జోలో ‘బ్లాక్’ స్మార్ట్‌ఫోన్

Posted By:

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ లావా తన సబ్‌బ్రాండ్ జోలో నుంచి ‘బ్లాక్' పేరుతో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. మరకలు పడని డిస్‌ప్లే, డ్యుయల్ కెమెరా సెటప్, ఫ్టాస్ ఫోకస్ టెక్నాలజీ ఇలా ఎన్నో ప్రత్యేక ఫీచర్లను కలిగి ఉన్న ఈ ఫోన్ మార్కెట్ ధర రూ.12,999. ప్రముఖ రిటైలర్ ఫ్లిప్‌కార్ట్ జూలై 13 నుంచి ఈ ఫోన్‌లను ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయించనుంది.

Read More: ఈ 10 ఫోన్‌లలో గేమింగ్ అదుర్స్

జోలో ‘బ్లాక్’ స్మార్ట్‌ఫోన్

స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే...

5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ ఓజీఎస్ డిస్‌ప్లే (1080 పిక్సల్ రిసల్యూషన్, 401 పీపీఐ పిక్సల్ డెన్సిటీ), ప్రత్యేకమైన బ్యాక్లైట్ పవర్ బటన్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, కంపెనీ ప్రత్యేకంగా డిజైన్ చేసిన హైవ్ యూజర్ ఇంటర్ ఫేస్, 64 బిట్ స్నాప్‌డ్రాగన్ 615 (సెకండ్ జనరేషన్) ఆక్టా‌కోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, అడ్రినో 405 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా డివైస్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం ఉంది.

Read More: ఈ 10 ఫోన్‌లలో మల్టీ టాస్కింగ్ అదుర్స్!

జోలో ‘బ్లాక్’ స్మార్ట్‌ఫోన్

క్రోమా ఫ్లాష్, ఫ్టాస్ ఫోకస్ టెక్నాలజీతో కూడిన డ్యుయల్ కెమెరా సెటప్‌ను ఫోన్ వెనుక భాగలో ఏర్పాటు చేసారు. డ్యుయల్ కెమెరా సెటప్‌లో భాగంగా ఫోన్ వెనుక భాగంలో ఏర్పాటు చేసిన రెండు కెమెరాల్లో ఒకటి 13 మెగా కెమెరా సెన్సార్‌ను కలిగి ఉండగా, మరొకటి 2 మెగా పిక్సల్ కెమెరా సెన్సార్‌ను కలిగి ఉంది. ఫోన్ ముందు భాగంలో ఏర్పాటు 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ద్వారా అత్యుత్తమ వీడియో కాలింగ్‌తో పాటు హైక్వాలిటీ సెల్పీలను చిత్రీకరించుకోవచ్చు.

Read More: బెస్ట్ ఆండ్రాయిడ్ అప్లికేషన్‌లు (2015)

జోలో ‘బ్లాక్’ స్మార్ట్‌ఫోన్

కనెక్టువిటీ ఫీచర్లు.. డ్యుయల్ సిమ్, ఎల్టీఈ సపోర్ట్, వై-ఫై ఇంకా బ్లూటూత్. 3.200 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. కామెట్ పేరుతో సరికొత్త బ్రౌజర్‌ను జోలోతన బ్లాక్ ఫోన్‌లో నిక్షిప్తం చేసింది. ఈ బ్రౌజర్ ద్వారా వేగవంతమైన ఇంటర్నెట్ సర్ఫింగ్‌ను ఆస్వాదించవచ్చని కంపెనీ పేర్కొంది.

Read More: 6 మోస్ట్ వాంటెడ్ సాఫ్ట్‌వేర్ స్కిల్స్ (మీలో ఉన్నాయా..?)

జోలో ‘బ్లాక్’ స్మార్ట్‌ఫోన్

ఆంధ్రప్రేదేశ్‌‌లో లావా మొబైల్స్ తయారీ యూనిట్..?

రూ.250 కోట్ల పెట్టబుడుల అంచనాలతో ఒక మొబైల్ అసెంబ్లిగ్ యూనిట్ ను దేశంలో నెలకొల్పేందుకు లావా మొబైల్స్ సిద్ధంగా ఉంది. ఈ యూనిట్ ఏర్పాటు నిమిత్తం ఆంధ్రప్రదేశ్, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చలు జరుపుతున్నట్లు లావా ఇంటర్నేషనల్ డైరెక్టర్ విశాల్ సెహగాల్ తెలిపారు.

English summary
Xolo Black with unique dual-camera launched on Flipkart. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot