన్ REDX పోస్ట్‌పెయిడ్ ప్లాన్

మరోవైపు వోడాఫోన్ తన REDX ప్లాన్‌తో అనేక ప్రయోజనాలను అందిస్తోంది. REDX ప్రణాళిక యొక్క ప్రయోజనాల విషయానికి వస్తే ప్రయాణ ప్రయోజనాలు, నెట్‌ఫ్లిక్స్ ఉచిత చందా మరియు అపరిమిత 4G డేటా ప్రయోజనాలు ఉన్నాయి. దీనిని చూస్తే ప్రస్తుతం ఎయిర్‌టెల్ మరియు వొడాఫోన్‌తో సభ్యత్వం పొందిన వినియోగదారులు తమ విధేయతను తగ్గించి కనీస ప్రయోజనాలను కలిగి ఉన్న జియో యొక్క పోస్ట్‌పెయిడ్ ప్లాన్ కోసం సైన్-అప్ చేయడానికి అవకాశం లేదు.

Best Mobiles in India

English summary
Reliance Jio Vs Airtel Vs Vodafone: In Postpaid Plans Which One is Better

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X