రక్తపు చరిత్రకు సజీవ సాక్ష్యం : ఫేస్‌బుక్‌ సైతం కన్నీరు కార్చింది

|

1972వ సంవత్సరంలో వియాత్నం యుద్ధం సమయంలో నాపలమ్‌పై దాడి జరుగుతున్న వేళ ఓ చిన్నారి ఆ దాడి నుంచి తప్పించుకునేందుకు ఏడుస్తూ నగ్నంగా పరిగెత్తుకుంటూ వెళ్తున్న ఓ ఫోటో ప్రపంచం మొత్తాన్ని కదిలించింది. అక్కడ యుద్ధ వాతావరణాన్ని కళ్లకు కట్టినట్లు చూపించింది. పులిట్జర్ బహుమతి గ్రహీత నార్వే ఫోటోగ్రాఫర్ నిక్ అట్ ఈ విషాద చిత్రాన్ని తన కెమెరాలో బంధించి ప్రపంచానికి అక్కడ జరుగుతున్న విషాదాన్ని తెలియజేయాలని తన ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు.

 

దీపావళి ధమాకా: 10 వేల ఉద్యోగాలకు స్నాప్‌డీల్ నోటిఫికేషన్

రక్తపు చరిత్రకు సజీవ సాక్ష్యం : ఫేస్‌బుక్‌ సైతం కన్నీరు కార్చింది

అయితే ఈ ఫోటో తన నియమ నిబంధనలకు విరుద్ధంగా ఉందంటూ ఫేస్‌బుక్ ఆ ఫోటోను ఆనాడు తొలగించింది. ఇదే ఫోటోను నార్వే ప్రధానమంత్రి ఎర్నా సోల్ బెర్గ్ తన ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు.అయితే దీన్ని కూడా ఫేస్‌బుక్‌ తొలగించడంతో ఫేస్‌బుక్ తన అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందంటూ పలువురు మండిపడ్డారు. దీన్ని నిరసిస్తూ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్‌కు నార్వే అతిపెద్ద న్యూస్ పేపర్ ఎడిటర్ ఓ బహిరంగ లేఖ రాశారు.

షాక్: ఆపిల్ ఐఫోన్ 7 ఫీచర్స్ రూ.10 వేల ఫోన్లలో దొరుకుతున్నాయి!

రక్తపు చరిత్రకు సజీవ సాక్ష్యం : ఫేస్‌బుక్‌ సైతం కన్నీరు కార్చింది

దీంతో ఖంగుతిన్న ఫేస్‌బుక్ తన నిర్ణయాన్ని మార్చుకుని చిన్నారి ఫొటోను షేర్ చేసుకునేందుకు అనుమతిస్తున్నట్టు పేర్కొంది. చరిత్రను పరిశీలించి, విశ్వవ్యాప్తంగా ఈ ఫొటోకు ఉన్న ప్రాముఖ్యాన్ని గుర్తించినట్టు తెలిపింది. చారిత్రక ప్రాధాన్యం ఉన్న గొప్ప ఛాయాచిత్రమని కొనియాడింది.తొలగించిన చోటే దానిని తిరిగి పోస్టు చేయనున్నట్టు ప్రకటించింది.

మీ కాల్స్‌కి కనెక్ట్ కాలేం..జియోకి షాకిచ్చిన దిగ్గజ టెల్కోలు

చరిత్రకు సజీవ సాక్ష్యాలుగా ఇలాంటి ఫోటోలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ మరుగునపడిపోయాయి..ప్రపంచం మరచిపోయిన ఆ చిత్రాలను మళ్లీ ఓ సారి గుర్తు చేసుకుందాం.

డాడీ నీ కోసం ఎదురుచూస్తున్నా

డాడీ నీ కోసం ఎదురుచూస్తున్నా

డాడీ నీ కోసం ఎదురుచూస్తున్నానంటూ చిన్న పిల్లాడు పరిగెడుతున్న చిత్రం.యుద్ధంలోకి వెళుతున్న చాలామందికి ఈ చిత్రం చూసిన తరువాత ఎంతో వేదన కలిగే ఉంటుంది. తన పిల్లల మీద ప్రేమను చూపెడుతోంది. యుద్ద పరిస్థితులను కూడా కళ్లకు కట్టినట్టు చూపే ఈ చిత్రాన్ని డెట్లాఫ్ తీసారు.

చెగువేరా చివరిక్షణం

చెగువేరా చివరిక్షణం

ప్రపంచాన్నికి ఉద్యమం అంటే ఏంటో తెలియజెప్పిన చెగువేరా చివరిక్షణంలో ఇలా నేలకొరిగినప్పుడు తీసిన చిత్రం ఇది. దీనికి అందరూ చే లైవ్స్ అని స్లోగన్ కూడా ఇచ్చారు.

సైనికుల శవాల మధ్య ఓ డాక్టర్
 

సైనికుల శవాల మధ్య ఓ డాక్టర్

జర్మనీలో గల బెర్గిన్ లోని క్యాంప్ శిబిరంలో సైనికుల శవాల మధ్య ఓ డాక్టర్ దీనంగా నడుస్తున్న చిత్రం. ఈ శవాలను ఓ చోటుకు చేర్చి తగలబెట్టడం ఇతని ప్రధాన విధి..ఇలా కుప్పలు కుప్పలుగా పడి ఉన్న శవాలను చూసిన యావత్ ప్రపంచం నివ్వెరబోయింది. ఈ చిత్రం ప్రపంచాన్నే మార్చి వేసింది.

యువతి తనవారిని చూసి రోదిస్తున్న వైనం

యువతి తనవారిని చూసి రోదిస్తున్న వైనం

యుద్ధంలో మరణించిన సైనికులకు నివాళులు అర్పిస్తున్న ఈ చిత్రం కూడా ఎంతోమందిని విషాదంలోకి నింపింది. ఓ యువతి తనవారిని చూసి రోదిస్తున్న వైనం యావత్ ప్రపంచానికి కన్నీరు తెప్పించింది.

పసిమనస్సులపై యుద్ధ ప్రభావం

పసిమనస్సులపై యుద్ధ ప్రభావం

పాలబుగ్గల ఈ చిన్నారి ఫొటో మొన్నటివరకూ సోషల్‌ నెట్‌వర్క్‌లో విపరీతంగా చూసేలా చేసింది. చేస్తూనే ఉంది. సిరియా శరణార్థుల శిబిరంలో తలదాచుకుంటున్న ఈ చిన్నారిని ఓ ఫొటోగ్రాఫర్‌ ఫొటో తీస్తుండగా ఆ చిన్నితల్లి కెమేరాను చూసి గన్‌ అనుకుంది.అంతే ఇలా చేతులెత్తి, లొంగిపోతున్నట్లు నిలబడి పోయింది. ఆ దృశ్యాన్ని చూసిన ఫొటోగ్రాఫర్‌ కూడా కదలిపోయి, ఆనక తన కెమేరాలో బంధించి ఇలా మన ముందుంచారు. నిత్యం బాంబులు, తుపాకుల మధ్య లక్షలాది చిన్నారుల బతుకులు ఎలా భయభ్రాంతుల్లో కొట్టుమిట్టాడుతుందో ఈ చిత్రం అద్దంపడుతోంది. పసి మనస్సులపై ఉగ్రవాదం వేసిన ముద్రకు ఈ ఫొటో కన్నా వేరొకటి అవసరం లేదేమో!

యుధ్దోన్మాదం

యుధ్దోన్మాదం

ఒకప్పుడు అమెరికా-వియత్నాం యుద్ధం ప్రపంచాన్నే నివ్వెరపరిచింది. అంతేకాదు ఆ సందర్భంలో అమెరికా యుద్ధోన్మాదాన్ని ప్రతిబింబించే ఈ చిత్రమే సజీవ సాక్ష్యం. ఆ చిత్రం అమెరికా సైన్యం ప్రయోగించిన నాపాం బాంబుదాడిలో శరీరం కాలిపోవడంతో ఆ గాయాలతో నగ్నంగా ప్రాణభయంతో పరిగెడుతున్న వియత్నాం బాలిక పాన్‌ ది కిమ్‌ పుట్‌ ఫొటో. ఈ దృశ్యాన్ని తన కెమెరాతో బంధించిన ఫొటోగ్రాఫర్‌ పేరు నిక్‌. ఫొటో తీయగానే అతను తన కోటును తీసి ఆ పాపకు కప్పి, ఆసుపత్రికి తరలించి, కిమ్‌ ప్రాణాల్ని కాపాడాడు. అప్పట్లో ఈ చిత్రం ప్రపంచానికి అమెరికా యుద్ధోన్మాదం ఎలాంంటిదో తెలియజేసింది.

ప్రపంచదేశాలను కదిలించిన చిత్రం

ప్రపంచదేశాలను కదిలించిన చిత్రం

యూరప్‌ ద్వంద్వ ప్రమాణాల్ని ప్రపంచానికి తెలియజేసిన చిత్రం అది. అదే సముద్రతీరాన చనిపోయి పడివున్న బాలుని చిత్రం.నీలోఫర్‌ డెమిర్‌ అనే పాత్రికేయురాలు తన కెమెరాలో ఈ చిత్రాన్ని బంధించింది. ఈ చిత్రం సొంత ఊరు, కన్నవారినీ వదిలి చేతబట్టుకుని పొరుగు దేశాలకు వెళ్లే శరణార్థుల వెతల్ని చూపెడుతోంది. ఈ ఫొటో చూసి ఇప్పటికే కోటాను కోట్ల మంది కన్నీరు పెట్టి ఉంటారు.

ఫాలింగ్ సోల్డియర్

ఫాలింగ్ సోల్డియర్

1935 సెప్టెంబర్ 5న రాబర్ట్ కాపా తీసిన చిత్రం.స్పానిష్ సివిల్ వార్ లో బుల్లెట్ తగులుతూ నేలకొరుగుతున్న సైనికుడిని చూసిన యావత్ ప్రపంచం విషాదంలో మునిగింది.

వలసల తల్లి

వలసల తల్లి

డోరోతీయా తీసిన చిత్రం.తినడానికి తిండిలేక తన కారును పుడ్ కోసం అమ్మేసింది. తన పిల్లల ఆకలి తీర్చడానికి తన పస్తులుంటూ కాలం గడిపింది.ఆఖరికి తన పిల్లల్ని అక్కడ పక్షులు చంపేస్తే ఏం చేయాలో తెలియక దిక్కులు చూస్తూ గడిపింది. ఈమె వయస్సు 32 సంవత్సారాలు.ఓ తల్లి పడే వేదనను ప్రపంచం మొత్తం చూసి తల్లడిల్లింది.

సూడాన్‌ కరువు

సూడాన్‌ కరువు

ఆకలితో బక్కచిక్కిన శరీరం, ఎముకల గూడుగా మారి తల వంచిన చిన్నారి.. చనిపోతే బాగుండు తినేద్దాం అని ఎదురుచూసే రాబందు.. ఈ చిత్రం చూస్తే ఎంత కరడుగట్టిన వారినైనా కదలిస్తుంది. సూడాన్‌లో నాటి కరువు పరిస్థితులకు అద్దం పట్టిందీ చిత్రం. ఈ చిత్రాన్ని కెవిన్‌ కార్టర్‌ అనే ఫొటోగ్రాఫర్‌ తన కెమెరాతో 1993లో చిత్రీకరించారు. అయితే ఆ బాలుడిని రక్షించకుండా కెవిన్‌ వచ్చేశాడు. ఆ తర్వాత కెవిన్‌కు మంచి కానుకే లభించింది. కానీ అతను తీవ్ర విమర్శల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ బాలుడిని రక్షించలేదన్న బాధతోనే కెవిన్‌ కొన్ని నెలల తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు.

Best Mobiles in India

English summary
Here Write Facebook takes U-turn over 'Napalm girl' photograph

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X