ఫీచర్ ఫోన్స్‌లో ట్రూ కాలర్, అదీ నెట్ లేకుండానే..

Written By:

కాలర్‌ ఐడెంటిఫికేషన్‌ యాప్‌ సంస్థ ట్రూకాలర్‌ తాజాగా తమ కాలర్‌ ఐడీ సేవలను ఫీచర్‌ ఫోన్స్‌లోనూ అందుబాటులోకి తెచ్చింది. అలాగే మొబైల్‌ ఫోన్‌ నంబరు ఆధారిత వీడియో కాలింగ్, పేమెంట్‌ సర్వీసులనూ కూడా ప్రవేశపెట్టింది.

జియో డెడ్‌లైన్ రేపే ! రూ.10కే 1జిబి డేటా

ఫీచర్ ఫోన్స్‌లో ట్రూ కాలర్, అదీ నెట్ లేకుండానే..

ఇంటర్నెట్ వినియోగించని లేదా ఫీచర్‌ ఫోన్స్‌నే ఉపయోగిస్తున్న వారికి కాలర్‌ ఐడీ సర్వీసులు అందించేందుకు ఎయిర్‌టెల్‌తో ట్రూకాలర్‌ చేతులు కలిపింది. ట్రూకాలర్‌ యాప్‌ ఉన్న స్మార్ట్‌ఫోన్స్‌లో అయితే కాల్‌ చేసే వారి పేరు స్క్రీన్‌పై డిస్‌ప్లే అవుతుంది. అదే ఫీచర్‌ ఫోన్స్‌లో కాల్‌ వస్తుండగానే కాలర్‌ పేరు ఫ్లాష్‌ ఎస్‌ఎంఎస్‌ రూపంలో వస్తుంది.

ఫస్ట్ టైం 1Gbps ప్లాన్ వచ్చేసింది, అదీ హైదరాబాద్‌లో..

కాగా, పేమెంట్‌ సర్వీసుల కోసం ఐసీఐసీఐ బ్యాంక్‌తో చేతులు కలిపినట్లు ట్రూకాలర్‌ తెలిపింది. కంప్యూటర్ లో కూడా ట్రూ కాలర్ ఉపయోగించవచ్చు. ఎలాగో చూద్దాం.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

స్టెప్ 1

ముందుగా మీ కంప్యూటర్‌లోకి వెళ్లి True Caller అఫీషియల్ వెబ్ సైట్ లోకి లాగిన్ అవ్వండి.

స్టెప్ 2

True Caller ప్రధాన పేజీలో కనిపించే డ్రాప్ డౌన్ మెనూలో India (+91) కోడ్‌ను సెలక్ట్ చేసుకుని మీరు అడ్రస్ ట్రేస్ చేయాలనుకుంటున్న మొబైల్ నెంబర్‌ను సెర్చ్ బాక్సులో ఎంటర్ చేసి సెర్చ్ బటన్ పై క్లిక్ చేయండి.

స్టెప్ 3

ఇప్పుడు స్ర్కీన్ పై ఓ పాపప్ బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో మీరు sign in అవ్వాల్సి ఉంటుంది. మీకు సంబంధించి జీమెయిల్, మైక్రోసాఫ్ట్, ఫేస్‌బుక్ లేదా యాహూ అకౌంట్ ద్వారా ఇక్కడ లాగిన్ అవ్వొచ్చు.

స్టెప్ 4

sign in ప్రాసెస్ కంప్లీట్ అయిన వెంటనే మీరు ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్‌కు సంబంధించి 90% ఖచ్చితమైన సమాచారం స్ర్కీన్ పై ప్రత్యక్షమవుతుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Truecaller, Airtel Partner to Bring Caller ID Function to Feature Phones Without Data read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot