ఆపిల్ కంపెనీకి షాకిచ్చిన ఇండియా !

By Hazarath
|

ఆపిల్ ఫోన్లకు కేంద్రప్రభుత్వం షాకిచ్చింది. ఆపిల్ అనుకున్న ప్లాన్ ఇండియాలో అమలు చేయకూడదని ఖరాఖండిగా చెప్పేసింది. పాత ఫోన్ల మార్కెట్ పై కన్నేసిన ఆపిల్ తన సెక్ండ్ హ్యండ్ ఫోన్లను ఇండియాలో విక్రయించాలని ఎప్పటినుంచో అనుకుంటూ వస్తోంది. అయితే ఈ ప్రతిపాదనను ఆపిల్ కంపెనీ కేంద్రప్రభుత్వానికి తెలపగా కేంద్ర ప్రభుత్వం దీనిని రిజెక్ట్ చేసింది. మరి ఎందుకు రిజెక్ట్ చేసింది. వాచ్ ఆన్ ది స్టోరీ.

Read more: విదేశాల్లో వాడిపారేసిన ఐఫోన్లు ఇండియాలోకి..

ఆపిల్ కంపెనీకి షాకిచ్చిన ఇండియా !

ఆపిల్ కంపెనీకి షాకిచ్చిన ఇండియా !

కుప్పలు తెప్పలుగా వస్తోన్న విదేశీ ఫోన్లతో ఇండియా ఓ డంప్ యార్డ్ లా తయారవుతోంది. ఫోన్లు మాత్రమే కాకుండా ఎలక్ట్రానిక్ పరికరాలు ఇండియాను కమ్మేస్తున్నాయి. ఇవి చాలదన్నట్లు ఇక వాడేసిన ఫోన్లు కూడా ఇండియాకు వస్తే ఇండియా చెత్త మార్కెట్ అయ్యే అవకాశం ఉంది.

ఆపిల్ కంపెనీకి షాకిచ్చిన ఇండియా !

ఆపిల్ కంపెనీకి షాకిచ్చిన ఇండియా !

ఇదే కోవలో విదేశాల్లో వాడేసిన ఫోన్లను బాగు చేసి ఇండియాకు తెచ్చి విక్రయించాలని చూసిన దిగ్గజ మొబైల్ సంస్థ ‘ఆపిల్'కు ఎదురుదెబ్బ తగిలింది. ఆపిల్ చేసిన ఈ ప్రతిపాదనను కేంద్రం తిరస్కరించినట్లు విశ్వసనీయంగా తెలిసింది.

ఆపిల్ కంపెనీకి షాకిచ్చిన ఇండియా !

ఆపిల్ కంపెనీకి షాకిచ్చిన ఇండియా !

నిజానికి ఆపిల్ చేసిన ఈ ప్రతిపాదన దేశంలో పెద్ద కదలికే తెచ్చింది. ప్రపంచంలోనే నంబర్-1 సంస్థయిన ఆపిల్ గనక ఈ మార్కెట్లోకి వస్తే ఐఫోన్లు మరింత చౌకగా వస్తాయని, అందుబాటులోకి వస్తాయని చాలామంది భావించారు. అదీగా ఆపిల్ బ్రాండ్ దానికి తోడుంటుంది కనక పాత ఫోనైనా సరే నమ్మకమైన సర్వీసు ఉంటుందని, సెకండ్ హ్యాండ్ మార్కెట్లో ఇదో సంచలనమవుతుందని చాలామంది భావించారు.

ఆపిల్ కంపెనీకి షాకిచ్చిన ఇండియా !

ఆపిల్ కంపెనీకి షాకిచ్చిన ఇండియా !

అయితే ఆపిల్‌ను అనుమతిస్తే పాత ఫోన్లన్నీ ఇండియాకు దిగుమతి అయి వస్తాయని, దీనికితోడు ఇండియాలో తయారీని ప్రోత్సహించడానికి కేంద్రం చేపట్టిన ‘మేక్ ఇన్ ఇండియా' ప్రచారానికి కూడా దెబ్బ తగులుతుందని మరికొందరు ఆందోళన వ్యక్తంచేశారు.

ఆపిల్ కంపెనీకి షాకిచ్చిన ఇండియా !

ఆపిల్ కంపెనీకి షాకిచ్చిన ఇండియా !

ఆపిల్ ప్రత్యర్థి కంపెనీలైతే ఈ ప్రతిపాదనను ఆమోదిస్తే ప్రమాదకర పరిణామాలు చోటు చేసుకుంటాయంటూ ప్రభుత్వానికి అభ్యర్థనలు కూడా పంపాయి. ఇవన్నీ చూశాక కేంద్రం మాత్రం యాపిల్ ప్రతిపాదనకు నో చెప్పినట్లు ‘బ్లూమ్‌బర్గ్' వార్తా సంస్థ తెలియజేసింది.

ఆపిల్ కంపెనీకి షాకిచ్చిన ఇండియా !

ఆపిల్ కంపెనీకి షాకిచ్చిన ఇండియా !

ఇలాంటి ప్రతిపాదనను గతేడాది పర్యావరణ మంత్రిత్వ శాఖ తిరస్కరించింది. ఆపిల్ మళ్లీ చేసిన దరఖాస్తును కేంద్రం తోసిపుచ్చింది'' అని పేరు వెల్లడి కావటానికి ఇష్టపడని టెలికం అధికారి ఒకరు చెప్పినట్లు బ్లూమ్‌బర్గ్ తెలియజేసింది.

ఆపిల్ కంపెనీకి షాకిచ్చిన ఇండియా !

ఆపిల్ కంపెనీకి షాకిచ్చిన ఇండియా !

దేశంలో సెకండ్ హ్యాండ్ ఫోన్ల మార్కెట్ విలువ అక్షరాలా ఏడాదికి ఇరవై వేల కోట్ల రూపాయలు. పెపైచ్చు ఏటా 25-30 శాతం పెరుగుతోంది కూడా. అందుకే ఈ మార్కెట్లో సింహ భాగాన్ని చేజిక్కించుకోవచ్చన్న ఉద్దేశంతో యాపిల్ పావులు కదిపింది.

ఆపిల్ కంపెనీకి షాకిచ్చిన ఇండియా !

ఆపిల్ కంపెనీకి షాకిచ్చిన ఇండియా !

నిజానికి ఇంత భారీ ఆదాయం ఉన్న మార్కెట్లో ఇప్పటిదాకా బ్రాండెడ్ కంపెనీలేవీ లేవు. ఎక్కడికక్కడ వ్యాపారులే పాత ఫోన్లను కొని, వాటికి మెరుగులు దిద్ది విక్రయిస్తున్నారు. స్థానికంగా విక్రయించటంతో పాటు ఈబే సహా కొన్ని ఈ-కామర్స్ సైట్ల ద్వారా కూడా వీరే విక్రయిస్తున్నారు.

ఆపిల్ కంపెనీకి షాకిచ్చిన ఇండియా !

ఆపిల్ కంపెనీకి షాకిచ్చిన ఇండియా !

ఇక కొన్ని ఫోన్లకు మెరుగులు దిద్దకుండానే తాము వాడేసిన ఫోన్లను జనం నేరుగా క్వికర్, ఓఎల్‌ఎక్స్ తదితర సైట్ల ద్వారా విక్రయానికి పెడుతున్నారు. అంతేతప్ప ఫోన్లను తయారు చేస్తున్న ఏ కంపెనీ కూడా ఇండియాలో అధికారికంగా మెరుగుల దిద్దిన ఫోన్లను విక్రయించటం లేదు. అందుకే ఆపిల్ దీన్నొక అవకాశంగా తీసుకుంది.

ఆపిల్ కంపెనీకి షాకిచ్చిన ఇండియా !

ఆపిల్ కంపెనీకి షాకిచ్చిన ఇండియా !

అయితే ఆపిల్ చేసిన విన్నపానికి కేంద్రం నుంచి షాక్ తగలడంతో ఇప్పుడు తన ప్రయత్నాన్ని విరమించుకున్నట్లయింది. మరి ముందు ముందు ఆపిల్ తన ప్రయత్నాలను ఏ మేరకు చేస్తుందో చూడాలి.

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

లేటెస్ట్ టెక్నాలజీ అప్‌డేట్ కోసం క్లిక్ చేయండి.

Best Mobiles in India

English summary
Apple's plan to sell refurbished iPhones in India runs into hurdles

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X