13MP కెమెరా, 10,090mAh బ్యాటరీతో ఇండియాకి వచ్చేస్తోన్న శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ S10 FE సిరీస్.. ధర ఎంతంటే..?
Samsung Galaxy Tab S10 FE: శాంసంగ్ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గెలాక్సీ ట్యాబ్ S10 FE సిరీస్ ఇండియాలో లాంచ్ కావడానికి సిద్ధమైపోయింది. ఈ టాబ్లెట్స్ రీసెంట్‌గా చైనాకి చెందిన 3C, ఇండియాకి చెందిన BIS, FCC, ఇంకా SGS ఫిమ్కో వంటి చాలా సర్టిఫికేషన్ వెబ్‌సైట్లలో కనిపించాయి. దీంతో త్వరలోనే ఈ టాబ్లెట్స్ విడుదలవుతాయని స్పష్టమైపోయింది. చాలా దేశాల్లో సర్టిఫికేషన్స్ రావడంతో, గ్లోబల్ మార్కెట్లోకి కూడా ఒకేసారి రిలీజ్ చేసేలా ఉన్నారు.
* BIS సర్టిఫికేషన్..
బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) లిస్టింగ్‌లో గెలాక్సీ ట్యాబ్ S10 FE సిరీస్‌లో నాలుగు మోడల్స్ ఇండియాలో రిలీజ్ అవుతున్నాయని తేలింది. గెలాక్సీ ట్యాబ్ S10 FE Wi-Fi ఓన్లీ (SM-X520) మోడల్, అలాగే 5G/సెల్యూలర్ (SM-X526B) వేరియంట్ కూడా వస్తున్నాయి.

గెలాక్సీ ట్యాబ్ S10 FE ప్లస్‌లో కూడా రెండు మోడల్స్ ఉంటాయి. Wi-Fi ఓన్లీ (SM-X620) మోడల్ చాలా తక్కువ ధరకే లభిస్తుంది. అయితే 5G/సెల్యూలర్ (SM-X626B) వేరియంట్ కాస్త ఎక్కువ ధర ఉంటుంది కానీ ఇంటర్నెట్ కనెక్టివిటీ కోసం మరో డివైజ్ పైన ఆధారపడాల్సిన అవసరం ఉండదు.
* 3C సర్టిఫికేషన్ ద్వారా ఛార్జింగ్ స్పీడ్ లీక్..
శాంసంగ్ 3C సర్టిఫికేషన్ లిస్టింగ్‌లో గెలాక్సీ ట్యాబ్ S10 FE, S10 FE ప్లస్ రెండూ కూడా 45W ఫాస్ట్ ఛార్జింగ్‌ని సపోర్ట్ చేస్తాయని తెలిసింది. కానీ, బాక్స్‌లో మాత్రం ఛార్జర్ ఇవ్వరంట. మూడు మోడల్స్ 3C లిస్టింగ్‌లో కనిపించాయి. వాటిలో మొదటిది గెలాక్సీ ట్యాబ్ S10 FE Wi-Fi (SM-X520).
మిగతా రెండు ఏమిటంటే, గెలాక్సీ ట్యాబ్ S10 FE Plus Wi-Fi (SM-X620), గెలాక్సీ ట్యాబ్ S10 FE 5G (SM-X526C). ట్యాబ్ S10 FE ప్లస్ 5G మోడల్ మాత్రం ఇంకా 3C లిస్టింగ్‌లో కనిపించలేదు. అవి కూడా వస్తున్నాయని మాత్రం టెక్ ఇండస్ట్రీ నిపుణులు చెబుతున్నారు.
* ఫీచర్లు (అంచనా మాత్రమే)
గెలాక్సీ ట్యాబ్ S10 FE 10.9-అంగుళాల LCD డిస్‌ప్లే, 800 నిట్స్ బ్రైట్‌నెస్‌తో వస్తుందని అంచనా, గెలాక్సీ ట్యాబ్ S10 FE ప్లస్‌లో ఇంకా పెద్దదైన 13.1-అంగుళాల స్క్రీన్ ఉంటుందట. రెండు టాబ్లెట్స్‌లోనూ శాంసంగ్ సొంత ఎక్సీనోస్ 1380 ప్రాసెసర్ ఉండొచ్చని అంటున్నారు. 8GB/12GB ర్యామ్ ఆప్షన్స్‌తో పాటు 128GB/256GB స్టోరేజ్ ఉండొచ్చు.
* కెమెరా, ఫీచర్స్..
రెండు మోడల్స్‌లోనూ వెనుకవైపు 13MP కెమెరా, ముందువైపు 12MP కెమెరా ఉండొచ్చని లీక్స్ ద్వారా తెలుస్తోంది. Wi-Fi 6E, బ్లూటూత్ 5.4, GPS, USB టైప్-C పోర్ట్ ఇంకా వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ కోసం IP68 రేటింగ్ కూడా ఇస్తున్నారు. S-Pen కూడా బాక్స్‌లోనే వస్తుంది.
512GB స్టోరేజ్‌తో, కొత్త స్కై బ్లూ కలర్‌లో ఒప్పో రెనో 13 వచ్చేసింది.. ఫీచర్లు చూస్తే ఫిదా అవ్వాల్సిందే..
* పాత మోడల్ కంటే ఫాస్ట్ పెర్ఫార్మెన్స్..
గీక్‌బెంచ్ లిస్టింగ్‌లో గెలాక్సీ ట్యాబ్ S10 FE సింగిల్-కోర్ టెస్ట్‌లో 1,349 స్కోరు, మల్టీ-కోర్ టెస్ట్‌లో 3,882 స్కోరు సాధించింది. అంటే, ట్యాబ్ S9 FE కంటే 33% నుంచి 41% వరకు ఫాస్టర్‌గా పనిచేస్తుందన్నమాట. ట్యాబ్ S10 FE ప్లస్ లో 10,090mAh బ్యాటరీ, ట్యాబ్ S10 FEలో 8,000mAh బ్యాటరీ ఉంటుందని సమాచారం.
* లాంచ్ ఎప్పుడు, ధర ఎంత ఉండొచ్చు..
లాంచ్ డేట్ ఇంకా అఫీషియల్‌గా అనౌన్స్ చేయలేదు కానీ, చాలా సర్టిఫికేషన్స్ రావడంతో ఇంకొన్ని నెలల్లోనే రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఇంతకుముందు గెలాక్సీ ట్యాబ్ S9 FE సిరీస్ 2023, అక్టోబర్‌లో లాంచ్ అయింది. ట్యాబ్ S9 FE ధర అప్పుడు రూ.36,999, ట్యాబ్ S9 FE ప్లస్ ధర రూ.46,999 నుంచి స్టార్ట్ అయ్యాయి. కొత్త మోడల్స్ కూడా దగ్గర ధరల్లోనే రావొచ్చు.


Click it and Unblock the Notifications








