షియోమి నుండి కొత్త Mi టివి 5 సిరీస్ స్మార్ట్ టీవీ

|

షియోమి నవంబర్ 5 న చైనాలో జరుగబోయే ఇక కార్యక్రమం ద్వారా వివిధ విభాగాలలో ఐదుకి పైగా తమ ఉత్పత్తులను విడుదల చేయనుంది. మొబైల్ ఔత్సాహికుల కోసం షియోమి యొక్క MI CC9 ప్రో స్మార్ట్‌ఫోన్ ను విడుదల చేయనున్నది. ఇది వాణిజ్యపరంగా 108MP కెమెరాతో వస్తున్న స్మార్ట్‌ఫోన్ లలో మొదటిది. ఈ కార్యక్రమంలో MI CC9 ప్రోతో పాటుగా షియోమి సంస్థ కొత్త Mi టివి 5-సిరీస్ స్మార్ట్ టివిలను కూడా అదే రోజున విడుదల చేయనుంది.

షియోమి

షియోమి దాదాపు రెండు సంవత్సరాలుగా తన Mi టివి 4 సిరీస్ కింద స్మార్ట్ టివిలను విడుదల చేస్తోంది. ఇప్పుడు Mi టివి 5 సిరీస్ టీవీలను ముందు వాటితో పోలిస్తే కొన్ని కొత్త అప్ డేట్ లతో ప్యాక్ చేయబడి వస్తున్నది. అలాగే షియోమి అదే రోజున కొత్త Mi పవర్ బ్యాంక్ 3 మరియు Mi ఎయిర్ ప్యూరిఫైయర్ మాక్స్ యొక్క మెరుగైన కొత్త ఎడిషన్‌ను కూడా విడుదల చేయనుంది. అలాగే MIUI యొక్క OSతో రన్ అవుతున్న షియోమి యొక్క మొట్టమొదటి స్మార్ట్ వాచ్ కూడా నవంబర్ 5 న కూడా విడుదల కానుంది. మరిన్ని వివరాల కోసం ముందుకు చదవండి.

షియోమి Mi టివి 5 సిరీస్ ఫీచర్స్
 

షియోమి Mi టివి 5 సిరీస్ ఫీచర్స్

చైనాలో షియోమి సంస్థ నవంబర్ 5 న ప్రారంభించబోతున్న Mi టివి 5 సిరీస్ స్మార్ట్ టివిల మీద హైప్ పెంచడానికి ఎక్కువగా టీజ్ చేస్తోంది. Mi టివి 5 లో క్యూఎల్‌ఇడి ప్యానెల్ ఉంటుంది. ఈ ప్యానెల్ ఇప్పటివరకు వన్‌ప్లస్ టివిలలోని క్యూ 1 మరియు వన్‌ప్లస్ క్యూ 1 ప్రో టీవీలలో మాత్రమే ఉంది. ముఖ్యంగా వన్‌ప్లస్ టీవీలు ప్రస్తుతం భారత మార్కెట్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. కాబట్టి షియోమి Mi టీవీ 5 సిరీస్‌ను ఇండియాకు రాబోయే రెండు నెలల్లో తీసుకురావాలని ఆశిస్తున్నారు. ప్రస్తుతం నవంబర్ 5 న Mi టివి 5 సిరీస్ కింద షియోమి ఎన్ని మోడళ్లను లాంచ్ చేస్తుందో వంటి పూర్తి సమాచారం తెలుసుకోవడానికి మరి కొన్ని రోజులు వేచిఉండవలసి ఉంటుంది.

Mi టివి 5 సిరీస్

షియోమి యొక్క Mi టివి 5 సిరీస్ అతి సన్నని డిస్ప్లే ను కలిగి ఉంటుంది. షియోమి పాత Mi టివి 4 ను డిస్‌ప్లే టెక్నాలజీ విషయంలో ఓడించనున్నది. Mi టివి 5 సిరీస్ శామ్‌సంగ్ క్వాంటం డాట్ ప్యానల్‌ను ఉపయోగించనున్నది. ఇది 108% NTSC వైడ్ కలర్‌ను అందిస్తుందని షియోమి తెలిపింది. నిజ జీవితంలో ఈ టీవీలు ఎలా పని చేస్తాయో చూడటం ఆసక్తికరంగా ఉంటుంది. సంఖ్యల ప్రకారం చూస్తే Mi టివి 5సిరీస్ Mi టివి 4 మోడల్స్ కంటే మెరుగైన వీక్షణ అనుభవాన్ని అందిస్తుంది.

షియోమి

షియోమి Mi టివి 5 సిరీస్ యొక్క కొన్ని కోర్ హార్డ్వేర్ వివరాలను కూడా వెల్లడించింది. షియోమి నుండి రాబోయే స్మార్ట్ టీవీలు 12nm ప్రాసెసర్, 4Gb ర్యామ్ మరియు 64Gb ఇంటర్నల్ స్టోరేజ్ ను కలిగి ఉంటాయి. ఈ సిరీస్ యొక్క టీవీల ధరల వివరాలు తెలుసుకోవడానికి నవంబర్ 5న జరుగబోయే షియోమి ఈవెంట్ కార్యక్రమం వరకు వేచిఉండాలి.

 

BSNL బంపర్ ఆఫర్: 5min కంటే ఎక్కువ మాట్లాడితే క్యాష్‌బ్యాక్‌ లభ్యత!!BSNL బంపర్ ఆఫర్: 5min కంటే ఎక్కువ మాట్లాడితే క్యాష్‌బ్యాక్‌ లభ్యత!!

షియోమి Mi టివి 5 సిరీస్ VS వన్‌ప్లస్ టీవీ

షియోమి Mi టివి 5 సిరీస్ VS వన్‌ప్లస్ టీవీ

ధృవీకరించబడిన లక్షణాల ప్రకారం షియోమి Mi టివి 5 సిరీస్ వన్‌ప్లస్ టీవీల స్థానాన్ని ఆక్రమించనున్నది. వన్‌ప్లస్ టీవీలు ప్రస్తుతం భారతదేశంలో మాత్రమే లభిస్తున్నాయి. వన్‌ప్లస్ కొన్ని వారాల క్రితం ఆండ్రాయిడ్ OSతో నడుస్తున్న రెండు స్మార్ట్ టీవీలను విడుదల చేసింది. అవి వన్‌ప్లస్ టీవీ క్యూ 1 మరియు వన్‌ప్లస్ టీవీ క్యూ 1 ప్రో. వీటి ధరలు వరుసగా రూ.69,990 మరియు రూ .99,990. వన్‌ప్లస్ రిలీజ్ చేసిన తన మొట్టమొదటి టీవీలకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది. వాస్తవానికి అమెజాన్ ఇండియాలో ప్రీమియం స్మార్ట్ టీవీ విభాగంలో బెస్ట్ సెల్లర్లుగా కూడా వన్‌ప్లస్ టీవీలు నిలిచాయని చెప్పారు.

 

డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్ మరింత సులువు: మైక్రోసాఫ్ట్ AI- ఆధారిత HAMS టెక్నాలజీడ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్ మరింత సులువు: మైక్రోసాఫ్ట్ AI- ఆధారిత HAMS టెక్నాలజీ

షియోమి

షియోమి సంస్థ యొక్క కొత్త Mi టివి 5 సిరీస్‌ను ఇండియా మార్కెట్లోకి కూడా అతి త్వరలో తీసుకువస్తుందనడంతో ఇది మిగిలిన వాటికి గట్టి పోటీను ఇవ్వడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ చైనా కంపెనీ అందించబోతున్న టీవీలు వన్‌ప్లస్ టివి క్యూ 1 కంటే మెరుగైన ధరను సాధిస్తే కనుక ప్రజలు ప్రీమియం స్మార్ట్ టివి విభాగంలో వన్‌ప్లస్ కంటే షియోమిని ఇష్టపడతారు.

Best Mobiles in India

English summary
Xiaomi Launching New Smart TV Mi TV 5 Series on November 5: Specifications, Key Features Revealed

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X