దిగ్గజాలే షాక్ : ఆ కంపెనీ ఫోన్లు ప్రతి సెకనుకి రెండు కొనేస్తున్నారు

Written By:

చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ కంపెనీ షియోమి అమ్మకాల సునామిని తలపిస్తోంది. ఈ పండుగ సీజన్‌లో ఆన్‌లైన్ అమ్మకాల్లో బిగ్గెస్ట్ గెయినర్‌గా నిలిచింది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్ టాటా క్లిక్ లాంటి ఇ-కామర్స్ సైట్ల ద్వారా 72 గంటల్లో ప్రతిసెకనుకు తమ స్మార్ట్ ఫోన్లు రెండు అమ్ముడుపోతున్నాయని షియోమీ ప్రకటించింది.

హోమ్ ధియేటర్లపై భారీ తగ్గింపు

దిగ్గజాలే షాక్ : ఆ కంపెనీ ఫోన్లు ప్రతి సెకనుకి రెండు కొనేస్తున్నారు

గత ఏడాది పండుగ సీజన్‌లో 5 లక్షల ఫోన్లను విక్రయించగా ఈ ఏడాది కేవలం మూడు రోజుల్లోనే ఈ లక్ష్యాన్ని చేరుకున్నామని షియోమి ఇండియా బిజినెస్ హెడ్ మను జైన్ తెలిపారు. ఒక్క రోజులోనే రెండు లక్షల 70వేల మధ్యస్థాయి రెడ్ మీ 3ఎస్ స్మార్ట్‌ఫోన్లు అమ్ముడు బోయాయన్నారు. ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డే తమ విక్రయాలకు జోష్ పెంచిందన్నారు.

అమెజాన్‌ గ్రేట్ ఇండియన్ సేల్ : భారీ డిస్కౌంట్లు వీటిపైనే

దిగ్గజాలే షాక్ : ఆ కంపెనీ ఫోన్లు ప్రతి సెకనుకి రెండు కొనేస్తున్నారు

అలాగే అమెజాన్ లో రెడ్ మీ నోట్ 3 టాప్ సెల్లింగ్ డివైస్‌గా నిలిచిందని వెల్లడించారు. ఇప్పుడు అమెజాన్ లో ప్రస్తుతం తమ స్మార్ట్ ఫోన్లన్నీ ఔట్ ఆఫ్ స్టాక్ అని మను తెలిపారు. రెడ్ మి నోట్ 3 ఇంతలా అమ్ముడుపోవడానికి అందులో ఉన్న ఫీచర్స్ కారణమని చెప్పవచ్చు.

కమింగ్ సూన్: మునుపెన్నడూ లేని ఫీచర్లతో ఐఫోన్8

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ధర

మెటల్ బాడీ డిజైనింగ్ మెటల్ బాడీ డిజైనింగ్, ఫింగర్ ప్రింట్ స్కానర్ వంటి ప్రత్యేకమైన ఫీచర్లతో మార్కెట్లో విడుదలైన షియోమీ రెడ్మీ నోట్ 3 ఫోన్‌కు ఇండియన్ యూజర్ల నుంచి పాజిటివ్ టాక్ వ్యక్తమవుతోంది. రెండు వేరియంట్‌లలో ఈ ఫోన్‌లను షియోమీ అందుబాటులో ఉంచింది. మొదటి వేరియంట్ 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీతో వస్తోంది. ధర రూ.9,999. ఇక రెండవ వేరియంట్ 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమరీతో వస్తోంది. ధర రూ.10,999.

డిస్ ప్లే

5.5 అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1080 x 1920 పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, ఆక్లాకోర్ సీపీయూతో కూడిన మీడియాటెక్ ఎంటీ6795 హీలియో ఎక్స్10 చిప్‌సెట్, ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్స్ (16జీబి, 32జీబి),

కెమెరా

16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (2జీ, 3జీ, 4జీ, వై-ఫై, బ్లుటూత్), 4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ క్విక్ ఛార్జింగ్ సపోర్ట్. ఫింగర్ ప్రింట్ స్కానర్ సపోర్ట్.

బ్యాటరీ

రెడ్మీ నోట్ 3 స్మార్ట్‌ఫోన్‌ 4,100 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో వస్తోంది. బ్యాటరీ బ్యాకప్ బాగుంటుంది. యావరేజ్‌గా వాడుకుంటే సింగిల్ చార్జ్ పై రెండు రోజుల బ్యాకప్‌ను పొందవచ్చు.

పూర్తి మోటాలిక్ ఫినిషింగ్‌తో

స్మార్ట్‌ఫోన్‌ పూర్తి మోటాలిక్ ఫినిషింగ్‌తో వచ్చింది. ఈ మెటాలిక్ ఫినిషింగ్ ఫోన్‌కు క్లాసికల్ లుక్‌ను తీసుకువస్తుంది.

మల్టీటాస్కింగ్‌

రెడ్మీ నోట్ 3 స్మార్ట్‌ఫోన్‌‌లో పొందుపరిచిన 64 బిట్ ఆక్టా కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 616 ప్రాసెసర్ వేగవంతమైన మల్టీటాస్కింగ్‌ను అందిస్తుంది.

 

 

రిజల్యూషన్ సామర్థ్యం

స్మార్ట్‌ఫోన్‌ 5.5 అంగుళాల మెరుగైన హైడెఫినిషన్ డిస్‌ప్లే‌తో వస్తోంది. రిజల్యూషన్ సామర్థ్యం 720x1280 పిక్సల్స్. వ్యూవింగ్ యాంగిల్స్ బాగుంటాయి.

హై క్వాలిటీ ఫోటోగ్రఫీ

స్మార్ట్‌ఫోన్‌‌లో 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరాతో పాటు 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను పొందుపరిచారు. ఇవి హై క్వాలిటీ ఫోటోగ్రఫీని చేరువచేస్తాయి.

4జీ కనెక్టువిటీ...

కనెక్టువిటీ ఆప్షన్స్ 2జీ, 3జీ, 4జీ, వై-ఫై, బ్లుటూత్, యూఎస్బీ 2.0 వంటి కనెక్టువిటీ ఆప్షన్స్‌ను రెడ్మీ నోట్ 3 స్మార్ట్‌ఫోన్‌‌లో పొందుపరిచారు.

హైబ్రీడ్ స్లిమ్ స్లాట్‌

రెడ్మీ నోట్ 3 స్మార్ట్‌ఫోన్‌ హైబ్రీడ్ స్లిమ్ స్లాట్‌తో వస్తోంది. ఒక స్లాట్‌లో మైక్రోసిమ్ మరొక స్లాట్‌లో నానో సిమ్ ఇంకా మైక్రోఎస్డీ కార్డ్‌ను వాడుకోవల్సి ఉంటుంది.

కొనుగోలు కోసం క్లిక్ చేయండి

భారీ డిస్కౌంట్‌తో దుమ్మురేపుతున్న రెడ్‌మి నోట్ 3 మరింత సమాచారం కోసం క్లిక్ చేయండి 

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

 

English summary
Xiaomi sold 2 phones every second in 72 hours of festive sales read more telugu gizbot
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot