కొత్త ఆండ్రాయిడ్ అప్డేట్ లను పొందిన పాత 5 Mi టీవీలు

|

షియోమి సంస్థ ఇండియాలో ఈ వారం ప్రారంభంలో నాలుగు కొత్త Mi టీవీలను విడుదల చేసింది. షియోమి విడుదల చేసిన Mi టివి మోడల్స్ వరుసగా Mi టివి 4 ఎక్స్ 43-ఇంచ్, Mi టివి 4 ఎక్స్ 50-ఇంచ్, Mi టివి 4 ఎక్స్ 65-ఇంచ్ మరియు Mi టివి 4A 40-ఇంచ్. ఆసక్తికరమైన మరొక విషయం ఏమిటంటే ఈ నాలుగు Mi టీవీలు నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో మరియు ఆండ్రాయిడ్ 9.0 అవుట్-ఆఫ్-బాక్స్‌తో వస్తాయి.

షియోమి

షియోమి ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మరియు గ్లోబల్ VP మను జైన్ మీడియాతో మాట్లాడుతు షియోమి సంస్థ యొక్క పాత Mi టివిలను ఎంచుకున్న వారికి వారి టీవిలో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో మరియు ఆండ్రాయిడ్ 9.0 అప్గ్రేడ్ అయి వస్తున్నట్లు ప్రకటించారు. కొత్తగా అప్గ్రేడ్ అయిన పాత టీవీల మోడల్ పేర్లను కూడా ఆయన ప్రకటించారు.

నెట్‌ఫ్లిక్స్

నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో మరియు ఆండ్రాయిడ్ 9.0 అప్డేట్ షియోమి యొక్క ఐదు పాత Mi టీవీ మోడళ్లకు వస్తాయని జైన్ ధృవీకరించారు. ఈ టీవీ మోడల్స్ వరుసగా Mi టివి 4 A ప్రో 32-ఇంచ్, Mi టివి 4 A ప్రో 43-ఇంచ్, Mi టివి 4 A ప్రో 49-ఇంచ్, Mi టివి 4 C ప్రో 32-ఇంచ్, మరియు Mi టివి 4 ప్రో 55-ఇంచ్.

అమెజాన్

నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో మరియు ఆండ్రాయిడ్ 9.0 సపోర్ట్ కొన్ని Mi టివి ప్రో మోడళ్లకు మాత్రమే వస్తోందని గమనించాలి. ప్రస్తుతం ఉన్న ఈ Mi టీవీ మోడళ్ల కోసం నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో మరియు ఆండ్రాయిడ్ 9.0 యొక్క రోల్‌అవుట్ టైమ్‌లైన్‌ను జైన్ ధృవీకరించలేదు. అయితే రోల్‌అవుట్ చాలా త్వరగా జరుగుతుందని ఆశిద్దాము.

మొత్తం తొమ్మిది Mi టివి

ఇప్పుడు మొత్తం తొమ్మిది Mi టివిలలో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో మరియు ఆండ్రాయిడ్ 9.0 ఆన్‌బోర్డ్ సపోర్ట్ ఉన్నాయి. ఆ టీవీలు వరుసగా Mi టీవీ 4 A ప్రో 32-ఇంచ్, Mi టీవీ 4 A ప్రో 43-ఇంచ్, Mi టీవీ 4 A ప్రో 49-ఇంచ్, Mi టీవీ 4 C ప్రో 32-ఇంచ్, Mi టీవీ 4 ప్రో 55-ఇంచ్, Mi టీవీ 4 ఎక్స్ 43- ఇంచ్, Mi టివి 4 ఎక్స్ 50-ఇంచ్, Mi టివి 4 ఎక్స్ 65-ఇంచ్ మరియు Mi టివి 4 A 40-ఇంచ్ మొదలైనవి.

ఆండ్రాయిడ్

Mi టివి 4 ఎక్స్ 43-ఇంచ్, Mi టివి 4 ఎక్స్ 50-ఇంచ్, Mi టివి 4 ఎక్స్ 65-ఇంచ్ మరియు Mi టివి 4 A 40-ఇంచ్ టీవీలు నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో మరియు ఆండ్రాయిడ్ 9.0 అవుట్-ఆఫ్-బాక్స్‌తో వస్తాయి. ఇప్పటికే ఉన్న టీవీలకు అప్డేట్ ద్వారా మద్దతు లభిస్తుంది.

నెట్‌ఫ్లిక్స్

కొత్త టీవీలు ప్రత్యేకమైన నెట్‌ఫ్లిక్స్ మరియు అమెజాన్ ప్రైమ్ వీడియో బటన్‌ను కలిగి ఉన్న సరికొత్త రిమోట్‌తో వస్తాయి. ప్రస్తుతానికి పాత Mi టివి మోడల్స్ కు నెట్‌ఫ్లిక్స్ మరియు అమెజాన్ ప్రైమ్ వీడియో బటన్‌తో కొత్త రిమోట్‌తో కలిసి వస్తాయో లేదో సమాచారం లేదు.

Best Mobiles in India

English summary
5 Xiaomi Mi TVs Gets Netflix, Amazon and Android 9.0 Update Support

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X