వాట్సప్‌ నుంచి వీడియో కాల్ రెడీ !

By Hazarath
|

ఇకపై వాట్సప్ లో కూడా వీడియో కాలింగ్ సౌకర్యం కల్పించనున్నట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందిన వాట్సప్ లో ఇప్పటివరకు కాలింగ్ , మేసేజ్ ఆప్సన్స్ మాత్రమే ఉన్నాయి. అయితే స్కైప్ ,హ్యంగవుట్స్ లాగా వీడియో కాలింగ్ సౌకర్యం లేకపోవడంతో దీనికి లభించాల్సినంత ఆదరణ లభించడం లేదని నిపుణులు అభిప్రాయపడేవారు.

Read more: ఆపిల్‌ కంపెనీలో ఉద్యోగం కావాలంటే...

whatsapp

ఆ లోటును భర్తీ చేస్తూ వాట్సప్ లో వీడియో కాలింగ్ సౌకర్యం త్వరలోనే అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం. అయితే ఇది ఇప్పుడు టెస్టింగ్ దశలో ఉందని,త్వరలో విడుదల చేయనున్న ఐవోఎస్ వెర్షన్ లో ఈ సౌకర్యం అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని వార్తలు వెలువడుతున్నాయి.

Read more: 25 ఏళ్ల ఇంటర్నెట్‌కు ఎన్నో రంగులు..

whatsapp

వీడియో కాల్ మాట్లాడుతూనే ఫోటోలు తీసుకోవచ్చని తెలుస్తోంది. ప్రస్తుతానికి జర్మనీలో దీనికి సంబంధించిన టెస్టింగ్ ప్రక్రియ నడుస్తోందని జర్మన్ వెబ్ సైట్ తెలిపింది. దీనికి సంబంధించిన ఫోటోలను కూడా ఆ వెబ్ సైట్ విడుదల చేసింది. ఈ సందర్భంగా వాట్సప్ లోని ఫీచర్స్ చూద్దాం

Read more : ఫేస్‌బుక్ దెబ్బకు ఆపిల్ గల్లంతు

1. అన్ రీడ్ మార్క్

1. అన్ రీడ్ మార్క్

వాట్సప్ కొత్తగా ఈ అన్ రీడ్ మార్క్ ను ప్రవేశపెట్టింది. మీకు ఇతరులు పంపిన మెసేజ్ చూడకపోయినా చూసినట్లు పంపినవాళ్లకు తెలుస్తోంది. దీంతో మీరు మెసేజ్ ఇంకా చూడకపోయినా పంపిన వాళ్లు చూసారని అనుకుంటారు. ఇప్పటికే ఉన్న మార్క్ మెసేజ్ కు ఇది పూర్తిగా భిన్నమయినది.

2. కష్టమ్ నోటిఫికేషన్స్

2. కష్టమ్ నోటిఫికేషన్స్

వాట్సప్ కొత్తగా కష్టమ్ నోటిఫికేషన్ ను తీసుకువచ్చింది. ఇప్పుడు వచ్చిన ఈ ఫీచర్ సింగిల్ కాంటాక్ట్స్ కు మాత్రమే వర్తిస్తుంది.ఉదాహరణకు నీ ఫోన్ లో ఉన్న కాంటాక్ట్ నంబర్ కు ఏదైనా రింగ్ టోన్ పెట్టుకోవాలనుకుంటే సాంగ్ ను సెలక్ట్ చేసుకుని పెట్టుకోవచ్చు. సెలక్ట్ చేసుకున్న పర్సన్ నుంచి కాల్ లేదా మేసేజ్ రాగానే ఆ రింగ్ టోన్ నీకు వినిపిస్తుంది.

3. కాంటాక్ట్స్ మ్యూట్

3. కాంటాక్ట్స్ మ్యూట్

ఇప్పుడున్న మ్యూట్ ఆప్సన్ ఓన్లీ గ్రూప్ కన్వర్షన్ కు మాత్రమే ఉపయోగపడుతోంది. అయితే కొత్తగా వచ్చిన ఫీచర్ తో సింగిల్ కాంటాక్ట్ ను కూడా మ్యూట్ చేసుకోవచ్చు. ఏ కాంటాక్ట్ నైనా మ్యూట్ లో పెట్టుకోవాలనుకుంటే ఆ కాంటాక్ట్ సెలక్ట్ చేసుకుని మెనూ బార్ లో కెళ్లి మ్యూట్ బటన్ సెలక్ట్ చేసుకుంటే చాలు. ఇందులో నీకు మ్యూట్ టైం కూడా కనిపిస్తుంది.

4. లోడాటా కన్జమ్‌ప్షన్

4. లోడాటా కన్జమ్‌ప్షన్

వాట్సప్ కాల్స్ వాట్సప్ లో కొత్తగా వచ్చిన ఈ ఫీచర్ తో మీకు వాట్సప్ కాల్ ఎక్కువైతే డాటా ను రెడ్యూజ్ చేసుకోమని అడుగుతుంది. ఛాట్, కాల్స్ కు సంబంధించిన మెనూ సెట్టింగ్ లోకి వెళితే అందులో లో లో డాటా యూజేజ్ అని కింద ఉంటుంది. దానిని క్లిక్ చేస్తే చాలు మీ డాటా సేవ్ గురించి అడుగుతుంది.

5.గూగుల్ డ్రైవ్ కాంబినేషన్

5.గూగుల్ డ్రైవ్ కాంబినేషన్

ఈ పీచర్ నిజం కాదని చాలా రోజుల నుంచి రూమర్స్ కూడా వస్తున్నాయి. అయితే కొత్తగా వాట్సప్ తెస్తున్న ఈ ఫీచర్ అవన్నీ అబద్దాలేనని తేలిపోయాయి. నీవు చాట్ చేసిన తరువాత దాన్ని గూగుల్ అకౌంట్ లో భద్రపరుచుకోవచ్చు. ఇది నీవు చెక్ చేసుకోవాలనుకుంటే అకౌంట్ ఆప్సన్ లోకి వెళ్లి సెట్టింగ్ లో నెట్ వర్క్ యూజేజ్ మెనూ డాటా consumption గురించి వివరాలు అడుగుతుంది. అది ఫూర్తి కాగానే నీ డాటా మొత్తం గూగుల్ డ్రైవ్ లో సేవ్ అయిపోతుంది. ఇందులో నీ మేసేజ్ లు,ఫోటోలు,వీడియోస్,వాయిస్ రికార్డ్ చేసుకోవచ్చు.

ప్రస్తుతం వాట్సప్‌ యూజర్లు 90 కోట్ల మంది పైనే

ప్రస్తుతం వాట్సప్‌ యూజర్లు 90 కోట్ల మంది పైనే

ప్రస్తుతం వాట్సప్‌కు 90 కోట్ల మంది పైగానే నెలవారీ యాక్టివ్‌ యూజర్లున్నారని వాట్సప్‌ సహ వ్యవస్థాపకుడు జాన్‌ కౌమ్‌ ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ ద్వారా వెల్లడించారు. ఈ మైలురాయిని చేరుకున్నందుకు జాన్‌ను ఫేస్‌బుక్‌ సిఇఒ మార్క్‌ జుకర్‌ బర్గ్‌ అభినందించారు కూడా.

గూగుల్ తో పోటీ పడి మరీ అధిక ధరకు

గూగుల్ తో పోటీ పడి మరీ అధిక ధరకు

వాట్సప్‌ను సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్‌ ఫేస్‌బుక్‌ గత ఫిబ్రవరిలో కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. గూగుల్ తో పోటీ పడి మరీ అధిక ధరకు ఫేస్ బుక్ వాట్సప్ ను సొంతం చేసుకుంది.

1,900 కోట్ల డాలర్లకు డీల్‌

1,900 కోట్ల డాలర్లకు డీల్‌

1,900 కోట్ల డాలర్లకు ఈ డీల్‌ కుదిరింది. ఇంత భారీ మొత్తంలో వాట్సప్‌ కోసం చెల్లించడం అప్పట్లో సంచలనం కూడా రేపింది.

భారతదేశంలోనే దాదాపు 10 కోట్లు

భారతదేశంలోనే దాదాపు 10 కోట్లు

ప్రపంచం మొత్తం మీద 90 కోట్ల మంది వినియోగదారులు వాట్సప్ ను వినియోగిస్తుంటే అందులో మన భారతదేశంలోనే దాదాపు 10 కోట్లు ఉన్నారని సర్వేలు చెబుతున్నాయి.

Best Mobiles in India

English summary
Here Write WhatsApp video calling feature, new design leaked

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X