Reliance Jio ఇతర టెల్కోలతో పోలిస్తే ఇందులో వెనుకబడింది...

|

రిలయన్స్ జియో మొదటిసారి రూ.1,699 ప్లాన్‌ను ప్రవేశపెట్టినప్పుడు వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్‌లు 2018 లో ట్రెండ్‌గా మారాయి. జియో అడుగుజాడలను అనుసరించి ఇతర ప్రైవేట్ టెల్కోలు భారతి ఎయిర్‌టెల్ మరియు వొడాఫోన్ ఐడియాతో పాటు ప్రభుత్వ నేతృత్వంలోని బిఎస్‌ఎన్‌ఎల్‌ కూడా వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్‌లను ప్రవేశపెట్టాయి.

రిలయన్స్ జియో

రిలయన్స్ జియో కొంతకాలంగా తన ప్రీపెయిడ్ ప్లాన్‌లను సవరిస్తున్నది. ఇందులో భాగంగా దాని వార్షిక ప్రణాళికలలో కూడా కొన్ని చిన్న మార్పులను తీసుకువచ్చింది. జియో ఇప్పుడు 336 రోజుల చెల్లుబాటుతో రోజుకు 1.5GB డేటాను రూ.2,121 ధర గల వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్‌తో అందిస్తోంది. మరోవైపు బిఎస్‌ఎన్‌ఎల్‌లో రూ.1,999 ధర వద్ద గల తన వార్షిక ప్లాన్‌తో 3GB రోజువారీ డేటాను అందిస్తున్నది. అలాగే ఎయిర్‌టెల్ మరియు వోడాఫోన్ ఐడియా కూడా వరుసగా రూ.2,398 మరియు రూ.2,399 ధరల వద్ద తన వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్‌లను అందిస్తున్నాయి. రిలయన్స్ జియో అందిస్తున్న ఈ ప్లాన్‌లో రెండు అంశాలలో ప్రతికూలతలు ఉన్నాయి. అవి రూ.2,121 ప్రీపెయిడ్ ప్లాన్ యొక్క చెల్లుబాటు మరియు ఇతర నంబర్లకు అవుట్గోయింగ్ వాయిస్ కాలింగ్. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

టెల్కోస్ యొక్క వార్షిక డైలీ డేటా ప్రీపెయిడ్ ప్లాన్‌లు

టెల్కోస్ యొక్క వార్షిక డైలీ డేటా ప్రీపెయిడ్ ప్లాన్‌లు

Jio యొక్క దీర్ఘకాలిక ప్రీపెయిడ్ ప్లాన్‌

 

Jio యొక్క దీర్ఘకాలిక ప్రీపెయిడ్ ప్లాన్‌ 1.5GB రోజువారీ డేటా సమర్పణతో మొత్తం చెల్లుబాటు కాలానికి 504GB డేటాను అందిస్తుంది. అలాగే Jio to Jio అపరిమిత వాయిస్ కాలింగ్, 12000 నిమిషాల నాన్-జియో వాయిస్ కాల్స్ మరియు రోజుకు 100 SMS వంటి ప్రయోజనాలను అందిస్తుంది. ఈ ప్రయోజనాలు అన్ని రీఛార్జ్ చేసిన తేదీ నుండి 336 రోజుల వరకు చెల్లుతాయి. ఇది జియో సినిమా, జియోటివి మరియు అన్ని జియో యాప్ లకు కాంప్లిమెంటరీ చందాను కూడా అందిస్తుంది.

 

బిఎస్ఎన్ఎల్

బిఎస్ఎన్ఎల్

బిఎస్ఎన్ఎల్ తన రూ.1,699 ప్రీపెయిడ్ ప్లాన్ యొక్క చెల్లుబాటును ఇటీవల 300 రోజులకు తగ్గించినందున రోజువారీ డేటా ప్రయోజనంతో ఉన్న ఏకైక వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్ రూ.1,999. ఈ ప్లాన్‌లో 3GB డేటా, రోజుకు 250 నిమిషాల వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు, బిఎస్‌ఎన్‌ఎల్ టివి, బిఎస్‌ఎన్‌ఎల్ ట్యూన్స్‌కు మొదటి 60 రోజులు చందాను అందిస్తుంది. డేటా, కాలింగ్ మరియు SMS ప్రయోజనాలు 365 రోజులు చెల్లుతాయి.

భారతి ఎయిర్‌టెల్ మరియు వొడాఫోన్ ఐడియా

భారతి ఎయిర్‌టెల్ మరియు వొడాఫోన్ ఐడియా

భారతి ఎయిర్‌టెల్ మరియు వొడాఫోన్ ఐడియా యొక్క రూ.2,398 మరియు రూ.2,399 వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్‌లు రోజుకు 1.5GB డేటాను అందిస్తున్నాయి. ఇవి రెండు భారతదేశంలోని ఏ నెట్‌వర్క్‌కు అయిన అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌ల ప్రయోజనాలను 365 రోజుల చెల్లుబాటు కాలానికి అందిస్తున్నాయి.

రేసులో వెనుకబడిన రిలయన్స్ జియో

రేసులో వెనుకబడిన రిలయన్స్ జియో

రిలయన్స్ జియో యొక్క ప్రయోజనాలు మరియు యాక్సిస్ విషయానికి వస్తే ఇతర టెల్కోల కంటే వెనుకబడి ఉంది. జియో యొక్క రూ.2,121 ప్రీపెయిడ్ ప్లాన్ ఎయిర్టెల్ మరియు వోడాఫోన్ ఐడియా నుండి వస్తున్న వార్షిక ప్లాన్ ల కంటే కొంచెం తక్కువ ఖర్చు అవుతుంది. అయితే ఇది కేవలం 336 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. అంటే 365 రోజులు సేవలను పొందడానికి వినియోగదారులు మరో నెలవారీ రీఛార్జ్ చేయవలసి ఉంటుంది.

వాయిస్ కాల్‌లపై సౌలభ్యం

వాయిస్ కాల్‌లపై సౌలభ్యం

అలాగే ఇతర నెట్‌వర్క్‌లకు అవుట్‌గోయింగ్ వాయిస్ కాల్‌లపై FUP పరిమితి ఉంటుంది. ఎయిర్‌టెల్ మరియు వొడాఫోన్ ఐడియా అందిస్తున్న వాయిస్ కాల్స్ ప్రయోజనంతో పరిశీలిస్తే రిలయన్స్ జియో కేవలం 12,000 నాన్-జియో నిమిషాలను రూ .2,121 ప్రీపెయిడ్ ప్లాన్‌తో అందిస్తోంది.

రోజువారీ డేటా సౌలభ్యం

రోజువారీ డేటా సౌలభ్యం

వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్‌లో ఉత్తమ రోజువారీ డేటా ప్రయోజనమును బిఎస్‌ఎన్‌ఎల్ యొక్క రూ.1,999 ప్లాన్ అందిస్తోంది. అయితే ఇది 250 రోజువారీ ఎఫ్‌యుపి నిమిషాలను మరియు 4G సేవలు లేకపోవడం వంటి రెండు నష్టాలను కలిగి ఉంది. ఎక్కువ సమయం మాట్లాడేవారికి భారతి ఎయిర్‌టెల్ మరియు వొడాఫోన్ ఐడియా యొక్క వార్షిక ప్రణాళికలు సరైన ఎంపికలు. అలాగే భారీ డేటా ప్లాన్ కోసం చూస్తున్న వారికి బిఎస్‌ఎన్‌ఎల్ యొక్క రూ.1,999 ప్లాన్ ఉత్తమమైన ఎంపిక.

Best Mobiles in India

English summary
Reliance Jio Loses the Annual Prepaid Plans Battle War

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X