ఫ్లిప్‌కార్ట్‌తో జతకట్టనున్న వాల్‌మార్ట్!, అమెజాన్‌కి షాకిచ్చేందుకేనా..?

Written By:

దేశీయ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌తో ప్రపంచ రీటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ త్వరలో చేతులు కలపనున్నట్లు వార్తలు వస్తున్నాయి. వీరిద్దరి కలయికపై త్వరలో జరగనున్న మీటింగ్ లో ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. భాగస్వామ్యంపై వీటి మధ్య చర్చలు నడుస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.

మరో సంచలనం..ఏడాదిపాటు అన్‌లిమిటెడ్ ఉచిత కాల్స్‌

ఫ్లిప్‌కార్ట్‌తో జతకట్టనున్న వాల్‌మార్ట్!, అమెజాన్‌కి షాకిచ్చేందుకేనా.

ఫ్లిప్‌కార్ట్‌తో చేతులు కలపడం ద్వారా బూమ్ మీదున్న దేశీయ ఈ కామర్స్ రంగంలోకి వాల్‌మార్ట్ ప్రవేశించడంతోపాటు, అమెరికాలో వలే ఇక్కడ కూడా అమెజాన్‌కు గట్టిపోటీ ఇవ్వవచ్చని విశ్లేషకుల అభిప్రాయపడుతున్నారు.ఫ్లిప్‌కార్ట్‌లో బిలియన్ డాలర్ల పెట్టుబడి ద్వారా స్వల్ప వాటా తీసుకునేందుకు వాల్‌మార్ట్ ఆసక్తిగా ఉందని, భాగస్వామ్యంపై ఇరు సంస్థల మధ్య చర్చలు కొనసాగుతున్నట్టు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు తెలిపాయి.

4జీ ఫోన్లతో చైనాను హడలెత్తిస్తున్న ఇండియా కంపెనీలు

ఫ్లిప్‌కార్ట్‌తో జతకట్టనున్న వాల్‌మార్ట్!, అమెజాన్‌కి షాకిచ్చేందుకేనా.

దీనిపై పీటీఐ వార్తా సంస్థ వాల్‌మార్ట్, ఫ్లిప్‌కార్ట్‌లను సంప్రదించగా... వదంతులు, ఊహాగానాలపై స్పందించడం తమ విధానం కాదని అవి తిరస్కరించాయి. ముందు ముందు ఏం జరుగుతుందో చూడాలి.

అన్ని కంపెనీల అన్‌లిమిటెడ్ డేటా ఆఫర్లు ఇక్కడే

ఫ్లిప్‌కార్ట్‌తో జతకట్టనున్న వాల్‌మార్ట్!, అమెజాన్‌కి షాకిచ్చేందుకేనా.

దీపావళి దసరా ఉత్పవాలకు ఈ కామర్స్ దిగ్గజాలు అక్టోబర్ తొలివారాన్ని ముహర్తంగా పెట్టుకున్నాయి. ఈ కంపెనీ ఏ పేరుతో వస్తుందో మీరే చూడండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

స్నాప్‌డీల్ ఈజీ ఎక్స్చేంజ్

స్నాప్‌డీల్ అక్టోబర్ 2-6 మధ్య ఫెస్టివల్ సేల్‌ను నిర్వహిస్తోంది. ఆ ఫెస్టివల్ సేల్ లో భాగంగా పాతవాటితో కొత్త వాటిని తీసుకునే సదుపాయాన్ని కల్పిస్తోంది. ఎలక్ట్రానిక్ పరిరకాలు, మొబైల్ ఫోన్లపై ఈఎంఐ సదుపాయాన్ని అందిస్తున్నట్లు ప్రకటించింది.

ఫ్లిప్‌కార్ట్ ‘బిగ్ బిలియన్ డే

దేశీ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ‘బిగ్ బిలియన్ డే (బీబీడీ)' విక్రయాలు అక్టోబర్ 2- 6 మధ్య సాగనున్నాయి. చాలా వరకు స్మార్ట్‌ఫోన్లు, టెలివిజన్లు, ఇతర గృహోపకరాణలను నో కాస్ట్ ఈఎంఐ కింద ఆఫర్ చేయనుంది. గతంలో పాపులర్ అయిన రూ.1 ఆఫర్, ఎక్స్చేంజ్ ఆఫర్లను సైతం ప్రకటించే అవకాశం ఉంది.

అమెజాన్ గ్రేట్ ఇండియా ఫెస్టివల్ అక్టోబర్

1 - 5 మధ్య ‘ద గ్రేట్ ఇండియా ఫెస్టివల్' పేరిట అమెజాన్ అమ్మకాలు జరపనుంది. అదే రోజు... ఒకరోజు... రెండ్రోజుల డెలివరీ ద్వారా కస్టమర్లను ఆకట్టుకోవాలని సంస్థ చూస్తోంది. పండుగ రోజుల్లో భారీ ఆర్డర్ల వల్ల డెలివరీ లేటయ్యే పరిస్థితులుండగా... అమెజాన్ ఇదే అంశాన్ని మార్కెటింగ్‌కు ఉపయోగిస్తోంది.

డిస్కౌంట్లు కష్టమే

పోటాపోటీగా అమ్మకాలు జరపనున్నప్పటికీ ఏ సంస్థా భారీ డిస్కౌంట్ల జోలికెళ్లే అవకాశాల్లేవన్నది నిపుణుల అంచనా. ఈ కామర్స్ సంస్థలు డిస్కౌంట్ భారాన్ని సాధ్యమైనంత వరకు విక్రయదారులకే వదిలేస్తాయని, తమ సొంత డిస్కౌంట్లను ఆఫర్ చేసే పరిస్థితిలో అవి లేవని ‘రెడ్‌సీర్' పేర్కొంది.

ప్రచారం ఖర్చు

అమెజాన్ ఇండియా రూ.125 కోట్లు కేటాయించగా , స్నాప్‌డీల్ రూ.200 కోట్లు కేటాయించింది. మార్కెట్ లీడర్‌గా ఉన్న ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డే ప్రచార ప్రకటనల కోసం రూ.30 కోట్లు వెచ్చించనున్నట్లు తెలుస్తోంది.

పేటీఎం, షాప్‌క్లూస్ వంటివి

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్ ఇప్పటికే తేదీలను ఖరారు చేయగా... పేటీఎం, షాప్‌క్లూస్ వంటివి ఇంకా ప్రకటించలేదు.మరి ముందు ప్రకటిస్తాయేమో చూడాలి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Walmart, Flipkart may gang up on Amazon read more telugu gizbot
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting