150GB ఎక్స్‌ట్రా డేటాతో వొడాఫోన్ రూ.399 పోస్ట్‌పెయిడ్ ప్లాన్

|

టెలికాం పరిశ్రమలో డేటా టారిఫ్ యుద్ధం మొదలైనప్పటి నుంచి టెలికాం కంపెనీలు కొత్త ఆదాయ వనరులను కనుగొనే పనిలో ఉన్నాయి. ఇది వారి పోస్ట్‌పెయిడ్ పోర్ట్‌ఫోలియోలను బాగా అభివృద్ధి చేయడానికి దారితీసింది. టెలికాం కంపెనీల ఆదాయాలు క్షీణించిన తరువాత మెరుగైన సేవలను అందించడానికి అన్ని కంపెనీలు చాలా రకాల పోస్ట్‌పెయిడ్ ప్లాన్లను ప్రవేశపెట్టారు.

పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌
 

అయితే ఈ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ల సహాయంతో అధిక చెల్లింపు వినియోగదారులను మాత్రమే నిలిపివేసే విధంగా ఈ ప్రణాళికల బేస్ లైన్ కూడా పెంచబడింది. వొడాఫోన్ ఐడియా మరియు భారతి ఎయిర్‌టెల్ విషయంలో కూడా ఇదే విదానాన్ని అనుసరిస్తున్నాయి. అయితే భారతి ఎయిర్‌టెల్ మరియు వొడాఫోన్ RED మరియు ఐడియా పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ల మధ్య కొన్ని తేడాలు ఉన్నాయి. ఇప్పుడు అవి కొన్ని చిన్న మార్పులో వొడాఫోన్ RED పోర్ట్‌ఫోలియో కింద వొడాఫోన్ ఎంట్రీ లెవల్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ కొత్త వినియోగదారులకు అదనపు ప్రయోజనంతో వస్తుంది. వాటి వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 వోడాఫోన్ రూ.399 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ 150 జీబీ అదనపు డేటా బెనిఫిట్

వోడాఫోన్ రూ.399 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ 150 జీబీ అదనపు డేటా బెనిఫిట్

వొడాఫోన్ ఎంట్రీ లెవల్ ప్లాన్ రూ .399 పోస్ట్‌పెయిడ్ ప్లాన్. ఇది ఇతర ప్రయోజనాలతో పాటు నెలకు 40 జిబి డేటాను అందిస్తుంది. ఇప్పుడు ఈ కొత్త ఆఫర్ కింద కొత్త కస్టమర్లకు టెలికాం ఆపరేటర్ ఆరు నెలల కాలానికి చెల్లుబాటు అయ్యే 150 జిబి అదనపు డేటాను అందిస్తోంది. ఇప్పుడు వోడాఫోన్ రూపొందించిన రూ .399 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ నెలకు 40 జీబీ డేటాతో పాటు 150GB అదనపు డేటాతో కలిపి మొత్తంగా 200 జీబీ డేటా రోల్‌ఓవర్ పరిమితితో రావడం గమనార్హం. ఇది మాత్రమే కాకుండా ఈ ప్లాన్ తో అనేక ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

పోస్ట్‌పెయిడ్
 

వోడాఫోన్ రూ.399 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ యొక్క అదనపు ప్రయోజనాలు వోడాఫోన్ ప్లే, మొబైల్ షీల్డ్ మరియు ZEE5 సుబ్స్క్రిప్షన్ ను ఉచితంగా అందిస్తుంది. ఈ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ వల్ల వినియోగదారులకు రూ.2,497 విలువైన ప్రయోజనాలు లభిస్తాయని వోడాఫోన్ పేర్కొంది. ఇప్పుడు ఈ ప్రయోజనాల జాబితాలో కొత్త పోస్ట్‌పెయిడ్ కస్టమర్లు 6 నెలల కాలానికి 150GB డేటా యొక్క మరొక ప్రయోజనాన్ని పొందగలరు. ఇది 200GB డేటా రోల్‌ఓవర్ పరిమితికి అదనంగా ఉంది. అంటే కొత్త వోడాఫోన్ పోస్ట్‌పెయిడ్ చందాదారులు డేటా అయిపోయే అవకాశం చాలా తక్కువగా ఉంటుందని హామీ ఇవ్వవచ్చు.

వివో గ్రాండ్ దీపావళి సేల్స్.... వీటిపై ఆఫర్లే ఆఫర్లు

ఆడ్-ఆన్ కనెక్షన్స్

ఆడ్-ఆన్ కనెక్షన్స్

వోడాఫోన్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లు కొన్ని ముఖ్యమైన ఆడ్-ఆన్ కనెక్షన్స్ తో వస్తాయి. ఇది కొన్ని నెలల క్రితం వరకు వోడాఫోన్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లలో అందుబాటులో లేదు. ఇంతకుముందు భారతి ఎయిర్‌టెల్ తన పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లపై యాడ్-ఆన్ కనెక్షన్‌ను అందించే ఏకైక టెలికం ఆపరేటర్. ఏదేమైనా వోడాఫోన్ ఇప్పుడు ఈ ఫీచర్ తో వచ్చే పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లను కూడా అందిస్తున్నది. ఈ ఫీచర్స్ తో 2 కనెక్షన్లను అందిస్తున్న మొదటి ప్లాన్ వోడాఫోన్ యొక్క రూ.598 పోస్ట్‌పెయిడ్ ప్లాన్. ఇది 200 జీబీ డేటా రోల్‌ఓవర్ పరిమితితో పాటు నెలకు 80 జీబీ డేటాను అందిస్తుంది. ఈ ప్లాన్ యొక్క చందాదారులు అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ , వొడాఫోన్ ప్లే సబ్స్క్రిప్షన్ , ZEE5 సబ్స్క్రిప్షన్ మరియు మొబైల్ షీల్డ్ వంటి ప్రయోజనాన్ని కూడా పొందుతారు.

అదనపు ప్రయోజనాల అరహత ఎవరికి?

అదనపు ప్రయోజనాల అరహత ఎవరికి?

ఈ అదనపు ప్రయోజనాలు వోడాఫోన్ యొక్క రూ .749 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ కూడా అందిస్తుంది. ఇది చందాదారులకు 3 కనెక్షన్‌లను అందిస్తుంది. అంటే ఇది ముగ్గురు ఉన్న కుటుంబానికి తగిన ప్లాన్. ఈ ప్లాన్ ద్వారా వినియోగదారులు 120GB డేటాను పొందవచ్చు. అంటే మొదటి వినియోగదారుడు 60GB డేటాను, అలాగే రెండవ వినియోగదారుడు నెలకు 30GB డేటాను పొందుతారు. వోడాఫోన్ ప్లే సబ్స్క్రిప్షన్ , అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ వంటి మిగిలిన ప్రయోజనాలు కూడా పొందవచ్చు.

వొడాఫోన్

చివరగా వొడాఫోన్ రూపొందించిన 999 రూపాయల ప్లాన్ కూడా పైన పేర్కొన్న అన్ని ప్రయోజనాలను అందిస్తుంది. ఇది చందాదారులకు మొత్తం 5 కనెక్షన్లను అందిస్తుంది. ఈ ప్లాన్ కింద మొత్తం డేటా ఆఫర్ 200GB మిగిలిన అన్ని అదనపు ప్రయోజనాలను అలాగే కలిగి ఉంటుంది. పైన పేర్కొన్న150GB అదనపు డేటా వోడాఫోన్ యొక్క రూ.399 ఎంట్రీ లెవల్ ప్లాన్‌కు మాత్రమే వర్తిస్తుంది. అంతేకాకుండా ఇందులో కూడా వోడాఫోన్ పోస్ట్‌పెయిడ్ యొక్క కొత్త వినియోగదారులకు మాత్రమే వర్తిస్తుందని గమనించడం చాలా ముఖ్యం. అలాగే రూ. 399 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ సింగిల్ కనెక్షన్ ఆప్షన్‌తో వస్తుంది. అంటే 150 జిబి డేటా ఒక వినియోగదారుకు మాత్రమే ఉంటుంది. ఎందుకంటే నిర్దిష్ట వోడాఫోన్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లో యాడ్-ఆన్ కనెక్షన్ ఎంపిక లేదు.

Most Read Articles
Best Mobiles in India

English summary
Vodafone Rs.399 Postpaid Plan Now Gets 150GB Extra Data

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X