నవంబర్ 5న రిలీజ్ అవుతున్న షియోమి 108-MP కెమెరా స్మార్ట్‌ఫోన్‌ Mi CC9 ప్రో

|

షియోమి తన తదుపరి కెమెరా-సెంట్రిక్ స్మార్ట్‌ఫోన్‌గా Mi CC9 ప్రో ను విడుదల చేయడానికి సిద్దమైంది. చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ట్విట్టర్‌లో 108 మెగాపిక్సెల్ కెమెరా ఫీచర్ గల Mi CC9 ప్రోను టీజ్ చేసారు. కొత్తగా రాబోయే ఈ స్మార్ట్‌ఫోన్‌ ప్రపంచంలోనే మొట్టమొదటి 108 మెగాపిక్సెల్ పెంటా-కెమెరా సెటప్‌గా ఉంది. పెంటా-కెమెరా సెటప్‌తో చైనాలో ఇప్పటికే Mi CC9 ప్రోను ప్రారంభించటానికి షియోమి అన్ని సన్నాహాలు చేసింది.

Mi CC9 సిరీస్‌
 

చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ తన Mi CC9 సిరీస్‌కు మరోక స్మార్ట్‌ఫోన్‌ను చేర్చే అవకాశం ఉంది. Mi CC9 మరియు Mi CC9E తరువాత ఈ సిరీస్ లో చేర్చడానికి మూడవ స్మార్ట్‌ఫోన్‌గా కంపెనీ Mi CC9 ప్రోను విడుదల చేసే అవకాశం ఉంది. లీ సిస్టర్ ఇషాన్ అగర్వాల్ ప్రకారం Mi CC9 ప్రో నవంబర్ 5 న చైనాలో ఆవిష్కరించబడుతుంది.

పెంటా-కెమెరా సెటప్‌

ఇది 108 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా సెన్సార్ తో పెంటా-కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. షియోమి శామ్‌సంగ్ సహకారంతో 108 మెగాపిక్సెల్‌ను ప్రత్యేకంగా అభివృద్ధి చేసింది. ఈ సెన్సార్‌ను కలిగి ఉన్న మొదటి పరికరం Mi మిక్స్ ఆల్ఫా కాన్సెప్ట్ స్మార్ట్‌ఫోన్. Mi CC9 ప్రో మరియు Mi నోట్ 10 ఇప్పుడు 108 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా సెన్సార్‌తో ప్రారంభించబోతున్న మొదటి వాణిజ్య స్మార్ట్‌ఫోన్‌లు. Mi నోట్ 10 లో గల ఐదు సెన్సార్లు ఒకదానికొకటి ఎలా భిన్నంగా ఉంటాయో ఇంకా స్పష్టంగా తెలియదు.

 అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా

స్మార్ట్‌ఫోన్‌లో అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, మాక్రో సెన్సార్ మరియు డెప్త్ సెన్సార్‌తో అమర్చిన కెమెరాలు ఉన్నట్లు ఇప్పటివరకు లీకైన సమాచారం తెలియజేస్తున్నాయి. ఐదవ కెమెరా సెన్సార్ 5x ఆప్టికల్ జూమ్ వరకు షూట్ చేయగల టెలిఫోటో షూటర్ కావచ్చు అని ఊహాగానాలు ఉన్నాయి. ఈ కెమెరా సెటప్ యొక్క మరిన్ని వివరాల కోసం మరియు ఖచ్చితమైన కాన్ఫిగరేషన్ కోసం ఇంకా కొంత సమయం వేచిచూడవలసి ఉంటుంది.

Mi CC9ప్రో
 

షియోమి ద్వారా త్వరలో రాబోయే Mi CC9ప్రో యొక్క అనేక కెమెరా నమూనాలను కూడా విడుదల చేసింది. ఈ ఫోటోలు జూమ్ సామర్థ్యాన్ని మరియు షియోమి బ్రాండ్ అంబాసిడర్ యొక్క క్లోజప్‌ను చూపుతాయి. కొన్ని ఫోటోలు 108-మెగాపిక్సెల్ రిజల్యూషన్ వద్ద చిత్రీకరించబడ్డాయి. ఇవి వీటి పరిమాణం మరియు రిజల్యూషన్ పరంగా భారీగా ఉన్నాయి.

Mi నోట్ 10

Mi నోట్ 10 స్మార్ట్‌ఫోన్‌ పెద్ద డిస్ప్లే మరియు వాటర్‌డ్రాప్ నాచ్ తరహాలో వస్తుందని భావిస్తున్నారు. గ్లోబల్ లాంచ్ తేదీ ఇంకా వెల్లడించలేదు కాని Mi CC9 ప్రో నవంబర్ 5 న లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. వచ్చే వారం స్మార్ట్‌ఫోన్‌తో పాటు షియోమి బ్రాండెడ్ స్మార్ట్‌వాచ్ లాంచ్‌ను కూడా మనం చూడవచ్చు.

Most Read Articles
Best Mobiles in India

English summary
Xiaomi's 108MP Penta-Lens Mi CC9 Pro To Launch on November 5

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X