మహా అద్భుతానికి తెరలేపనున్న స్టీఫెన్ హాకింగ్

Written By:

ప్రఖ్యాత భౌతిక శాస్ర్తవేత్త స్టీఫెన్ హాకింగ్ ఓ మహా అధ్భుతానికి తెరలేపనున్నారు. విశ్వం ఏర్పడిన తొలినాళ్లనాటి పరిస్థితులను కండ్లకుగట్టినట్టుగా చూపించే సూపర్ మ్యాప్‌ను రూపొందించేందుకు ఓ బృహత్ ప్రణాళికకు స్వీకారం చుట్టారు. కేంబ్రిడ్జి యూనివర్సిటీలోని సూపర్ కంప్యూటింగ్ సెంటర్‌ను ఉపయోగించుకొని విశ్వం మొత్తాన్ని ఒక పటంలోనే చిత్రీకరించే ప్రణాళికను సిద్ధం చేశారు. వందల కోట్ల సంఖ్యలో ఉన్న నక్షత్ర వీధులు, కృష్ణబిలాలు అన్నింటినీ ఇందులో చూపించనున్నారు.

Read more: ఫేస్‌బుక్ ఇప్పటికిప్పుడు మాయమైపోతే: స్టీఫెన్ హాకింగ్

మహా అద్భుతానికి తెరలేపనున్న స్టీఫెన్ హాకింగ్

ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూర్తి వివరాలను సోమవారం స్పెయిన్‌లోని టెనెరిఫెలో జరిగే స్టార్‌మస్ సైన్స్ కాన్ఫరెన్స్‌లో ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్తలతో చర్చించిన తర్వాత ప్రకటించే అవకాశముంది. ఇందుకు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వారు చేసిన మహావిస్ఫోటన నమూనాను వారు ఉపయోగించనున్నారు. డార్క్ ఎనర్జీ సర్వే వారి నుంచి తీసుకున్న ఛాయాచిత్రాలను కూడా పరిశీలిస్తారు.

Read more : రానున్న కాలంలో మనుషుల్నిఆడించేది కంప్యూటర్లే

ఈ ఫొటోలు చిలీలోని 13 అడుగుల వ్యాసంతో ఉన్న టెలిస్కోప్ నుంచి తీసుకున్నారు. విశ్వ విస్తరణకు కారణమవుతున్న డార్క్ ఎనర్జీని ప్రపంచానికి తెలియజెప్పాలనే లక్ష్యంగా ఈ ప్రాజెక్ట్‌ను రూపొందించారు. 2020లో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ప్రయోగించే యూక్లిడ్ ప్రోబ్ ద్వారా మ్యాపులను మెరుగుపరుస్తామని తెలిపారు.  మానవ మనుగడ గురించి ఈ ప్రఖ్యాత భౌతికి శాస్త్రవేత్త సంచలన వ్యాఖ్యలు చేశారు.

Read more: 100 మిలియన్ల డాలర్ల ప్రాజెక్ట్‌తో నక్షత్రాల వేట షురూ !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మహా అద్భుతానికి తెరలేపనున్న స్టీఫెన్ హాకింగ్

భూగోళంపై మానవ జాతి మనుగడ వెయ్యి ఏళ్ల నుంచి పదివేల ఏళ్ల మధ్య ముగిసిపోతుందని ప్రపంచ ప్రసిద్ధి చెందిన భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ హెచ్చరించారు. అయినంత మాత్రాన మానవ జాతి నశించి పోదని, మరో ఉపగ్రహంపై కాలనీలు ఏర్పాటు చేసుకొని మనుగడ సాగించగలదని ఆయన చెప్పారు.

మహా అద్భుతానికి తెరలేపనున్న స్టీఫెన్ హాకింగ్

అయితే ఇతర గ్రహాలపై మానవులు నివాస పరిస్థితులు ఏర్పర్చుకోవడానికి ఇంకా వందేళ్లకుపైగా పట్టవచ్చని అన్నారు. ఈలోగా రానున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించడంపై దృష్టిని కేంద్రీకరించాలని పిలుపునిచ్చారు.

మహా అద్భుతానికి తెరలేపనున్న స్టీఫెన్ హాకింగ్

భూగోళంపై మానవ మనుగడ నశించి పోవడానికి సాంకేతికరంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పులే వినాశనానికి దారితీయవచ్చని స్టీఫెన్ హాకింగ్ చెప్పారు. మానవుడు తన మేధస్సు ద్వారా సృష్టించిన వాటి ద్వారానే మన నాశనం సంభవించబోతున్నది తేల్చారు.

మహా అద్భుతానికి తెరలేపనున్న స్టీఫెన్ హాకింగ్

ఆర్టిఫిషల్ బ్రెయిన్ సాంకేతిక పరిజ్ఞానం ఆధిపత్యం వల్ల భూమి మీద మానవ మనుగడకు ముప్పు ఏర్పడవచ్చని ఆయన గతేడాదే చెప్పిన విషయం తెల్సిందే. 

మహా అద్భుతానికి తెరలేపనున్న స్టీఫెన్ హాకింగ్

అణు యుద్ధం వల్లగానీ, భూతాపోన్నతి కారణంగాగానీ, వివిధ వైరస్‌లలో జన్యుమార్పిడి కారణంగాగానీ భూగోళంపై మానవ మనుగడ సాధ్యం కాకుండా పోతుందని ఆయన తాజాగా చెప్పారు.

మహా అద్భుతానికి తెరలేపనున్న స్టీఫెన్ హాకింగ్

ఆటోమేషన్ ఆయుధాలు కూడా భవిష్యత్ వినాశన ఆయుధాలుగా మారవచ్చన్నారు. మనకన్నా అన్నింటా ముందుండే గ్రహాంతర వాసుల వల్ల కూడా ముప్పు వచ్చే అవకాశం లేకపోలేదని ఆయన చెప్పారు.

మహా అద్భుతానికి తెరలేపనున్న స్టీఫెన్ హాకింగ్

అమెరికాను కొలంబస్ కనుగొన్నప్పుడు అమెరికా స్థానికులకు సంభవించిన పరిస్థితులే గ్రహాంతర వాసుల వల్ల మనకూ కలగవచ్చన్నది ఆయన అభిప్రాయం. గ్రహాంతరవాసులు కచ్చితంగా ఉంటారని విశ్వసించే స్టీఫెన్ హాకింగ్ ప్రస్తుతం వారిని కనుగొనే ప్రయత్నాల్లోనే ఉన్నారు.

మహా అద్భుతానికి తెరలేపనున్న స్టీఫెన్ హాకింగ్

హార్వర్డ్ యూనివర్శిటీలో ప్రపంచంలోకెల్లా రెండు అత్యంత శక్తివంతమైన టెలిస్కోప్‌ల ద్వారా ఆయన గ్రహాంతరవాసులను వెతుకుతున్నారు.

మహా అద్భుతానికి తెరలేపనున్న స్టీఫెన్ హాకింగ్

ఇక ప్రపంచంలో ‘యురేకా' అంటూ కనుగొనే అంశాలు ఏమీ ఉండవని, ఇప్పటికే కనుగొన్న శాస్త్ర విజ్ఞాన మూల సూత్రాల ప్రాతిపదికనే భవిష్యత్తు పరిస్థితులను ఊహించి ఎదురయ్యే ముప్పులకు ప్రత్యామ్నాయ మార్గాలను కనుగొనడమే ఉత్తమ మార్గమని చెప్పారు.

మహా అద్భుతానికి తెరలేపనున్న స్టీఫెన్ హాకింగ్

కృత్రిమ మేథస్సు (ఆర్టిఫిషల్ బ్రెయిన్)కు దారితీసిన శాస్త్రవిజ్ఞాన అభివృద్ధినీ అడ్డుకోలేమని, దాన్ని తిరోగమన మార్గాన్ని పట్టించలేమని చెప్పారు. రానున్న ముప్పును ముందుగానే పసిగట్టి ఆ ముప్పుకు కారణమయ్యే పరిస్థితులను నియంత్రణలోకి తెచ్చుకోవడం ఒక్కటే మార్గమని చెప్పారు.

మహా అద్భుతానికి తెరలేపనున్న స్టీఫెన్ హాకింగ్

ఈ విశ్వాంతరాల్లో మానవులకన్నా ముందే గ్రహాంతరవాసులు ఉండే అవకాశం ఉన్నందున శాస్రవిజ్ఞాన రంగంలోనే కాకుండా ప్రజాస్వామ్య విలువలపరంగా కూడా వారు మనకన్నా ముందే ఉండే అవకాశం ఉంది. అందుకని మనకన్నా వారే ఎక్కువ హేతువాదులు కావచ్చని కూడా స్టీఫెన్ అన్నారు.

మహా అద్భుతానికి తెరలేపనున్న స్టీఫెన్ హాకింగ్

ఇన్ని షాకులిచ్చిన హాకింగ్ కొన్ని సర్ప్రైజ్లు కూడా చెప్పారు! మానవ మనుగడకు ఇన్ని దరిద్రాలు ముంచుకొస్తున్నా మనకోసం మరెన్నో అవకాశాలు కూడా ఉన్నాయని సెలవిచ్చారు. మానవ జాతికి భూమిపై ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురైన ఇతర ఉపగ్రహాలపై హ్యాపీగా ఉండొచ్చట.

మహా అద్భుతానికి తెరలేపనున్న స్టీఫెన్ హాకింగ్

అక్కడ కాలనీలు ఏర్పాటు చేసుకొని ఉండొచ్చని అయితే ఈ నివాస పరిస్థితులకు వందేళ్లకుపైగా పట్టవచ్చని హ్యాకింగ్ అంచనా వేశారు. ఇక్కడ కూడా మళ్లీ షాక్ ఇచ్చారు. 

మహా అద్భుతానికి తెరలేపనున్న స్టీఫెన్ హాకింగ్

మనకన్నా అన్నింటా ముందుండే గ్రహాంతర వాసుల వల్ల భూమిపైనే కాదు ఇతర గ్రహాల్లో కూడా ముప్పు వచ్చే అవకాశం లేకపోలేదట.

మహా అద్భుతానికి తెరలేపనున్న స్టీఫెన్ హాకింగ్

మరి ప్రపంచంలో సుప్రసిద్ధమైన భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ చెప్పినట్లు జరుగుతాయా లేదా అన్నది ముందు ముందే చూడాలి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Stephen Hawking to announce plans to map entire known universe
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot