Airtel, Vodafone, Jio యూజర్లకు షాకింగ్ న్యూస్... ఉచిత ఆఫర్లకు బ్రేక్...

|

కరోనా వైరస్ కారణంగా ప్రపంచంలోని అన్ని దేశాలు లాక్ డౌన్ ను ప్రకటించాయి. ఇండియా కూడా మార్చి 14 నుండి దేశం మొత్తాన్ని లాక్ డౌన్ గా ప్రకటించింది. లాక్డౌన్ సమయంలో దేశంలోని అన్ని టెల్కో సంస్థలు తమ వినియోగదారుల కోసం అద్భుతమైన ఉచిత ఆఫర్లను ప్రకటించాయి.

 

రీఛార్జ్

వీటిలో రీఛార్జ్ సమయం దాటిన తరువాత కూడా ఇన్ కమింగ్ కాల్స్ పొందడానికి అన్ని సంస్థలు తమ వినియోగదారులకు అనుమతిని ఇచ్చాయి. అయితే ఇప్పుడు దేశంలోని అన్ని ప్రాంతాలను జోన్ల వారీగా విడగొట్టి గ్రీన్ మరియు ఆరెంజ్ జోన్ల చాలా ప్రాంతాలను కఠినమైన లాక్డౌన్ నిబంధనల నుండి సడలించబడ్డాయి. దీని కారణంగా ఈ జోన్లలో చిన్న చిన్న దుకాణాలు మళ్లీ ఓపెన్ అయ్యాయి. అందువల్ల ప్రజలు తమ తాము వాడుతున్న మొబైల్ సిమ్ లను రీఛార్జ్ చేసుకోవడానికి అవకాశం ఉన్నందు వలన టెలికాం సంస్థల యొక్క చెల్లుబాటును ఇకపై విస్తరించబోవడం లేదని టెల్కోలు నిర్ణయించాయి.

ప్రీపెయిడ్ ప్లాన్ రీఛార్జ్

ప్రీపెయిడ్ ప్లాన్ రీఛార్జ్

ప్రజలు ఇప్పుడు బయటకు వెళ్లి తమ స్థానిక స్టోర్ నుండి ప్రీపెయిడ్ ప్లాన్లలో దేనినైనా రీఛార్జ్ చేయవచ్చు. సాధారణ సేవా కేంద్రాలను యాక్టివేట్ చేసిన తరువాత గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల అవసరాలను తీర్చగలమని సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (COAI) డైరెక్టర్ జనరల్ రాజన్ మాథ్యూస్ పత్రిక సమావేశంలో తెలిపారు. COAI వోడాఫోన్, భారతి ఎయిర్‌టెల్ మరియు రిలయన్స్ జియో వంటి టెల్కోలను సూచిస్తుంది.

 

 

 

Amazon Prime సభ్యులకు మరొక ఉచిత ఆఫర్...Amazon Prime సభ్యులకు మరొక ఉచిత ఆఫర్...

ప్రజలు రీఛార్జ్ చేసుకోవడానికి అవకాశాలు ఎన్నో
 

ప్రజలు రీఛార్జ్ చేసుకోవడానికి అవకాశాలు ఎన్నో

సాధారణ సేవా కేంద్రాల క్రియాశీలతతో పాటు చిన్న కిరానా దుకాణాలు, ATMలు మరియు ఇతర విక్రేతల ద్వారా కూడా ప్రజలు ఇప్పుడు రీఛార్జ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ప్రజలు తమ సిమ్ కార్డులను రీఛార్జ్ చేసుకోవటానికి ఇవన్నీ సరిపోతాయని టెలికాం ఆపరేటర్లు భావిస్తున్నారు. అందువల్ల అన్ని టెల్కో సంస్థలు ఇకపై తమ ప్లాన్ లపై సుంకం చెల్లుబాటును పొడిగించకూడదని నిర్ణయించారు. వోడాఫోన్ ఐడియా ఇటీవల యుపి-వెస్ట్‌లో నివసిస్తున్న ప్రజలకు ఆన్‌లైన్‌లో రీఛార్జ్ చేయలేకపోతే దానికి ప్రత్యాన్మాయంగా కిరానా మరియు మెడికల్ స్టోర్స్ వంటి 6,500 కి పైగా వా‌లెట్ల సహాయంతో వారి ప్రీపెయిడ్ ప్రణాళికలను రీఛార్జ్ చేసుకోవాలని సూచించింది.

టెలికాం పరిశ్రమలు - ప్రభుత్వం

టెలికాం పరిశ్రమలు - ప్రభుత్వం

భారత ప్రభుత్వం లాక్డౌన్ అమలు చేసిన ఒక వారంలోనే టెల్కోస్ తమ ప్రీపెయిడ్ కస్టమర్ల ప్లాన్ యొక్క చెల్లుబాటును ఏప్రిల్ 14 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించాయి. తరువాత దానిని మే 3 వరకు కూడా పొడిగించారు. వొడాఫోన్ ఐడియా మరియు భారతి ఎయిర్టెల్ వంటి టెల్కోలు తమ ప్రీపెయిడ్ కస్టమర్ల అకౌంటులోకి రూ.10 అదనపు టాక్‌టైమ్ ను ఉచితంగా జమచేశాయి. అదే సమయంలో రిలయన్స్ జియో తన చందాదారులకు 100 నిమిషాల టాక్‌టైమ్ ను ఉచితంగా ఇచ్చింది. ప్రస్తుతానికి అన్ని రీఛార్జ్ అవుట్‌లెట్‌లు తమ యొక్క సొంత ప్రదేశాలలో చురుకుగా ఉంచడానికి టెల్కోలు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాయి. తద్వారా ప్రజలు తమ సిమ్ కార్డులను రీఛార్జ్ చేయడంలో ఎటువంటి ఇబ్బందులను ఎదుర్కోరు.

Best Mobiles in India

English summary
Airtel and Vodafone Idea Stops free Additional Benefits

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X