Vodafone RedX పోస్ట్‌పెయిడ్‌ యూజర్ ప్రియులకు పిడుగు లాంటి వార్త...

|

ఇండియాలోని టెలికం పరిశ్రమలో ఒకటైన వొడాఫోన్ తన వినియోగదారులకు ఇక బ్యాడ్ న్యూస్ ను ప్రకటించింది. పోస్ట్‌పెయిడ్‌ విభాగంలో ప్రత్యేకమైన ప్లాన్లలో ఒకటైన ప్రీమియం RedX పోస్ట్‌పెయిడ్‌ ప్లాన్ యొక్క ధరలను ఇప్పుడు చందాదారులకు రూ.1099కు పెంచింది.

ప్రీమియం ప్లాన్

ఇంతకు ముందు సంస్థ ఈ ప్రీమియం ప్లాన్ కోసం వినియోగదారుల వద్ద నుండి నెలకు రూ.999 వసూలు చేసింది. ఈ ప్లాన్ ద్వారా వోడాఫోన్ సంస్థ నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, Zee5 మరియు వొడాఫోన్ ప్లే వంటి వినోద యాప్ ల వార్షిక చందాను అదనపు ప్రయోజనాల ప్యాకేజీని అందిస్తుంది. ఏదేమైనా వారంలో 300 ప్రత్యేక నంబర్లకు కాల్స్ చేస్తున్న చందాదారులను వాణిజ్య వినియోగదారులుగా వర్గీకరిస్తారని కంపెనీ ఇప్పుడు హైలైట్ చేసింది. అదనంగా 150GB కంటే ఎక్కువ డేటా మరియు 50 నిమిషాల కన్నా తక్కువ వాయిస్ కాల్స్ వాడుతున్న వారిని వాణిజ్య వినియోగదారులుగా వర్గీకరిస్తున్నట్లు వోడాఫోన్ తెలిపింది.

వోడాఫోన్ RedX ప్లాన్‌ను సవరించింది

వోడాఫోన్ RedX ప్లాన్‌ను సవరించింది

వోడాఫోన్ యొక్క RedX ప్లాన్ వినియోగదారులకు నెట్‌ఫ్లిక్స్, Zee5 మరియు అమెజాన్ ప్రైమ్ వీడియోల యాప్ లకు ఉచిత యాక్సిస్ ను అందించడంతో పాటు అపరిమిత డేటా మరియు అపరిమిత కాలింగ్ సదుపాయాన్ని కూడా వినియోగదారులకు అందిస్తుంది. వోడాఫోన్ RedX యూజర్లు 12 నెలలకు అదనపు ఖర్చు లేకుండా రూ .2999 విలువైన ఏడు రోజుల ఐరోమ్ ప్యాక్‌ను కూడా ప్రారంభించవచ్చు. వోడాఫోన్ సంవత్సరానికి నాలుగు విమానాశ్రయ లాంజ్ లకు గరిష్టంగా ఒక అంతర్జాతీయ లాంజ్ తో భారతదేశం వెలుపల లేదా లోపల ప్రవేశించటానికి వీలు కల్పిస్తుంది.

RedX ప్లాన్ ఇతర ప్రయోజనాలు

RedX ప్లాన్ ఇతర ప్రయోజనాలు

వోడాఫోన్ RedX ప్లాన్ చందాదారుల కోసం కంపెనీ 14 దేశాలకు ప్రత్యేక ISD రేట్లను US మరియు కెనడా దేశాలకు నిమిషానికి రూ.0.50 చొప్పున వసూలు చేయగా, UK కాల్స్ కొరకు నిమిషానికి రూ.3 చొప్పున వసూలు చేస్తాయి. అదనంగా వొడాఫోన్ టికెట్స్ ద్వారా మ్యూజియంలు మరియు "ప్రపంచవ్యాప్తంగా ఆకర్షనీయమైన స్థలాల" కు బుక్ చేసిన టిక్కెట్లపై 10% తగ్గింపును ఇస్తుంది. అలాగే హోటల్.కామ్ ద్వారా హోటల్ బుకింగ్‌లకు 10% ఫ్లాట్ ఇవ్వబడుతుంది. మొదటి ఆరు నెలల్లో RedX ప్లాన్ నుండి నిష్క్రమించడానికి ఎంచుకున్న చందాదారుడిపై కంపెనీ తన నిష్క్రమణ రుసుము కింద రూ.3000 లను నిలుపుకుంటుంది.

వోడాఫోన్ RedX ‌పై వాణిజ్య వినియోగ విధానం

వోడాఫోన్ RedX ‌పై వాణిజ్య వినియోగ విధానం

వారంలో 15 నిమిషాల కన్నా తక్కువ వ్యవధిలో వచ్చే ఇన్కమింగ్ కాల్ వ్యవధి కలిగిన చందాదారులను వాణిజ్య వినియోగదారులుగా పిలుస్తామని వోడాఫోన్ తెలిపింది. అదనంగా రోజుకు 300 నిమిషాలకు పైగా సంచిత అవుట్గోయింగ్ కాల్ వ్యవధి ఉన్న చందాదారులను కూడా వాణిజ్య వినియోగదారులుగా వర్గీకరిస్తామని కంపెనీ తెలిపింది.

వోడాఫోన్ కమర్షియల్ డేటా యూజర్

వోడాఫోన్ కమర్షియల్ డేటా యూజర్

వోడాఫోన్ ఐడియా కమర్షియల్ / నాన్-రిటైల్ డేటా యూజర్ చందాదారులను గుర్తించే హక్కును ప్రస్తుతం కలిగి ఉంది. అటువంటి చందాదారుల యొక్క ప్రస్తుత అపరిమిత డేటా ప్లాన్‌ను ఉపసంహరించుకుంటుంది మరియు ముందస్తు నోటీసు ఇవ్వకుండా మార్కెట్లో అందుబాటులో ఉన్న పరిమిత డేటా రిటైల్ ప్లాన్‌ను కేటాయిస్తుంది అని కంపెనీ తెలిపింది. ఏదైనా ప్లాన్ ఎగ్జిట్ నిబంధన అటువంటి చందాదారులందరికీ వర్తిస్తుంది.

రోజుకు 300 నిమిషాలు, ఇది భారతదేశంలోని టెలికాం సర్కిళ్ళలో వ్యక్తిగత చందాదారులు ఉపయోగించే సగటు ..." data-gal-src="telugu.gizbot.com/img/600x100/img/2020/05/vodafoneredxpostpaidplan1-1589200352.jpg">
టెలికాం సర్కిళ్

టెలికాం సర్కిళ్

"అవుట్గోయింగ్ కాల్స్ యొక్క సంచిత వ్యవధి> రోజుకు 300 నిమిషాలు, ఇది భారతదేశంలోని టెలికాం సర్కిళ్ళలో వ్యక్తిగత చందాదారులు ఉపయోగించే సగటు రోజువారీ చర్చా సమయానికి మించి చాలా ఎక్కువ, ఇది చందాదారులు వినియోగించే జాతీయ సగటు రోజువారీ చర్చా సమయం కంటే దాదాపు 60 రెట్లు ఎక్కువ" అని వోడాఫోన్ దాని సవరించిన రెడ్‌ఎక్స్ నిబంధనలు మరియు షరతుల విధానంలో తెలిపింది.

Best Mobiles in India

English summary
Vodafone RedX Postpaid Plan Price Hiked

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X